శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ శంకర్‌నారాయణ | Justice Shankar Narayana Visits Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ శంకర్‌నారాయణ

Published Mon, Jan 8 2018 1:42 AM | Last Updated on Mon, Jan 8 2018 1:42 AM

Justice Shankar Narayana Visits Tirumala - Sakshi

సాక్షి, తిరుమల : ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శంకర్‌నారాయణ తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన తన కుటుంబీకులతో కలిసి ఆలయానికి వచ్చి ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం శ్రీవారిని, వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా జస్టిస్‌కు తిరుమల ప్రోటోకాల్‌ జడ్జి సన్యాసినాయుడు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూప్రసాదాలు అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement