సాక్షి, అనంతపురం: ‘అమ్మఒడి పథకం’ వల్ల అక్షరాస్యత శాతం గణనీయంగా పెరుగుతుందని ఏపీ మంత్రి శంకర్ నారాయణ స్పష్టం చేశారు. అనంతపురం శారదా మున్సిపల్ హైస్కూల్లో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి మంత్రి శంకర్ నారాయణ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్ర సృష్టిస్తున్నాయని తెలిపారు. అమరావతిలో బినామీ ఆస్తులు కాపాడుకునేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఏపీలోని 13 జిల్లాలను అభివృద్ధి చేస్తామంటే చంద్రబాబు వద్దంటున్నారని.. రాయలసీమ, ఉత్తరాంధ్ర లకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. బోస్టన్, జీఎన్ రావు కమిటీ నివేదికలను హైపర్ కమిటీ నిశితంగా పరిశీలిస్తోందని.. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ ఏపీకి అత్యవసరం అని శంకర్‌నారాయణ పేర్కొన్నారు.
దేశం చూపు..జగన్ పాలన వైపు..
అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన వైపు.. దేశం యావత్తు చూస్తోందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. అమ్మఒడి పథకం పేద విద్యార్థుల పాలిట ఓ వరం అని ఏపీ పాఠశాల విద్య కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ పామిడి వీరాంజనేయులు చెప్పారు.
(చదవండి: ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోండి: సీఎం జగన్)
(చదవండి: ‘వచ్చారు జగన్.. మెచ్చారు జనం’)
Comments
Please login to add a commentAdd a comment