అమరావతి: ఏపీ పాఠశాలల్లో ఇకపై మొబైల్ వాడకాన్ని నిషేధిస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల తోపాటు ఉపాధ్యాయులు కూడా తమ వెంట మొబైల్ ఫోన్లు తీసుకురావడానికి వీల్లేదని కచ్చితమైన ఆదేశాలను జారీ చేసింది.
ఏపీ విద్యాశాఖ స్కూళ్లలో మొబైల్ ఫోన్లు వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు తమవెంట ఫోన్లు తీసుకు రావడాన్ని పూర్తిగా నిషేదించింది. అలాగే ఉపాధ్యాయులు కూడా క్లాసులోకి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్ళడానికి వీల్లేదని తెలిపింది. తరగతి గదిలోకి వెళ్లే ముందే ఉపాధ్యాయులు తమ ఫోన్లను హెడ్‌మాస్టర్‌కు అప్పగించి వెళ్ళా లని ఆదేశించింది ప్రభుత్వం.
బోధన సమయంలో ఎటువంటి ఆటంకం రాకుండా, ఉపాధ్యాయుల తోపాటు విద్యార్థులు తమ పూర్తి ఏకాగ్రత పాఠ్యాంశాల మీదనే ఉంఛాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఏపీ విద్యా శాఖ. యునెస్కో ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఇది దోహదపడుతుందని తెలిపింది పాఠశాల విద్యా శాఖ.
ఇది కూడా చదవండి: దుర్గగుడి పాలకమండలి సమావేశం.. భక్తులకు గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment