Gandham chandrudu
-
సీఎం జగన్‌ను కలిసిన మాస్టర్ గంధం భువన్ జై
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాస్టర్ గంధం భువన్ జై తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. గంధం భువన్ జై ఇటీవల యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎల్బ్రస్ మౌంట్‌ను ప్రపంచంలోనే అతి పిన్న వయసులో(8 సంవత్సరాల 3 నెలలు) అధిరోహించిన బాలుడిగా రికార్డు సృష్టించాడు. భువన్ జై ప్రతిభను సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు తనయుడు మాస్టర్ గంధం భువన్ జై. భువన్ జైతో అతని తండ్రి గంధం చంద్రుడు, కోచ్ శంకరయ్య, రెవెన్యూ, పర్యాటక, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉన్నారు. -
అనంతపురం: తాడిపత్రిలో 500 పడకల తాత్కాలిక ఆసుపత్రి
అనంతపురం: కోవిడ్ రోగుల కోసం జిల్లాలోని తాడిపత్రిలో 500 పడకల తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ గంధం చుంద్రుడు తెలిపారు. కోవిడ్‌కు సంబంధించి జిల్లాలో తీసుకుంటున్న చర్యలపై ఆయన మాట్లాడారు. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. అత్యవసర వినియోగానికి ఆక్సిజన్ ట్యాంకర్‌ను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు పేర్కొన్నారు. కోవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. రెమిడెసివిర్ ఇంజక్షన్లు పక్కదారి పట్టించే ఉద్యోగులను సస్పెండ్ చేయడానికి వెనుకాడబోమని తెలిపారు. -
అనంతపురంలో ఎక్కువగా సెకండ్ వేవ్: గంధం చంద్రుడు
-
చెప్పుల్లేకుండా.. మండుటెండలో కలెక్టర్ మట్టి పని
సాక్షి, ఆత్మకూరు(అనంతపురం): ఉపాధి కూలీలకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మజ్జిగ పంపిణీకి చర్యలు చేపడతామని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. మంగళవారం ఆయన ఆత్మకూరు మండలంలోని వడ్డుపల్లి గ్రామం వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పులేసుకోకుండా మండుటెండలో గడ్డపార చేతపట్టి మట్టి తవ్వతూ కూలీల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడిన కలెక్టర్ రోజు పనులు కల్పిస్తున్నారా..? క్రమం తప్పకుండా డబ్బులు అందుతున్నాయా..? అని కూలీలను ఆరా తీశారు. తాము అడిగిన వెంటనే అధికారులు పనులు కల్పిస్తున్నారని, ఈరోజు(మంగళవారం) రూ.234పైగా కూలి పడిందని కూలీలు తెలపగా.. కలెక్టర్‌కు సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ రామాంజనేయులును అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పనులు చేసే ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలన్నీ పాటించేలా చూడాలన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 2.66 కోట్ల మంది కూలీలకు ఉపాధి హామీ కింద పనులు కల్పించామన్నారు. రోజూ రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వేతనం కూలీలకు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, ఏపీడీ నీలిమారెడ్డి, ఎంపీడీఓ రామాంజనేయులు, ఏపీఓ సుజాత పాల్గొన్నారు. చదవండి: తాడిపత్రి: వైఎస్సార్సీపీ కార్యకర్తపై వేట కొడవలితో దాడ -
కిలిమంజారోపై చిన్నారి రిత్విక
అనంతపురం: ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన శిఖరంగా ఖ్యాతిగాంచిన కిలిమంజారో పర్వతాన్ని జిల్లాకు చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి రిత్విక గత శుక్రవారం అధిరోహించింది. పర్వతం శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత జాతీయడ జెండాతో పాటు కలెక్టర్ గంధం చంద్రుడు ఫొటోను చిన్నారి ప్రదర్శించింది. కాగా, తాడిమర్రి మండలం ఎం.అగ్రహానికి చెందిన కడపల శంకర్ కుమార్తె రిత్విక.. ఆర్థిక ఇబ్బందులు కారణంగా అరుదైన రికార్డుకు దూరమవుతున్నట్లు తెలుసుకున్న కలెక్టర్ గంధం చంద్రుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.2,98,835 ఆర్థిక సాయాన్ని అందేలా చేశారు. రికార్డుల సాధనకు బయలుదేరిన చిన్నారి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చిన కలెక్టర్‌ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాబట్టుకోవడం విశేషం. చదవండి: ప్రేమకు ద్రోహం చేయకూడదనుకున్నా.. కదులుతున్న అవినీతి డొంక: ‘పచ్చ’నేతల గుండెల్లో రైళ్లు -
అనంత కలెక్టర్‌కు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి / అనంతపురం అర్బన్: ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ జాతీయ అవార్డు అందుకున్న అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పనితీరుపై సీఎం ప్రశంసించారు. ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చే దిశగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్ పూనం మాలకొండయ్య, జేడీఏ రామకృష్ణ పాల్గొన్నారు. చదవండి: (పీఎం కిసాన్ అవార్డు అందుకున్న ‘అనంత’ కలెక్టర్) -
అనంత కలెక్టర్‌కు ప్రధాని మోదీ ప్రశంస
సాక్షి, అనంతపురం: అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈనెల 11న కలెక్టర్ గంధం చంద్రుడు నిర్వహించిన ‘బాలికే భవిష్యత్తు’కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి జవదేకర్ అభినందించగా.. తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. తన ‘మన్‌కీ బాత్’లో ప్రశంసించారు. అనంతపురం జిల్లాలో ‘బాలికే భవిష్యత్తు’ పేరిట ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం చేపట్టి, కార్యాలయ అధికారులుగా ఒక రోజు పనిచేసే అవకాశం బాలికలకు కల్పించారని ప్రధాని పేర్కొన్నారు. (అనంత కలెక్టర్‌కు కేంద్రమంత్రి ప్రశంసలు) -
అనంత కలెక్టర్‌కు కేంద్రమంత్రి ప్రశంసలు
సాక్షి, అనంతపురం : అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈనెల 11న ‘బాలికే భవిష్యత్’ పేరుతో జిల్లాలో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ నుంచి ప్రశంసలు దక్కాయి. కలెక్టర్ గంధం చంద్రుడు ఆ రోజు జిల్లా కార్యాలయ అధికారులుగా బాలికలకు అవకాశం కల్పించడంపై కేంద్ర మంత్రి స్పందించారు. ఒక రోజు కలెక్టర్‌గా ఇంటర్ విద్యార్థిని ఎం.శ్రావణితో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఒక రోజు అధికారులుగా బాలికలు పనిచేశారు. దీనిపై కేంద్ర మంత్రి ట్విటర్ వేదికగా అభినందించారు. బాలికలకు ఇలాంటి అవకాశాన్ని జిల్లా యంత్రాంగం కల్పించడం స్ఫూర్తిదాయకమని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. 16-year old M. Sravani, brave daughter of a farm labourer of Anantapur AP, assumed office of Anantapur Dist. Collector on 11th Oct. for one day. District Administration had decided to give an opportunity to one girl each as head of all govt. offices in the district.#NewIndia pic.twitter.com/zNCv7pqEzg — Prakash Javadekar (@PrakashJavdekar) October 20, 2020 -
సత్య నాదెళ్ల సతీమణి అనుపమ ఔదార్యం
