
బీసీ గురుకులాల్లో సీట్లు పెంచండి: జాజుల
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలల్లో సీట్ల సంఖ్య పెంచాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సీట్ల సంఖ్యతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య భారీగా ఉందని తెలిపింది. దీంతో నిర్దేశిత సంఖ్యలో మార్పులు చేసి మరింత మందికి ప్రవేశాలు కల్పించాలని కోరింది. అలాగే మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో బీసీలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, గురువారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు çబీసీ సంక్షేమ సంఘ ప్రతినిధులు తెలిపారు.