
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా పర్యటనకు తేదీ ఖరారైంది. ఈ నెల 10వ తేదీన కంటివెలుగు కార్యక్రమాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల, పీటీసీ మైదానాలను శనివారం సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంట్రామిరెడ్డి, విద్యా సంస్కరణల కమిటీ సభ్యులు ఆలూరు సాంబశివారెడ్డిలు పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ సత్యయేసుబాబు సమీక్ష నిర్వహించారు.
ఐదు కోట్ల మంది ప్రజల కోసమే కంటివెలుగు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యాన్ని అందించటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచ కంటి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని చేపట్టామని అనంతపురం అర్భన్ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి చెప్పారు. తొలిదశలో విద్యార్థులకు కంటి పరీక్షలు జరగనున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కాగా, ఆటోలు, క్యాబ్‌లు, కార్లు నడుపుకొని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఏటా రూ.10 వేలు చొప్పున అందించే ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకాన్ని సీఎం జగన్ శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment