
సాక్షి,అమరావతి : బీసీలను వాడుకోవడంలో చంద్రబాబు దిట్ట అని, ఆయన బీసీల ద్రోహి అంటూ బీసీ శాఖ మంత్రి శంకర్ నారాయణ ఘాటుగా విమర్శించారు. అసెంబ్లీ సంప్రదాయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని అన్నారు. బీసీ కనుకే తమ్మినేని సీతారాంను స్పీకర్ చైర్ వద్దకు తీసుకురాలేదని ఆరోపించారు. వైఎస్ జగన్ బీసీలకు పెద్ద పీఠ వేశారని కొనియాడారు. బీసీలకు ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామని అన్నారు.
బలహీన వర్గాలకు చెందిన ఒక సీనియర్ నాయకుడిని (తమ్మినేని సీతారాం) వైఎస్సార్‌సీపీ స్పీకర్ పదవికి ఎన్నిక చేస్తే సభా సంప్రదాయాలను గౌరవించి ఆయన్ను అన్ని పార్టీల నాయకులు స్పీకర్ స్థానం వరకు తీసుకువెళ్లి సాదరంగా కూర్చోబెట్టడానికి ప్రతిపక్ష నేత ముందుకు రాకపోవడం ప్రతి ఒక్కరిలోనూ ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత కూడా స్పీకర్ తమ్మినేనిని అభినందిస్తూ సభ్యులు చేసే ప్రసంగాలు ముందుకు సాగకుండా రాజకీయపుటెత్తుగడలు పన్నడంపై కూడా అందరినీ విస్మయానికి గురి చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment