సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి రైతుల పక్షపాతి అని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్రామ స్థాయిలో విత్తనాల పంపిణీ చారిత్రాత్మకమన్నారు. రైతులకు 40 శాతం సబ్సిడీపై విత్తనాల పంపిణీ చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని మంత్రి విమర్శించారు. (‘బాబు కరోనా రాజకీయాలు పక్కనపెట్టాలి’)
ఇక ఎమ్మెల్యే జొన్నగడ్డ పద్మావతి మాట్లాడుతూ... సీఎం జగన్ రైతులకు అండగా నిలిచారన్నారు. రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ. 13500 రూపాయల సాయం అందించామని పేర్కొన్నారు. గ్రామాల్లో వేరుశనగ విత్తనాల పంపిణీ అభినందనీయమని, టీడీపీ పాలనలో విత్తనాల కోసం రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. టీడీనీ పాలనలో రూతులు విత్తనాల కోసం క్యూలో నిలబడి చనిపోయినా చంద్రబాబు పట్టించుకోలేదు మండిపడ్డారు. ఇక సీఎం వైఎస్ జగన్ రైతు కష్టాలు తీర్చారని ఎమ్మెల్యే అన్నారు.
కూలీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాం: కలెక్టర్
వలస కూలీలను మానవీయ కోణంలో చూడాలని ముఖ్యమంత్రి వెఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు వలస కూలీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పారు. వలస కూలీలకు భోజనం, మంచినీరు అందిస్తున్నామని. ఇక ప్రభుత్వ ఖర్చులతోనే వలస కార్మికులను తమ సొంత ఊళ్లకు తరలిస్తున్నామని వెల్లడించారు. అనంతపురం-ఉత్తరప్రదేశ్, అనంతపురం-బీహార్‌కు వెళ్లే వలస కూలీల కోసం శ్రామిక రైళ్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. (కరోనా: నాలుగు రోజులు హిందూపూర్ బంద్)
Comments
Please login to add a commentAdd a comment