ముంబై: ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం ముంబైలో శనివారం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఉత్తమ నటుడి అవార్డు కైవసం చేసుకున్నట్లు ప్రముఖ మ్యాగజైన్ ' ఫెమినా' తన ట్విటర్ట్ అకౌంట్‌లో పేర్కొంది. ఇంతకీ ఉత్తమ నటుడి అవార్డును ఇర్పాన్ ఖాన్ దక్కించుకుంటే ఇర్పాన్ పఠాన్ పేరును ప్రచురించారు..
అయితే పొరపాటున ఇర్ఫాన్ పఠాన్ పేరును సదరు మ్యాగ్‌జైన్ కోడ్ చేయడం ట్విట్టర్‌లో జోకుల వర్షం కురిసింది. కాగా, దీనిపై ఇర్పాన్ పఠాన్ తనదైన శైలిలో స్పందించాడు. ' నాకు అవార్డు ఇచ్చిన వారికి ధన్యవాదాలు. నేను అవార్డు అందుకోవడానికి రాలేను. నా అవార్డును ఇంటికి పంపించండి' అని పఠాన్ సరదాగా బదులిచ్చాడు.
Thank u n sorry I couldn’t make it but u can send the award to me at my home ;);)
— Irfan Pathan (@IrfanPathan) 21 January 2018
Comments
Please login to add a commentAdd a comment