కేంద్రమంత్రిని కలిసిన శంకర నారాయణ | Shankar Narayana And MP Krishna Devarayalu Meet Nitin Gadkari | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రిని కలిసిన శంకర నారాయణ

Published Tue, Dec 22 2020 9:05 PM | Last Updated on Tue, Dec 22 2020 9:34 PM

Shankar Narayana And MP Krishna Devarayalu Meet Nitin Gadkari - Sakshi

సాక్షి, ఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఏపీ రోడ్లు, భవనాల మంత్రి శంకర నారాయణ, ఎంపీ కృష్ణదేవరాయలు మంగళవారం కలిశారు. రాష్ట్రంలో 16 పోర్టులకు జాతీయ రహదారుల కనెక్టివిటీ చేయాలని కేంద్రమంత్రికి వినతించారు. అనంతరం మంత్రి శంకర నారాయణ మీడియాతో మాట్లాడుతూ విశాఖ పోర్టు-భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు కోస్టల్‌ రోడ్‌ మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరామని వెల్లడించారు. విజయవాడ-బెంగళూరు వరకు గ్రీన్‌ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ వేను ఫేజ్‌-1లో చేపట్టాలని, విజయవాడ కాజా టోల్‌ ప్లాజా-ఒట్టిపాడు వరకు బైపాస్ మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. రైల్వే అండర్ బ్రిడ్జి, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరామని మంత్రి శంకర నారాయణ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement