
సాక్షి, అనంతపురం : పేదల ఇళ్ల పట్టాల కోసం భూమి ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులకు కదిరి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. నల్లచెరువు తహశీల్దార్ కార్యాలయం వేలం వేసి రైతులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 1987లో జరిగిన భూ సేకరణలో భాగంగా రామిరెడ్డి, నరసింహారెడ్డి అనే ఇద్దరు రైతులకు చెందిన రెండు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఎకరాకు కేవలం 3 వేల రూపాయలు మాత్రమే పరిహారంగా చెల్లించారు. దీంతో భూసేకరణలో తమకు అన్యాయం జరిగిందంటూ వారిద్దరు కోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో బుధవారం ఈ కేసును విచారించిన కదిరి కోర్టు తహశీల్దార్ కార్యాలయ్యాన్ని వేలం వేసి రైతులకు పరిహారం అందజేయాలని తీర్పునిచ్చింది. దీంతో 30 ఏళ్ల తర్వాత రైతులకు సరైన పరిహారం దక్కింది. కాగా తహశీల్దార్ కార్యాలయాన్ని 10.25 లక్షల రూపాయలకు వేలం వేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment