BC Welfare Minister
-
బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరణ
-
మీకు నేనెవరో తెలుసా.!
సాక్షి, అనంతపురం : నేనెవరో మీకు తెలుసా? అంటూ బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులను ప్రశ్నించారు. అభ్యర్థులు ఒక్కసారిగా లేచి జిల్లా మంత్రి శంకర నారాయణ అని బదులిచ్చారు. బుధవారం ఉదయం మంత్రి బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా కార్యాలయంలో ఉద్యోగుల వివరాలు అడిగారు. అటెండరు తప్ప తక్కిన ఉద్యోగులు లేకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగురు పని చేయాల్సి ఉండగా అటెండరు మాత్రమే ఉండడమేంటని మండిపడ్డారు. ఇంతలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, టీచరు రవి అక్కడికి చేరుకోగా తాను వచ్చి ఎంతసేపయింది ఇప్పటిదాకా ఎక్కడికెళ్లారు? అంటూ వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా మంత్రి అభ్యర్థులతో మాట్లాడారు. క్వాలిఫై కాకపోయినా చాలామంది శిక్షణ తీసుకుంటున్నామని, తమకు కూడా మెటీరియల్ ఇచ్చేలా చూడాలని మంత్రిని కోరగా..వెంటనే ఆయన స్పందించి డెప్యూటీ డైరెక్టర్ ఉమాదేవితో ఫోన్లో మాట్లాడారు. అదనంగా 100 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా చూడాలని ఆదేశించారు. మొత్తం 300 మందికి స్టడీ మెటీరియల్ ఇస్తారని మంత్రి ప్రకటించగా అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. రెండు బ్యాచ్‌లుగా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. స్టడీ సర్కిల్ డైరెక్టర్ యుగంధర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మానాయక్ ఉన్నారు. ఐసీడీఎస్ ఉద్యోగులపై మంత్రి కన్నెర్ర కలెక్టర్ కార్యాలయానికి పక్కనే ఉన్న కార్యాలయంలో ఇంత నిర్లక్ష్యంగా పని చేస్తున్నారా? అని ఐసీడీఎస్ కార్యాలయ ఉద్యోగులపై మంత్రి శంకరనారాయణ కన్నెర్ర చేశారు. బుధవారం ఉదయం మంత్రి ఐసీడీఎస్ పీడీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఎంతమంది ఉద్యోగులు, ఏయే హోదాల్లో పని చేస్తున్నారని పీడీ చిన్మయిదేవిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బయోమెట్రిక్ వివరాలను అడగగా నెల రోజులుగా యంత్రం పని చేయడం లేదని వివరించగా అటెండెన్స్ రిజిష్టర్ తెప్పించుకుని పరిశీలించారు. అందులో పలు లోపాలను గుర్తించి పీడీని మందలించారు. సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు ఎందుకు సంతకాలు చేయడం లేదని ప్రశ్నించగా...ఏడాది కిందట సస్పెండ్ అయ్యారని మంత్రికి తెలిపారు. ఆ విషయం రికార్డులో పొందుపరచకుండా ప్రతినెలా ఎందుకు ఆయన పేరు రాస్తున్నారంటూ మండిపడ్డారు. మరో సీనియర్ అసిస్టెంట్ భారతి, అటెండెర్ లక్ష్మీదేవి ఆఫీసులో ఉన్నా రిజిష్టరులో ఎందుకు సంతకాలు చేయలేదని? ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడీపై చర్యలకు కలెక్టర్‌కు సిఫార్సు చేస్తానని మంత్రి ప్రకటించారు. -
ఏమిటీ దుర్భరస్థితి ?
సాక్షి, తాడికొండ(గుంటూరు) : స్థానిక బీసీ బాలికల వసతి గృహాన్ని బుధవారం రాత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖామంత్రి శంకర నారాయణ.. స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో కలిసి పరిశీలించారు. 105 మంది విద్యార్థులకుగాను 20 మరుగుదొడ్లు ఉన్నాయి. వీటిలో 10 మరుగుదొడ్లకు తలుపులు ఊడిపోయి ఉండటాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికలు ఉండే వసతి గృహంలో ఇలాంటి దుర్భర పరిస్థితి ఏంటని వార్డెన్‌ను ప్రశ్నించారు. ‘కనీస మరమ్మతులు చేయించాల్సిన బాధ్యత లేదా.. విద్యార్థినులు ఇలాంటి వాటిలో ఎలా కాలకృత్యాలు తీర్చుకుంటార’ని ప్రశ్నించారు. మరమ్మతుల కోసం ఇటీవల అంచనాలు రూపొందించామని బీసీ సంక్షేమ శాఖ డీడీ చినబాబు తెలిపారు. అనంతరం విద్యార్థినులను పిలిచి మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా ? లేదా ? పాలు, గుడ్లు ఎన్నిసార్లు ఇస్తున్నారు. చికెన్ వారంలో ఎన్ని సార్లు అందుతుంది. నాణ్యత ఉంటుందా ? లేదా ? అని ప్రశ్నించారు. అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించిన అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. కష్టపడి చదవండి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ తానూ హాస్టల్లో చదివానని, కష్టపడి చదవాలని సూచించారు. అక్కడ నుంచి స్టోర్ రూమ్‌లో సరుకులను మంత్రి పరిశీలించారు. అనంతరం వండిన అన్నం, కూరలను రుచి చూశారు. బెడ్లు ఒక దానిపై ఒకటి రెండు స్టేర్‌లుగా ఉండటంతో పైన పడుకున్న వారికి ఫ్యాన్లు తగులుతున్నాయని విద్యార్థులు చెప్పగా.. సమస్య పరిష్కారం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. తిరిగి వారం రోజుల్లో ఇదే రోజు వసతి గృహాన్ని తనిఖీ చేస్తానని, ఏమైనా సమస్యలు ఉంటే ఒప్పుకోనని హెచ్చరించారు. అనంతరం మంత్రి శంకరనారాయణ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వసతి గృహాల ఉన్న స్థితిని గుర్తించి ఉన్నత స్థితికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ అమ్మ ఒడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగిందని తెలిపారు. బీసీలంటే బ్యాక్ బోన్ కులాలు అనే విషయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి రుజువు చేస్తున్నారని చెప్పారు. వారి వెంట తాడికొండ, తుళ్లూరు, మేడికొండూరు మండల పార్టీ అధ్యక్షులు తియ్యగూర బ్రహ్మారెడ్డి, బత్లు కిషోర్, కందుల సిద్ధయ్య, మాజీ ఎంపీపీలు బండ్ల పున్నారావు, కొమ్మినేని రామచంద్రరావు, జిల్లా కార్యదర్శి మల్లంపాటి రా«ఘవరెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు. -
'ప్రపంచబ్యాంకు వెనుదిరగడం చంద్రబాబు పుణ్యమే'
సాక్షి, అనంతపురం : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ శనివారం పరిగి మండలం హోన్నంపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో మంత్రి మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా ప్రపంచబ్యాంకు వెనుదిరగడం చంద్రబాబు పుణ్యమేనని ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్లలో రాజధాని ప్రాంతంలో పిచ్చి మొక్కలు మొలిచాయే తప్ప అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం పేరుతో భూములను చదును చేయడానికి దాదాపు రూ. 175 కోట్ల ప్రభుత్వ నిధులను ఉపయోగించిన బాబు అదే నిధులతో రాజధాని ప్రాంత అభివృద్ధిని మాత్రం చేపట్టడంలో విఫలమవ్వడమే గాక, ఇప్పుడు ఈ తప్పులను మఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదకు నెడుతున్నారని మంత్రి ఆరోపించారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ ఫలాలను అర్హులకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలను ఇంటింటికీ చేర్చేందుకే గ్రామ వలంటీర్లను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద రూ. 12,500 అందిస్తామని, పంటల బీమా ప్రీమియంలను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. -
మంత్రి వార్నింగ్.. పేరెంట్స్ ఖబడ్దార్
-
మంత్రి వార్నింగ్.. పేరెంట్స్ ఖబడ్దార్
సాక్షి, లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాధ్ కేబినెట్లోని ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువు చెప్పించకపోతే వారిని జైలుకు పంపుతానంటూ ప్రకటించారు. ఈ మేరకు అవరసమైన చట్టాన్ని కూడా రూపొందించేందుకు సిద్ధమంటూ ఆయన చెప్పుకొచ్చారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఓమ్ ప్రకాశ్ రాజ్‌భర్ ఆదివారం సాయంత్రం బల్లియాలో జరిగిన ఓ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ముందు ఆరు నెలలు మిమల్ని(తల్లిదండ్రులను ఉద్దేశించి) బతిమాలుతా. ఆ తర్వాత నా చట్టం ప్రకారం ముందుకెళ్తా. ఎవరైతే తమ పిల్లల్ని స్కూల్‌కి పంపించరో వారు జైలుకు వెళ్లాల్సిందే. ఐదు రోజలపాటు తిండి తిప్పలు లేకుండా వారి కడుపు మాడేలా చేస్తా. అంటూ రాజ్‌భర్ ప్రసంగించారు. పైగా లంకకు వారధి కట్టేందుకు సహకరించాలని రాముడు ఎలాగైతే సముద్రుడిని బెదిరించాడో.. పిల్లలను బడిలో చూడాలన్న లక్ష్యం కోసం తానూ ఎంతకైనా సిద్ధమేనంటూ మరో వ్యాఖ్య చేశారు. తాను మాట్లాడింది తప్పని భావిస్తే తల నరకండంటూ రాజ్‌భర్ చెప్పుకొచ్చారు. కాగా, సుహెల్దేవ్ సమాజ్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలలో రాజ్‌భర్ ఒకరు. బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న ఎస్ఎస్పీ తరపు నుంచి రాజ్‌భర్‌కు మంత్రి పదవి దక్కింది. కొన్ని రోజల క్రితం ఘజిపూర్ జిల్లా న్యాయమూర్తి(కలెక్టర్) సంజయ్ కుమార్ తన మాట వినటం లేదని ఆరోపిస్తూ తక్షణమే బదిలీ చేయాలని, లేకపోతే తాను ప్రభుత్వం నుంచి వైదొలుగుతానని రాజ్‌భర్ హెచ్చరించారు. వెంటనే రంగంలోకి దిగిన సీఎం ఆదిత్యానాథ్.. రాజ్‌భర్-సంజయ్‌లతో చర్చించి సమస్యను పరిష్కరించారు. -
బీసీ గురుకులాల్లో సీట్లు పెంచండి: జాజుల
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలల్లో సీట్ల సంఖ్య పెంచాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సీట్ల సంఖ్యతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య భారీగా ఉందని తెలిపింది. దీంతో నిర్దేశిత సంఖ్యలో మార్పులు చేసి మరింత మందికి ప్రవేశాలు కల్పించాలని కోరింది. అలాగే మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో బీసీలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, గురువారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు çబీసీ సంక్షేమ సంఘ ప్రతినిధులు తెలిపారు.