సాక్షి, అనంతపురం : మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ ఔదార్యం చూపారు. రైతులు, వ్యవసాయ కూలీల అదనపు ఉపాధి కోసం ఆమె 2 కోట్ల రూపాయిల విరాళం ప్రకటించారు. అనంతపురం యాక్షన్ ఫ్రేటార్నా ఎకాలజీ సెంటర్‌కు ఈ విరాళాన్ని అనుపమ అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అనుపమ నాదెళ్లను అభినందించారు. (నాన్నా.. నువ్వే నా దిక్సూచి: నాదెళ్ల) దాతలు ఇచ్చిన ఆర్ధిక సాయంతో రైతులు, వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ వైవీ మల్లారెడ్డి తెలిపారు. కాగా అనుపమ తండ్రి వేణుగోపాల్ ఐఏఎస్ అధికారి. పలు ప్రాంతాల్లో ఆయన కలెక్టర్‌గా పనిచేశారు. అప్పట్లో తండ్రి ఉద్యోగరీత్యా ఆమె కూడా దేశమంతా పర్యటించారు. అప్పుడే అక్కడ సమస్యలను తెలుసుకున్న అనుపమ తన వంతు సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. -
ఈనెల 9న ఢిల్లీకి కిసాన్ రైలు
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌కు కిసాన్ రైలు మంజూరైందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు ఉద్దేశించిన ఈ రైలు అనంతపురం - ఢిల్లీ మధ్య రాకపోకలు సాగిస్తుందని పేర్కొన్నారు. రైతులకు లబ్ధి చేకూర్చే కిసాన్ రైలును ఈ నెల 9న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.(చదవండి: 9న ఢిల్లీకి కిసాన్ రైలు ) కాగా అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి ప్రాంతాల నుంచి అక్టోబర్ నుంచి ప్రతిరోజూ కిసాన్‌రైలు నడపడానికి రైల్వే అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మె ల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. అనంత నుంచి హస్తినకు వెళుతున్న తొలి కిసాన్‌రైలులో 500 టన్నుల వివిధ రకాల ఉద్యాన ఉత్పత్తులతో పాటు రైతులు, అధికారులు, కొందరు వ్యాపారులు వెళ్లడానికి ప్రత్యేకంగా స్లీపర్‌కోచ్ బోగీ ఒకటి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: కిసాన్ రైలు) ఇక రైల్వే శాఖ ప్రవేశపెట్టిన కిసాన్ రైలు సేవల ద్వారా రైతులు పండించే పళ్ళు, కూరగాయల రవాణాలో రోడ్డుమార్గంతో పోల్చుకుంటే ప్రయాణ సమయం, ఖర్చు ఆదా అవుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రకు చెందిన నాసిక్ జిల్లా దియోలలి నుంచి బిహార్‌లోని దనాపూర్‌కు దేశంలోనే తొలి కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆగష్టులో ప్రారంభించిన విషయం తెలిసిందే. -
టీడీపీ ఇన్చార్జ్పై కలెక్టర్ సీరియస్
సాక్షి, అనంతపురం : కళ్యాణదుర్గం టీడీపీ ఇన్చార్జ్ ఉమామహేశ్వర నాయుడుపై కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఉమామహేశ్వరనాయుడు తన పొలాలకు అక్రమంగా నీటిని తరలించడంపై సమగ్ర వివరాలతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన కలెక్టర్ గంధం చంద్రుడు.. తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. (జేసీ ప్రధాన అనుచరుడు రషీద్ మృతి) సోమవారం జీడిపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు. రిజర్వాయర్ నుంచి పెద్ద ఎత్తున నీటిని తరలించడం చట్టరీత్యా నేరమని, నీటిని తరలించడానికి ఎవ్వరికీ అనుమతులు లేవన్నారు. అనంతరం హెచ్ఎన్ఎస్ఎస్, రిజర్వాయర్ అధికారులు మాట్లాడుతూ జలచౌర్యంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. (‘చంద్రబాబు కనుసన్నల్లో ఏబీఎన్’) -
మీ చర్యలు బాగున్నాయ్.. కలెక్టర్‌కు కేంద్రం ప్రశంసలు
