
సంఘీభావ యాత్ర ప్రారంభానికి ముందు మాట్లాడుతు విజయసాయి రెడ్డి
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి సంఘీభావ యాత్రను నగర పరిధిలోని అంగనంపూడి నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్రకు మద్దుతుగా సంఘీభావ యాత్రను నిర్వహిస్తున్నట్లు విజయసాయి ప్రకటించిన విషయం తెలిసిందే.
బుధవారం ఉదయం నగర పార్టీ కార్యాలయం నుంచి కార్లు, బైకులతో నాయకులు, శ్రేణులతో ర్యాలీగా బయలుదేరిన విజయసాయి సంపత్ వినాయకుని గుడికి చేరుకుని అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం అగనంపూడి చేరుకుని వైఎస్సార్ విగ్రహం నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు.
ఈ నెల 12వ తేదీ వరకు విజయసాయి విశాఖ నగర పరిధిలోని గాజువాక, పెందుర్తి, విశాఖ పశ్చిమ, తూర్పు, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లోని 72 వార్డుల్లో 180 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగించనున్నారు. తన సంఘీభావ యాత్రలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాల్లో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించనున్నారు.
స్థానిక సమస్యలు, జన్మభూమి కమిటీల అరాచకాలు, టీడీపీ నేతల భూ కబ్జాలు, అనర్హులకు భూ పట్టాలు, రేషన్ కార్డులు మంజూరు, మంచి నీరు, పారిశుద్ధ్య సమస్యలను తెలుసుకుంటారు. విజయసాయి రెడ్డి రాజ్యసభలో విశాఖ సహా ఉత్తరాంధ్ర సమస్యలు, అవసరాలపై ప్రస్తావించిన విషయాలను కరపత్రాలుగా రూపొందించారు. వీటిని పార్టీ శ్రేణులు ప్రజలకు పంపిణీ చేస్తారు. సంఘీభావయాత్రలో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక బహిరంగ సభను నిర్వహించనున్నారు.
నేటి సంఘీభావ యాత్ర ఇలా..
వార్డు నం. ప్రాంతం
56 అగనంపూడి వైఎస్సార్ విగ్రహం, దువ్వాడ రోడ్డు, బొర్రమాంబ గుడి
58 రాజీవ్‌నగర్ రాసలమ్మ కాలని, సాయిబాబా గుడి, కూర్మన్నపాలెం
53 గాంధీ విగ్రహం, వడ్లపూడి రోడ్డు, ఎన్‌హెచ్–5 రోడ్డు
60 ఎన్‌హెచ్–5 రోడ్డు – పోలీస్ స్టేషన్
61 పోలీస్ స్టేషన్ = 100 అడుగుల రోడ్డు జీవీఎంసీ
52 జగ్గు సెంటర్– వుడా కాలనీ