
సాక్షి, విజయవాడ: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు పనిపాట లేదని.. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి శంకర్ నారాయణ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.
కరోనా కట్టడిలో దేశానికి ఆదర్శంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉందని పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటకీ సంక్షేమ పథకాల అమలులో సీఎం వైఎస్ జగన్ రాజీపడలేదన్నారు. ఆయన సంక్షేమ పాలన చూసి ప్రతిక్షాలు ఓర్వలేకపోతున్నాయని మంత్రి మండిపడ్డారు.