సాక్షి, అనంతపురం అర్బన్: కోవిడ్ కేర్ సెంటర్లలోని వ్యక్తుల్లో మానసింకంగా ఉల్లాసం నింపేందుకు కలెక్టర్ తీసుకున్న చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విటర్ ద్వారా ప్రశంసలు కురిపించింది. కేర్ సెంటర్లలోని పేషంట్లు కాలక్షేపం లేకపోవడంతో ఒంటరితనం భావనలో ఉండడాన్ని కలెక్టర్ గమనించారు. శారీరక, మానసిక ఉల్లాసం కల్పించడం ద్వారా వారిలోని ఒంటరి భావన తొలగించవచ్చని ఆలోచన చేశారు. అందులో భాగంగా కేర్‌సెంటర్లలో టెన్సిస్, షెటిల్, వాలీబాల్, క్యారమ్స్ వంటి ఆటలు, సంగీతం కోసం మ్యుజిక్ సిస్టం ఏర్పాటు చేయించారు. ఉదయం, సాయంత్రం వేళ ఎవరికి నచ్చిన... వచ్చిన ఆటలను అంతే కాకుండా కేర్ సెంటర్లలో కౌన్సిలర్లను ఏర్పాటు చేయించారు. వారు కోవిడ్ పేషంట్లకు కౌన్సిలింగ్ ఇస్తూ ఆత్మస్థైర్యం నింపుతారు. కోవిడ్ కేర్ సెంటర్లలో పేషంట్ల ఉల్లాసం కోసం విడుదల చేసిన డాక్యుమెంటరీపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విటర్ దారా స్పందించింది. కోవిడ్ కేర్ సెంటర్లలో మానసిక, శారీరక ఉల్లాసం కోసం తీసుకున్న చర్యల వల్ల పేషంట్లు ఉత్సాహంగా ఉంటూ త్వరగా రికవరీ అవుతారని పేర్కొంది. (రియల్ హీరోస్..) #IndiaFightsCorona A glimpse of the facilities being provided at the #COVID19 Care Centre, Anantapur district, Andhra Pradesh to the inmates to boost their morale and mental wellness. @PMOIndia @drharshvardhan @AshwiniKChoubey @PIB_India @COVIDNewsByMIB @CovidIndiaSeva pic.twitter.com/8aVYYC15q2 — Ministry of Health (@MoHFW_INDIA) August 3, 2020 -
'అనంత'కు సడలింపు
అనంతపురం అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో నాల్గో విడత లాక్డౌన్ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ గంధం చంద్రుడు, ఎïస్పీ సత్యయేసుబాబు స్పష్టం చేశారు. జిల్లాలో నిర్దేశించిన కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ యథావిధిగా అమలు అవుతుందన్నారు. నాన్ కంటైన్మెంట్ జోన్లలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వెసులబాట్లు ఉంటాయన్నారు. అయితే రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. అత్యవసరాలకు మినహాయింపునిస్తామన్నారు. బుధవారం ఆయన లాక్డౌన్ అమలు తీరును కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో విలేకరులకు వివరించారు. లాక్డౌన్లో వెసులబాట్లు కల్పిచడం అంటే కరోనా పోయినట్లు కాదనీ, ప్రతి ఒక్కరూ కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కంటైన్మెంట్ జోన్లు ఇలా.. జిల్లావ్యాప్తంగా 12 కంటైన్మెంట్ జోన్లు ప్రకటించమనీ, వీటి పరిధిలో 41 ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించామని కలెక్టర్ తెలిపారు. నెలలో పది పాజిటివ్ కేసులు నమోదై ఉండి, ఐదు రోజుల్లో ఒక పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతంలో 500 మీటర్లు కోర్ ఏరియా, 500 మీటర్లు బఫర్ ఏరియా ఉంటుందన్నారు. ఐదు రోజులుగా ఒక కేసు నమోదు కాకపోతే ఆ ప్రాంతంలో 200 మీటర్లు కోర్ ఏరియా, 200 మీటర్లు బఫర్ ఏరియా ఉంటుందన్నారు. 14 రోజులుగా కేసు నమోదు కాకపోతే కేవలం 200 మీటర్లు కోర్ ఏరియా మాత్రమే ఉంటుందన్నారు. ‘పురం’ పూర్తిగా కంటైన్మెంట్ జోన్ హిందూపురం పట్టణాన్ని పూర్తిగా కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించామని కలెక్టర్ చంద్రుడువెల్లడించారు. హిందూపురం రూరల్‌లో ఒక ప్రాంతం, అనంతపురం అర్బన్‌లో 8 ప్రాంతాలు, అనంతపురం రూరల్‌లో ఒక కంటైన్మెంట్ జోన్ ఉంటుందన్నారు. ఇలా మొత్తం 12 జోన్ల పరిధిలో 41 కంటైన్మెంట్ క్లస్టర్లు ఉంటాయన్నారు. వీటి పరిధిలో 40 వేల కుటుంబాలు, 2.15 లక్షల జనాభా ఉంటుందన్నారు. ఈ ప్రాంతాల్లో లాక్డౌన్ యథావిధిగా అమలు అవుతుందన్నారు. దుకాణాలు తెరిచేందుకు రెండు రోజుల్లో నిర్ణయం నాన్ కంటైన్మెంట్ జోన్న్లుగా ఉన్న అర్బన్ ప్రాంతాల్లో దుకాణాలు తెరిచేందుకు రెండు లేదా మూడు రోజులు సమయం పడుతుందన్నారు. అన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా తెరుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయా పట్టణాల్లో వ్యాపారులతో మున్సిపల్ అధికారులు సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలు జారీ చేస్తారన్నారు. దుకాణాలు ఒకరోజు ఒకవైపున తెరిస్తే మరుసటి రోజు రెండవ వైపున దుకాణాలు తెరిచేలా చూస్తామన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీగా రవీంద్రనాథ్ అనంతపురం టౌన్: రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్‌గా రవీంద్రనాథ్ను నియమిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్నాళ్లూ వైఎస్సార్ కడప జిల్లా డీఐజీగా ఉన్న గిరిబాబుకు అనంతపురం జిల్లా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో బుధవారం రవీంద్రనాథ్‌కు రెగ్యులర్ డీఐజీగా బాధ్యతలు అప్పగిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. -
‘‘వలస కూలీలను మానవీయ కోణంలో చూడాలి’’
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి రైతుల పక్షపాతి అని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్రామ స్థాయిలో విత్తనాల పంపిణీ చారిత్రాత్మకమన్నారు. రైతులకు 40 శాతం సబ్సిడీపై విత్తనాల పంపిణీ చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని మంత్రి విమర్శించారు. (‘బాబు కరోనా రాజకీయాలు పక్కనపెట్టాలి’) ఇక ఎమ్మెల్యే జొన్నగడ్డ పద్మావతి మాట్లాడుతూ... సీఎం జగన్ రైతులకు అండగా నిలిచారన్నారు. రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ. 13500 రూపాయల సాయం అందించామని పేర్కొన్నారు. గ్రామాల్లో వేరుశనగ విత్తనాల పంపిణీ అభినందనీయమని, టీడీపీ పాలనలో విత్తనాల కోసం రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. టీడీనీ పాలనలో రూతులు విత్తనాల కోసం క్యూలో నిలబడి చనిపోయినా చంద్రబాబు పట్టించుకోలేదు మండిపడ్డారు. ఇక సీఎం వైఎస్ జగన్ రైతు కష్టాలు తీర్చారని ఎమ్మెల్యే అన్నారు. కూలీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాం: కలెక్టర్ వలస కూలీలను మానవీయ కోణంలో చూడాలని ముఖ్యమంత్రి వెఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు వలస కూలీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పారు. వలస కూలీలకు భోజనం, మంచినీరు అందిస్తున్నామని. ఇక ప్రభుత్వ ఖర్చులతోనే వలస కార్మికులను తమ సొంత ఊళ్లకు తరలిస్తున్నామని వెల్లడించారు. అనంతపురం-ఉత్తరప్రదేశ్, అనంతపురం-బీహార్‌కు వెళ్లే వలస కూలీల కోసం శ్రామిక రైళ్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. (కరోనా: నాలుగు రోజులు హిందూపూర్ బంద్) -
కరోనా: నాలుగు రోజులు హిందూపూర్ బంద్
