సాక్షి, అనంతపురం : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ శనివారం పరిగి మండలం హోన్నంపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో మంత్రి మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా ప్రపంచబ్యాంకు వెనుదిరగడం చంద్రబాబు పుణ్యమేనని ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్లలో రాజధాని ప్రాంతంలో పిచ్చి మొక్కలు మొలిచాయే తప్ప అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం పేరుతో భూములను చదును చేయడానికి దాదాపు రూ. 175 కోట్ల ప్రభుత్వ నిధులను ఉపయోగించిన బాబు అదే నిధులతో రాజధాని ప్రాంత అభివృద్ధిని మాత్రం చేపట్టడంలో విఫలమవ్వడమే గాక, ఇప్పుడు ఈ తప్పులను మఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదకు నెడుతున్నారని మంత్రి ఆరోపించారు.
పార్టీలకతీతంగా ప్రభుత్వ ఫలాలను అర్హులకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలను ఇంటింటికీ చేర్చేందుకే గ్రామ వలంటీర్లను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద రూ. 12,500 అందిస్తామని, పంటల బీమా ప్రీమియంలను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment