
రొద్దం: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకపోవడానికి సీఎం చంద్రబాబు అసమర్థతే కారణమని వైఎస్‌ఆర్‌సీపీ నేత శంకరనారాయణ ధ్వజ మెత్తారు. గురువారం హిందూపురంలోని రుద్రపాద ఆశ్రమంలో మండల పార్టీ కన్వీనర్ బి.నారాయణరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త, నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపు నిచ్చారు. చంద్రబాబు ఒటుకు కోట్లు కేసు నుంచి బయటపడడానికి ప్రత్యేక హోదాను మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. నిధులపై గట్టిగా మాట్లడితే ఎక్కడ కేసులు ప్రస్తావన తెస్తారన్న భయంతోనే నిధుల కేటాయింపులపై మాట్లాడలేక పోతున్నారని విమర్శించారు.
నిధుల కేటాయింపుల్లో రాష్ట్రానికి మొండిచేయి చూపిన కేంద్రంతో చంద్రబాబు అంటకాగకుండా ధైర్యం ఉంటే బయటకు వచ్చి కేంద్రంతో పోరాటం చేయాలని సూచించారు. ప్రజలను మభ్యపెడుతూ చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియచెప్పాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలే పట్టు కొమ్మలని, రానున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 14 లోపు ఎవరైనా కొత్త ఓటర్లు ఉంటే జాబితాలో చేర్పించాల్సిన బాధ్యత బూత్ కన్వీనర్లపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ మారుతిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మినారాయణరెడ్డి లతో పాటు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment