Sangheebhava Yatra
-
టీడీపీ ఎమ్మెల్యేకు వైఎస్సార్సీపీ నేత ఓపెన్ ఛాలెంజ్
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై టీడీపీ ఎమ్మెల్యే పార్థసారథికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెనుకొండ సమన్వయకర్త శంకర్‌నారయణ బహిరంగ సవాలు విసిరారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానకి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర 3000 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా పెనుకొండ నియోజకవర్గంలో ఆయన సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నిజం కాదా అని పార్థసారథిని నిలదీశారు. పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా కర్ణాటకకు తరలిస్తుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దీనిపై చర్చకు వస్తావా అంటూ పార్థసారథికి సవాలు విసిరారు. ‘పాదయాత్ర ఈ రోజు(బుధవారం) నీ మండలం(రొద్దం)లోనే కొనసాగుతోంది. రేపు కూడా ఇదే మండలంలో నా పాదయాత్ర ఉంటుంది. నీవు, నీ అనుచరులు ఇసుకు అక్రమ రవాణాపై చర్చకు వస్తారా?. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందని అంటున్నారు.. ఆ అభివృద్ధి ఎక్కడ చేశారో చూపించాలి. అభివృద్ధి సంగతి అలా ఉంచితే నీ ఆస్తులు ఎంత పెరిగాయో చెప్పాల’ని పార్ధసారథిని నిలదీశారు. -
‘ఆ సొమ్ముతో అద్భుతమైన రాజధాని’
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ఖజానా నుంచి దోచుకుని, విదేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దాచుకున్న రూ. మూడు లక్షల కోట్లను తిరిగి రాష్ట్ర ఖజానాలో జమ చేస్తే దాంతో అద్భుతమైన రాజధాని నిర్మించుకోవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి అన్నారు. విదేశాల్లో చంద్రబాబు దాచుకున్న రాష్ట్ర సొమ్మును వెనక్కి తేవాలని కేంద్రాన్ని కోరారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా పాదయాత్ర చేపట్టిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ సమస్యలను పార్టీ దృష్టికి తెస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక దాడులపై ప్రజలు తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురౌతున్నట్టు వెల్లడించారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ లైంగిక దాడుల్లో భాగస్వాములవ్వడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ నాలుగేళ్ల పాలనలో రూ. మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. నాలుగేళ్లు బీజేపీతో జతకట్టి ధనార్జనే ధ్యేయంగా పాలన సాగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించి ఎన్డీయే కూటమి నుంచి బయటికొచ్చి బీజేపీతో తమ పార్టీ జతకట్టిందని పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే తమ పార్టీకి ముఖ్యమని స్పష్టం చేశారు. రూ. మూడు లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు ఒక దొంగ అని, ప్రజల సొమ్మును దోచుకున్న వ్యక్తి దొంగ కాక మరెమవుతారని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడి, బీజేపీకి భయపడి, ప్రజలకు సాగిలపడి వేడుకునే పరిస్థితి చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. ఇలాంటి అవినీతి, అక్రమ పాలనకు ఫుల్స్టాప్ పెట్టేందుకు ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ప్రజలంత ఎదురుచూస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలంత సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ నెల 16న విశాఖలో ధర్మ పోరాటం పేరిట దీక్ష చేయబోతున్న చంద్రబాబు ఎవరిపై పోరాటం చేస్తారో తెలపాలని డిమాండ్ చేశారు. బాబుది ధర్మపోరాటం కాదని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఇతర పార్టీలపై నిందలు వేయడానికే సభలు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో సభ నిర్వహించినా అధికార దుర్వినియోగం చేసి ప్రజలను తీసుకువస్తున్నారే తప్పా, స్వచ్ఛందంగా చంద్రబాబు సభలకు జనాలు వచ్చే పరిస్థితులు లేవని స్పష్టం చేశారు. -
పులివెందులలో వైఎస్ అవినాష్‌రెడ్డి పాదయాత్ర
-
ప్రతి భూకబ్జాలో ఆయన ప్రమేయం ఉంది
సాక్షి, విశాఖపట్నం : ముప్పైఏళ్లపాటు విజయవాడలో నేర సామ్రాజ్యం నడిపిన వ్యక్తి విశాఖ తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ బాబుకు పదవిలో కొనసాగే అర్హత లేదని వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఎనిమిదవ రోజు సంఘీభావయాత్రలో భాగంగా విశాఖ తూర్పు నియోజక వర్గంలో ఆయన పాదయాత్ర సాగింది. ఈ సందర్బంగా తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ బాబుపై విమర్షలు ఎక్కుపెట్టారు. 30 ఏళ్ల క్రితం రామకృష్ణ బాబు విజయవాడలో వంగవీటి మోహన్ రంగాను హత్య చేసి పారిపోయి విశాఖపట్నం వచ్చాడని అన్నారు. భూకబ్జాలు, మద్యం సిండికేట్ చేసి విశాఖ ప్రజలను దోచుకుంటున్నాడని, విశాఖలో జరుగుతున్న ప్రతి భూకబ్జాలో ఆయన ప్రమేయం ఉందని ఆరోపించారు. రామకృష్ణబాబు 9 ఏళ్లలో ఏనాడైనా ప్రజలకు అండగా ఉన్నారా, వారికి సేవ చేశారా అని విజయసాయి రెడ్డి నిలదీశారు. స్వప్రయోజనాల కోసం మీరు చేస్తున్న దారుణాలను ప్రజలు నిత్యం గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. గత ఎన్నికల్లో రైతు బజార్, ప్రభుత్వ జూనియర్ కళాశాలు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. జోడుగుళ్లపాలెంలో రజకులకు దోభీ ఘాట్ పనులను పూర్తి చేస్తామని చెప్పిన అధికార పార్టీ ఎమ్మెల్యే నాలుగేళ్లైనా వాటిని పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎమ్మెల్యే చేసేది ఒక్కటేనని, జీవీఎంసీ ఏర్పాటు చేసిన కొలాయిలను ప్రారంభిండం తప్పితే చేసింది ఏమీలేదని దుయ్యబట్టారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆంధ్రా యూనివర్సిటీలో రోజువారి కూలీ జీతం తీసుకుంటూ పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పిన హామీని మీరు మర్చిపోయారేమో కానీ ప్రజలు మర్చిపోలేదని విజయసాయి రెడ్డి అన్నారు. సింహాచలం దేవస్థానం భూముల్లో 50ఏళ్లకు పైగా ఇల్లు కట్టుకొని నివసిస్తున్న వారికి పట్టాలు ఇప్పిస్తామన్న ఎమ్మెల్యే తర్వాత ఏమీ చేయలేక పోయారని ఆయన మండిపడ్డారు. 9 ఏళ్లుగా శాసన సభ్యులుగా ఉన్న రామకృష్ణ బాబు ఒక్కసారంటే ఒక్కసారైనా విశాఖ తూర్పు ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారా అని ప్రశ్నించారు. జాలరీ పేటలో మత్సకారులకు ఇళ్లు ఇప్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. హుదూత్ తుపాన్లో బాధితులకు ఇప్పటి వరకూ నష్టపరిహారం ఇప్పించడంలో విఫలమయ్యారని విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. 2007లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విమ్స్ విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు 110 ఎకరాలు కేటాయించారని, 1300 పడకలు, 18 సూపర్ స్పెషాలిటీ సర్వీస్ అందించే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో 100 కోట్లు నిధులు ఇస్తామని తీర్మాణం చేశారని, కానీ చిల్లిగవ్వ కూడా విదల్చలేదని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. -
టీడీపీకి ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు
-
‘రంగా హత్యకేసులో వెలగపూడి నిందితుడు’
సాక్షి, విశాఖపట్నం: వంగవీటి రంగా హత్య కేసులో విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే, టీడీపీ నేత వెలగపూడి రామకృష్టబాబు మూడో నిందితుడిగా ఉన్నారని, ఇది తెలియక ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా ఎంపీ విజయసాయి రెడ్డి చేపట్టిన సంఘీభావయాత్ర బుధవారం ఎనిమిదవ రోజుకు చేరింది. విశాలాక్షినగర్ నుంచి బుధవారం పాదయాత్ర ప్రారంభమవ్వగా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన వెంట నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యేలు భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ లాభాలకోసమే విమ్స్ ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విమ్స్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
గిరిజన కార్పొరేషన్ లక్ష్యాలు నెరవేరుస్తాం
-
ఆరో రోజు విజయసాయి రెడ్డి పాదయాత్ర ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్సీపీ అధ్యక్షడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పాయత్రకు సంఘీభాంగా ఆపార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి చేపట్టిన సంఘీభావ యాత్ర ఆరవ రోజు ప్రారంభమైంది. మధవధార నుంచి పాదయాత్ర ప్రారంభమవ్వగా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయనతో పాటు నడిచారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. -
25 ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తాం
-
బాబు ఉన్న ఉద్యోగాలను ఊడపీకుతున్నారు
-
చంద్రబాబు.. ఏది జాబు?
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేపట్టిన సంఘీభావ యాత్ర ఐదవరోజు సింహాచలం సమీపంలోని ప్రహ్లాద పురం నుంచి మర్రిపాలెం వరకూ సాగింది. అనంతరం ఊర్వశి జంక్షన్లో ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని, ఇదే విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం స్పష్టం చేశారని గుర్తు చేశారు. విభజన చట్టంలో విశాఖపట్నంకు ఇచ్చిన రైల్వే జోన్‌ను సైతం కేంద్రం విస్మరించిందని విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ తరపున 25 మంది ఎంపీలను గెలిపిస్తే.. రైల్వేజోన్ సాధించి తీసుకు వస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం నుంచి కోలుకోవాలంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలన్నారు. ప్రత్యేక హోదాతో పాటు, రైల్వే జోన్, ఇతర విభజన హామీలను సాధించుకోవాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అన్నారు ఎన్నికల సమయంలో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని, వాటిలో ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పిన విషయాన్ని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని, పైగా ప్రభుత్వ ఉద్యోగాలను సైతం ఊడపీకుతున్నారని నిప్పులు చెరిగారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాల భర్తీ చేస్తున్నారని, వాటి కారణంగా ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
‘రాజీనామా చేయకుండా దీక్షలు చేస్తే నమ్మరు’
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా రాజ్యసభ రాజ్యసభ్యుడు వి. విజయసాయి రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఐదో రోజుకు చేరుకుంది. ప్రహ్లాదపురం నుంచి ఆదివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచ గ్రామ ప్రజలు పాదయాత్రలో ఎంపీ ఎదుట తమ సమస్యల్ని చెప్పుకున్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పంచ గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని వివరించారు. ప్రస్తుతం ఎంపీ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలను మెరుగు పరుస్తానని హామీయిచ్చారు. పదవులకు రాజీనామా చేయకుండా టీడీపీ నాయకులు దీక్షలు చేస్తే జనం నమ్మే స్థితిలో లేరని విజయసాయి రెడ్డి తెలిపారు. ఐదో రోజు ఎంపీ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షులు మళ్ల విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ కుమార్, వైఎస్సార్ సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, నాగిరెడ్డి, కోలా గురువులు, జాన్‌వెస్లీ, పక్కి దివాకర్, ఆదిరెడ్డి మురళి, దొడ్డి కిరణ్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తులసి వనంలో బాబు గంజాయి మొక్క
-
తులసి వనంలో బాబు గంజాయి మొక్క
సాక్షి, పెందుర్తి : వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి సంఘీభావ యాత్ర శనివారం పెందుర్తిలోని 46, 49 వార్డుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిపై విమర్శలు గుప్పించారు. బండారు ముదుపాక గ్రామంలో దళితులకు చెందిన వందలాది ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. వామపక్షలతో కలిసి వాటిని అడ్డుకున్నామని, వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని విజయసాయిరెడ్డి అన్నారు. నియోజక వర్గంలో ఎమ్మెల్యే, ఆయన కుమారుడు, అనుచరుల దాడులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. జెర్రిపోతుల పాలెం గ్రామంలో మహిళను వివస్త్రనుచేసి దారుణాలకు పాల్పడ్డారని, బాధితురాలికి ప్రభుత్వం నష్ట పరిహారం ఇప్పిస్తామని చెప్పి మొండి చేయి చూపించారని విమర్శించారు. దళితులపై దౌర్జన్య కాండకు పాల్పడే బండారుకు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత ఏమాత్రం లేదని విజయ సాయిరెడ్డి అన్నారు. హిందూజా పవర్, ఫార్మాసిటీ, ఎన్టీపీసీల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించలేక పోయారని విమర్శించారు. గతంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇక్కడ ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించారని గుర్తు చేశారు. డిగ్రీ చదివే విద్యార్థుల కోసం పెందుర్తిలో డిగ్రీ కాలేజీ ఎందుకు నిర్మించలేక పోయారని నిలదీశారు. సీఎం చంద్రబాబు నాయుడు నాలుగేళ్లలో 3లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తులసి వనంలో గంజాయి మొక్క అని విజయ సాయి రెడ్డి విమర్శించారు. ఏప్రిల్‌లో బాబు జగజ్జీవన్ రావు, జ్యోతిరావు పూలే, దాదా సాహెబ్ అంబేడ్కర్ లాంటి గొప్ప మహానుభావులు పుడితే, అదే నెలలో చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి నాయకుడు పుట్టారంటూ విమర్శించారు. అందుకే తులసి వనంలో చంద్రబాబు గంజాయి మొక్క అని ఎద్దేవా చేశారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకొనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటూ అది చంద్రబాబే అంటూ దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా చంద్రాబాబు రైతులు, విద్యార్థులు, మహిళలు ఇలా అందరిని మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేక పోయిన నీతిమాలిన ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
నాల్గవరోజు విజయసాయి సంఘీభావ యాత్ర
సాక్షి, విశాఖ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు మద్దుతగా విశాఖలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేపట్టిన సంఘీభావ యాత్ర నాల్గవ రోజుకు చేరింది. శనివారం గౌర జగ్గయ్య పాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆయన అడుగుడుగునా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుసాగుతున్నారు. అనంతరం భగత్ సింగ్ నగర్ మీదుగా బీఆర్టీఎస్ రహదారి గుండా పశ్చిమ నియోజకవర్గంలోకి ఆయన యాత్ర ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి శ్రీరామ్‌నగర్, ఆర్ఆర్ వెంకటాపురం, బీఆర్టీఎస్ రోడ్డు, కొత్త పాలెం మీదుగా మళ్లీ పెందుర్తి నియోజకవర్గంలోకి చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజన విరామం అనంతరం సాయంత్రం 4 గంటలకు యాత్ర ప్రారంభమవుతుంది. -
గాజువాకను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి
సాక్షి, విశాఖపట్నం : గాజువాక ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. సమస్యలు కూడా అలానే వెంటాడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు గడిచినా గాజువాక హౌజింగ్ కమిటీ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు సంఘీభావంగా విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా శుక్రవారం గాజువాకలో నిర్వహించిన బహిరంగ సభలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఉక్కు నిర్వాసితులకు చంద్రబాబు మొండిచేయి చూపించారని అన్నారు. ఆర్ కార్డు హోల్డర్లకు వయోపరిమితి దాటిపోయిందని అన్నారు. వారికి రూ. 50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసినా.. ఇవాళ్లికి చెల్లించలేదని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్ భూముల్లో స్పోర్ట్స్ హబ్ కడతానని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ అది అడియాసే అయిందని అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఆ హామీని నెరవేరుస్తామని చెప్పారు. -
‘సర్వేలు హెచ్చరిస్తున్నా మార్పు లేదు’
సాక్షి, విశాఖ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో విశాఖలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేపట్టిన సంఘీభావ యాత్ర మూడో రోజుకు చేరింది. శుక్రవారం మూడోరోజు మల్కాపురం నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆయన అడుగుడుగునా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుసాగుతున్నారు. జై ఆంధ్రా కాలనీ మీదుగా.. ఏసీ కాలనీలో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు సర్వేలు హెచ్చరిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి మార్పు లేదని మండిపడ్డారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు. మహిళలపై అత్యాచారాల కేసుల్లో టీడీపీ మంత్రుల పేర్లు ఉండటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుకు త్వరలోనే ప్రజలు తగిన బుద్ది చెబుతున్నారన్నారు. -
రాష్ట్రంలో రాక్షసపాలన.. అవినీతి పాలన..
-
‘అవినీతికి మారుపేర్లుగా నిప్పు నాయుడు, పప్పు నాయుడు’
సాక్షి, విశాఖపట్నం: గత నాలుగేళ్ల పాలనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు 3 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, అన్ని వర్గాలను టీడీపీ సర్కార్ మోసం చేసిందంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. నిప్పు నాయుడు-పప్పు నాయుడు ఇద్దరూ అవినీతికి మారుపేరుగా నిలిచారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా.. విశాఖ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి జిల్లాలో రెండో రోజు పాదయాత్ర చేశారు. విశాఖపట్నం జిల్లా మల్కాపూరంలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నానికి సంబంధించి పలు అంశాలను పార్లమెంట్లో లెవనెత్తి వాటిని పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేశానన్నారు. ఇక్కడ కాలుష్యం వెదజల్లుతున్నటువంటి కొన్ని సంస్థలున్నాయని, తాము పరిశ్రమల అభివృద్ధికి వ్యతిరేకం కాదన్నారు. కానీ అభివృద్ధితో పాటు కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకోవాలన్నదే వైఎస్ జగన్ ఉద్దేశమని తెలిపారు. పారిశ్రామిక వాడలోని ప్రజల స్థితిగతులు అంతంత మాత్రమే. వాయు, జల, శబ్ధ కాలుష్యాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఉద్యోగావకాశాల కోసం ఏ పరిశ్రమ ఇక్కడ స్థాపించినా.. 75 శాతం స్థానికులకే ఉద్యోగం అని చెప్పారు. పాటించి చూపించిన వ్యక్తి మహానేత వైఎస్సార్. స్థానిక ఎమ్మెల్యే అవినీతితో సొమ్మును ఆర్జించాలి, ధనవంతుడు ఎలా కావాలన్నదానిపై దృష్టి సారించారు. పరిస్థితులు మారాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలి. సంఘీభావ యాత్రలో ఓ విషయం స్పష్టమైంది. కొండ వాలు ప్రాంతంలో రోడ్లు ఇరుకిరుకిరుకుగా ఉన్నాయి. కొండ చరియలు విరిగిపడే అవకాశాలున్నాయి. ఈ నియోజకవర్గాన్ని గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే పట్టించుకోలేదు. ఒక్క ఇళ్లయినా కట్టిచ్చారా? గత నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్క ఇళ్లు కూడా కట్టించిన పాపాన పోలేదు. కేవలం పచ్చ తమ్ముళ్లకే ఆయన లబ్ధి చేకూర్చారు. ఏపీలో విశాఖలోనే అధిక కుంభకోణాలు జరిగాయి. అప్పట్లో ఎకరా 850 రూపాయలకు ప్రభుత్వానికి ఇచ్చారు. ఈరోజు హిందుస్తాన్ షిప్‌యార్డును ప్రైవేట్ సంస్థకు చంద్రబాబు కట్టబెట్టగా, ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. కానీ గతంలో షిప్‌యార్డ్ నష్టాల్లో కూరుకుపోయిందని గ్రహించిన వైఎస్సార్ దాన్ని రక్షణశాఖకు అప్పగించి లక్షల మంది ఉద్యోగాలు కాపాడారు. వైఎస్సార్ అందించిన జనరంజకమైన పాలన మళ్లీ రావాలంటే జననేత వైఎస్ జగన్‌ను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో రాక్షసపాలన.. అవినీతి పాలన.. ఏపీలో గత నాలుగేళ్లుగా 3 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్‌లు అన్ని విభాగాల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. నిప్పు నాయుడు-పప్పు నాయుడు ఇద్దరూ అవినీతికి మారుపేరుగా నిలిచారు. పరమక్రూరుడైన జర్మనీ నియంత హిట్లర్ పుట్టినరోజే (ఏప్రిల్ 20న) చంద్రబాబు పుట్టారు. రెండో ప్రపంచ యుద్ధంతో పాటు లక్షల మంది మృతికి కారమైన హిట్లర్‌లా.. నేడు చంద్రబాబు వ్యవరిస్తున్నారు. హిట్లర్ మంత్రి వర్గంలో జోసెఫ్ గోబెల్స్ అనే వ్యక్తి పనిచేసేవారు. అబద్దాలను నిజాలుగా ప్రచారం చేయడమే ఆయన బాధ్యత. ఆ హిట్లర్-గోబెల్స్ ఇద్దరూ ప్రస్తుతం చంద్రబాబులో పరకాయ ప్రవేశం చేశారని అనుమానం కలుగుతోంది. తన సామాజిక వర్గానికి తప్ప, ఎవరికీ ప్రయోజం చేకూర్చని వ్యక్తి చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఎన్నికల కోసం దొంగసొమ్ము దాచిన చంద్రబాబు ఇక్కడ ఏపీలో డబ్బులు లేకుండా పోయాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఎందుకు డబ్బుల్లేవ్ అంటే.. దానిక్కూడా వైఎస్సార్సీపీనే కారణమంటూ అనవసర ఆరోపణలు చంద్రబాబు చేస్తున్నారు. నిజం ఏంటంటే.. కేంద్రం నుంచి డబ్బులు రాగానే.. కేవలం తన పార్టీకి, తన వ్యక్తిగత లబ్ధి చేకూర్చే అంశాలకు ఖర్చు చేయడం వల్లే ఏటీఎంలు, బ్యాంకులల్లో డబ్బులు లేకుండా పోయాయి. ఆర్బీఐ వద్ద కూడా 500, 2000 రూపాయల నోట్లు లేవు. అవి ఎక్కడకి పోయాయంటే కేవలం చంద్రబాబు వ్యక్తిగత ఖజానాలోకి పోయాయి. రాబోయే ఎన్నికల తాను దాచిన దొంగసొమ్మును చంద్రబాబు ఖర్చుపెట్టనున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. బీసీలకు చంద్రబాబు హయాంలో అన్యాయయే ఒక్కో ఓటుకు 5 వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్వయంగా చంద్రబాబే చెప్పిన విషయాన్ని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. జ్యోతిబాపూలే జయంతి రోజు చంద్రబాబు వ్యాఖ్యలు మాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. బీసీలంటే తనకెంతో ప్రేమ అని చంద్రబాబు కబుర్లు చెబుతారు. అయితే బీసీ క్లాస్ వాళ్లు ఎప్పుడూ బాగుపడలేదు. ఎందుకంటే.. ఏపీ సీఎం దృష్టిలో బీసీ క్లాస్ అంటే.. బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బాబుగారి క్లాస్ మాత్రమేనని చెప్పారు. బీసీ కార్పొరేషన్‌కు ప్రతి ఏడాది 10 వేల కోట్లు ఇస్తానన్నారు. ఈ నాలుగేళ్లలో బీసీ కమిషన్, కార్పొనేషన్లకు ఎంత ఇచ్చారని చంద్రబాబును ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం రాగానే ఏదో కంటి తుడుపు చర్యగా కొంత కేటాయించారు. వైఎస్సార్ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెస్ ఛార్జీలు, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చేవారు. ఓసీ విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్ సదుపాయం కల్పించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. కానీ చంద్రబాబు ఏం చేశారంటే కేవలం నారాయణ సంస్థలకు తోడ్పాడు అందించడం తప్ప, ఇంకేం చేయలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే.. 'వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాట్లు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని వైఎస్ జగన్ ఇదివరకే హామీ ఇచ్చారు. దళిత గిరిజనులకు ఇళ్ల పట్టాలు ఇస్తాం. నవంబర్ 6వ తేదీన ప్రజాసంకల్పయాత్ర పేరుతో జూలైలో ప్రకటించిన నవరత్నాలుపై ప్రజల అభిప్రాయలు, సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. యూపీఏ ఇవ్వకపోతే తామిస్తామంటూ బీజేపీ ప్రకటించింది. కానీ నాలుగేళ్లు గడిచినా ఎన్డీఏ సర్కార్ ఇప్పటికీ హోదా ఇవ్వకుండా ఏపీ ప్రజలను మోసం చేస్తోందంటూ' వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. -
రెండోరోజు విజయసాయి సంఘీభావ యాత్ర..
విశాఖపట్నం: వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్ర రెండో రోజు చినగంట్యాడ నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా విజయసాయిరెడ్డి బుధవారం నుంచి పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. తన యాత్రలో భాగంగా ఆయన అడుగడుగునా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. సంఘీభావ యాత్ర రెండో రోజైన గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. జగ్గు జంక్షన్ వుడా కాలనీ మీదుగా.. సీతానగర్, పెదగంట్యాడ, టీఎన్ఆర్ స్కూల్ వరకు సాగింది. గాజువాక నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి నివాసం మీదుగా.. బీసీరోడ్డులోకి వస్తోంది. మధ్యాహ్నా విరామం అనంతరం సాయంత్రం 4 గంటలకు బీసీ రోడ్డు నుంచి సాగుతూ.. పశ్చిమ నియోజకవర్గంలోకి అడుగు పెడతారు. పశ్చిమ నియోజకవర్గంలో సాగే పాదయాత్రకు ముఖ్య అతిథిగా పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ హాజరు కానున్నారు. జింక్ గేట్ నుంచి హిమాచల్‌నగర్, గణపతి నగర్, ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీ, అశోక్ నగర్ మీదుగా ఇందిరాకాలనీ, జనతాకాలనీ, హైస్కూల్ రోడ్డు, ఏడు గుళ్ల జంక్షన్ వద్దకు చేరుకుంటుంది. మల్కాపురం రెడ్డి కాలనీలో బహిరంగ సభలో విజయసాయిరెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ ప్రసంగిస్తారు. అనంతరం.. ఏడు గుళ్ల జంక్షన్లో రాత్రి బస చేస్తారు. రెండో రోజున 51, 50, 62, 47,48 వార్డుల మీదుగా సాగనుంది. -
‘ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటుపడతా’
సాక్షి, విశాఖపట్టణం : ఉత్తరాంధ్ర అభివృద్ధి పాటు పడతానని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. బుధవారం విశాఖపట్టణంలో సంఘీభావ యాత్ర ప్రారంభానికి ముందు ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మద్దుతుగా సంఘీభావ యాత్రతో ప్రజల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. పాదయాత్రలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తెలుసుకుంటానని చెప్పారు. మూడు దశాబ్దాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని అభిలషించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేటి వరకూ అమలు నోచుకోలేదని అన్నారు. ‘ఏపీ హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో గత నాలుగేళ్లుగా వైఎస్సార్ సీపీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. అధికారంలో ఉన్న టీడీపీ-బీజేపీ కూటమి రాష్ట్రానికి అన్యాయం చేశాయి. ఎన్నికల ప్రచారంలో తిరుపతి వచ్చిన ప్రధాని మోదీ రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. విశాఖకు రైల్వే జోన్‌ను కూడా ప్రకటిస్తామన్నారు. వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కుల అనే నినాదంతో వైఎస్ జగన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటం