టీడీపీ ఎమ్మెల్యేకు వైఎస్సార్‌సీపీ నేత ఓపెన్‌ ఛాలెంజ్‌ | YSRCP Leader Shankar Narayana Open Challenge To MLA Parthasarathi | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 26 2018 5:13 PM | Last Updated on Wed, Sep 26 2018 5:52 PM

YSRCP Leader Shankar Narayana Open Challenge To MLA Parthasarathi - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త శంకర్‌నారాయణ(పాత చిత్రం)

సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై టీడీపీ ఎమ్మెల్యే పార్థసారథికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెనుకొండ సమన్వయకర్త శంకర్‌నారయణ బహిరంగ సవాలు విసిరారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానకి వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర 3000 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా పెనుకొండ నియోజకవర్గంలో ఆయన సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నిజం కాదా అని పార్థసారథిని నిలదీశారు. పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా కర్ణాటకకు తరలిస్తుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దీనిపై చర్చకు వస్తావా అంటూ పార్థసారథికి సవాలు విసిరారు.

‘పాదయాత్ర ఈ రోజు(బుధవారం) నీ మండలం(రొద్దం)లోనే కొనసాగుతోంది. రేపు కూడా ఇదే మండలంలో నా పాదయాత్ర ఉంటుంది. నీవు, నీ అనుచరులు ఇసుకు అక్రమ రవాణాపై చర్చకు వస్తారా?. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందని అంటున్నారు.. ఆ అభివృద్ధి ఎక్కడ చేశారో చూపించాలి. అభివృద్ధి సంగతి అలా ఉంచితే నీ ఆస్తులు ఎంత పెరిగాయో చెప్పాల’ని పార్ధసారథిని నిలదీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement