సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తూ.. నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్ నారాయణ ధన్యవాదాలు తెలిపారు. పనుల్లో 50 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని భావించినందుకు మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా అనంతరం మీడియా పాయింట్‌లో మంత్రి మాట్లాడారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని కొనియాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన బిల్లును సభలో ప్రవేశపెడితే సీఎంకు మంచి పేరు వస్తుందని టీడీపీ ఎమ్మెల్యేలు కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.
బీసీలకు చంద్రబాబు ప్రవేశ పెట్టిన బడ్జెట్ కంటే వైఎస్ జగన్ 20 శాతం అధికంగా ప్రవేశపెట్టారని మంత్రి అన్నారు. బడుగుబలహీన వర్గాల బాధలు తెలిసిన వ్యక్తి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని.. పాదయాత్రలో వారికిచ్చిన హామీ మేరకు ఈ బిల్లును ప్రవేశ పెట్టారని తెలిపారు. బీసీల పట్ల చంద్రబాబు గతంలో కపట ప్రేమ చూపించారని మంత్రి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment