
సాక్షి, అనంతపురం: ఏపీలోని 13 జిల్లాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తోంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు బినామీ ఆస్తుల పరిరక్షణకు పాకులాడటం సిగ్గుచేటని మంత్రి శంకర్‌నారాయణ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బోస్టన్, జీఎన్ రావు కమిటీ నివేదికలను హైపర్ కమిటీ పరిశీలిస్తోందని.. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందటం చంద్రబాబు, టీడీపీ నేతలకు ఇష్టం లేదని... అందుకే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో టీడీపీ నేతలు భారీగా భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. చంద్రబాబు బినామీలు అమరావతిలో 4,500 ఎకరాలు భూములను కొన్నారన్నారు. చంద్రబాబు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని.. శివరామకృష్ణయ్య, శ్రీకృష్ణ కమిటీ నివేదికలను ఎందుకు పక్కన పెట్టారో సమాధానం చెప్పాలన్నారు.మాజీ మంత్రి నారాయణ కమిటీ సిఫార్సులతో రాజధాని ఏర్పాటు హాస్యాస్పదమన్నారు. రైతుల నుంచి లాక్కున్న భూముల ను టీడీపీ నేతలు వెనక్కి ఇచ్చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment