
సాక్షి, విశాఖ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు మద్దుతగా విశాఖలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేపట్టిన సంఘీభావ యాత్ర నాల్గవ రోజుకు చేరింది. శనివారం గౌర జగ్గయ్య పాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆయన అడుగుడుగునా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుసాగుతున్నారు.
అనంతరం భగత్ సింగ్ నగర్ మీదుగా బీఆర్‌టీఎస్ రహదారి గుండా పశ్చిమ నియోజకవర్గంలోకి ఆయన యాత్ర ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి శ్రీరామ్‌నగర్, ఆర్‌ఆర్ వెంకటాపురం, బీఆర్‌టీఎస్ రోడ్డు, కొత్త పాలెం మీదుగా మళ్లీ పెందుర్తి నియోజకవర్గంలోకి చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజన విరామం అనంతరం సాయంత్రం 4 గంటలకు యాత్ర ప్రారంభమవుతుంది.