చేస్తున్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టాం. లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ, బీజేపీలు పాటుపడటం లేదు. గతేడాది జులై 8న వైఎస్సార్ సీపీ ప్లీనరీ సమావేశాల్లో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా కావాలని, ప్రజల శ్రేయస్సు కోసం వైఎస్ జగన్ నవరత్నాలను ప్రకటించారు. నవరత్నాలను అమలు చేస్తే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. నవరత్నాల అమలుకు వనరులు కావాలి. తగిన వనరులు కావాలంటే ప్రత్యేక హోదా కావాలి. చంద్రబాబు ప్రత్యేక హోదాను నమ్మడం లేదు. వైఎస్సార్ సీపీని గెలిపించుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ప్రజాశ్రేయస్సు కోసం వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను కార్యకర్తలందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి.’ అంటూ విజయసాయి రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ప్రారంభమైన విజయసాయి రెడ్డి సంఘీభావ యాత్ర
-
విజయసాయి రెడ్డి సంఘీభావ యాత్ర
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి సంఘీభావ యాత్రను నగర పరిధిలోని అంగనంపూడి నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్రకు మద్దుతుగా సంఘీభావ యాత్రను నిర్వహిస్తున్నట్లు విజయసాయి ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం నగర పార్టీ కార్యాలయం నుంచి కార్లు, బైకులతో నాయకులు, శ్రేణులతో ర్యాలీగా బయలుదేరిన విజయసాయి సంపత్ వినాయకుని గుడికి చేరుకుని అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం అగనంపూడి చేరుకుని వైఎస్సార్ విగ్రహం నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ నెల 12వ తేదీ వరకు విజయసాయి విశాఖ నగర పరిధిలోని గాజువాక, పెందుర్తి, విశాఖ పశ్చిమ, తూర్పు, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లోని 72 వార్డుల్లో 180 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగించనున్నారు. తన సంఘీభావ యాత్రలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాల్లో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించనున్నారు. స్థానిక సమస్యలు, జన్మభూమి కమిటీల అరాచకాలు, టీడీపీ నేతల భూ కబ్జాలు, అనర్హులకు భూ పట్టాలు, రేషన్ కార్డులు మంజూరు, మంచి నీరు, పారిశుద్ధ్య సమస్యలను తెలుసుకుంటారు. విజయసాయి రెడ్డి రాజ్యసభలో విశాఖ సహా ఉత్తరాంధ్ర సమస్యలు, అవసరాలపై ప్రస్తావించిన విషయాలను కరపత్రాలుగా రూపొందించారు. వీటిని పార్టీ శ్రేణులు ప్రజలకు పంపిణీ చేస్తారు. సంఘీభావయాత్రలో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక బహిరంగ సభను నిర్వహించనున్నారు. నేటి సంఘీభావ యాత్ర ఇలా.. వార్డు నం. ప్రాంతం 56 అగనంపూడి వైఎస్సార్ విగ్రహం, దువ్వాడ రోడ్డు, బొర్రమాంబ గుడి 58 రాజీవ్‌నగర్ రాసలమ్మ కాలని, సాయిబాబా గుడి, కూర్మన్నపాలెం 53 గాంధీ విగ్రహం, వడ్లపూడి రోడ్డు, ఎన్‌హెచ్–5 రోడ్డు 60 ఎన్‌హెచ్–5 రోడ్డు – పోలీస్ స్టేషన్ 61 పోలీస్ స్టేషన్ = 100 అడుగుల రోడ్డు జీవీఎంసీ 52 జగ్గు సెంటర్– వుడా కాలనీ