bc gurukula
-
సాగర్‌లో మరో బీసీ బాలుర గురుకుల పాఠశాల
నాగార్జునసాగర్ : అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో మరో బాలుర గురుకుల పాఠశాల ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తెలిపారు. మంగళవారం పైలాన్ కాలనీలోని బీఈడీ కళాశాలలో పెద్దవూర మండలపార్టీ అధ్యక్షుడు కర్నబ్రహ్మానందరెడ్డితో కలిసి రికార్డులను పరిశీలించారు. గురుకుల పాఠశాల ఏర్పాటుకు కావాల్సిన భవనం కోసం ఆ కళాశాల ఆవరణలోనే మధ్యంతరంగా నిలిచిపోయిన భవనంతో పాటు మరికొన్ని ఎన్ఎస్పీకి చెందిన గోదాంలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 119 బీసీ గురుకుల పాఠశాలలు మంజూరైనట్లు వెల్లడించారు. అందులో భాగంగానే సాగర్ నియోజకవర్గానికి పాఠశాల మంజూరైనట్లు తెలిపారు. విద్యపరంగా ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, ఆచార్య నాగార్జునుడి సన్నిధిలో ప్రపంచ దేశాలనుంచి విద్యార్థులు వచ్చి అభ్యసించినట్లు పేర్కొన్నారు. అందుకే ఆ పాఠశాలను సాగర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నూతన భవనం నిర్మించే వరకూ పాఠశాల తాత్కాలికంగా నడిచేందుకు భవనం అవసరమని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరంలోనే ప్రారంభించాల్సి ఉందని అందుకే భవనాలను పరిశీలించినట్లు తెలిపారు. బీఈడీ కళాశాల కూడా ఇక్కడే ఉంటుందని ఆ కళాశాలను నల్లగొండకు తరలించడమనేది లేదన్నారు. ఎమ్మెల్యే వెంట తుమ్మడం బీసీగురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జనార్థన్‌రెడ్డి, కర్నబ్రహ్మానందరెడ్డి, శేఖరాచారి, శ్రీను తదితరులున్నారు. -
బీసీ గురుకులాల్లో సీట్లు పెంచండి: జాజుల
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలల్లో సీట్ల సంఖ్య పెంచాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సీట్ల సంఖ్యతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య భారీగా ఉందని తెలిపింది. దీంతో నిర్దేశిత సంఖ్యలో మార్పులు చేసి మరింత మందికి ప్రవేశాలు కల్పించాలని కోరింది. అలాగే మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో బీసీలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, గురువారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు çబీసీ సంక్షేమ సంఘ ప్రతినిధులు తెలిపారు. -
బీసీ గురుకుల ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి : జిల్లాలోని మహాత్మాజ్యోతిభాపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ వరకు చేసిందని, 2016–17 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చిట్యాల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రవిప్రకాశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని చిట్యాల, కొడంగల్‌లో బాలురు, నాగర్‌కర్నూల్, కల్వకుర్తిలో బాలికలను ఎంపిక చేస్తామన్నారు. మొదటి సంవత్సరం కోసం మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కో గ్రూపులో 40 మంది విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. పదో తరగతి ఒకేసారి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను మాత్రమే అర్హులుగా పరిగణిస్తామని, దరఖాస్తులు రూ.150 ఫీజు చెల్లించి ఆన్లైన్లో మాత్రమే చేయాలన్నారు. ఆగస్టు 11న ప్రవేశాలు, 16న తరగతులను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.