సాక్షి, హిందూపురం: కరోనా పాజిటివ్ కేసుల నేప«థ్యంలో మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు హిందూపురంను పూర్తిగా బంద్ చేస్తున్నట్లు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. కర్ఫ్యూ స్థాయిలో లాక్డౌన్ పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. నిబంధనలు సైతం మరింత కఠినతరం చేస్తున్నట్లు వెల్లడించారు. హిందూపురంలో మూడురోజులుగా మాకాం వేసిన కలెక్టర్ ఇప్పటికే పలు దఫాలుగా వైద్యాధికారులు, రెవెన్యూ, మున్సిపల్ ఇతర శాఖ అధికారులతో పాటు మత పెద్దలు, పుర ప్రముఖులతో సమావేశమయ్యారు. (ఓ నాన్న.. నీ మనసే వెన్న) అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని రానున్న నాలుగురోజులు ‘పురం’ పూర్తిగా బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలెవరూ బయటకు వచ్చేందుకు వీలు లేదన్నారు. రెడ్‌జోన్‌తో పాటు అన్ని ప్రాంతాల్లోని వారికి నిత్యావసర వస్తువులు, పాలు, సరుకులు, మందులన్నీ ఇళ్ల వద్దకే చేరేలా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ గంధం చంద్రుడు సోమవారం సాయంత్రం జేసీ డిల్లీరావు, సబ్ కలెక్టర్ నిషాంతితో కలిసి హిందూపురం ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాతా శిశు వైద్యశాలలోని వార్డులను, స్వైన్‌ఫ్లూ వార్డులను, ఓపీ నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్యసేవల గురించి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులను అడిగి తెలుసుకున్నారు. కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స చేసేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారం తీసుకోవాలని ఇన్చార్జి డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. అలాగే పట్టణంలో ప్రైవేట్ హాస్పిటళ్లలో ఏయే సేవలు అందుతున్నాయో కలెక్టర్ ఆరా తీశారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ ప్రసాద్ బాబు, ట్రైనీ ఐఎఫ్ఎస్ అధికారి చైతన్య, తహసీల్దార్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పాజిటివ్ బాధితుల్లో గుజరాతీయులే ఎక్కువ జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో గుజరాత్‌వాసులే అధికంగా ఉన్నారని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. సోమవారం హిందూపురం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘పురం’లో ఉంటున్న గుజరాత్‌కు చెందిన 24 మంది, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున మొత్తం 26 మంది కరోనా బారిన పడ్డారన్నారు. హిందూపురంలో మొత్తం 45 కేసులు నమోదు కాగా.. 12 మంది కోలుకొని ఇంటికి చేరారన్నారు. ఇక హిందూపురానికి చెందిన పాజిటివ్ కేసుల్లో నాలుగు మాత్రమే యాక్టివ్‌లో ఉన్నాయని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తోందని, అందువల్లే బాధితులంతా కోలుకుంటున్నారన్నారు. -
బయట తిరిగితే క్వారంటైన్కే !
హిందూపురం: కరోనా కట్టడిలో భాగంగా ఇకపై ఎలాంటి కారణం లేకుండా బయట తిరిగే వారిని నేరుగా క్వారంటైన్‌కు తరలించేదిశగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్, ఎస్పీ సత్యయేసుబాబులు తెలిపారు. ఆదివారం కలెక్టర్, ఎస్పీలతో పాటు జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో కోవిడ్ –19 పై నోడల్ అధికారులు, వైద్యాధికారులు, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారికి సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 7 మందిని ట్రేస్ చేస్తే జిల్లాలో 24 నుంచి 25 మందిని ట్రేస్ చేస్తున్నామన్నారు. సెకండరీ కాంటాక్ట్‌కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 10 మందిని ట్రేస్ చేస్తే, జిల్లాలో 19 మందిని ట్రేస్ చేసి నమూనాలు తీసుకుని పరీక్షలు చేస్తున్నామన్నారు. ఏ ఒక్కరు మిస్ కాకుండా చూస్తున్నామని తెలిపారు. ఒక్కటి మిస్ అయినా రోజుకు 12 మందికి కరోనా వైరస్ వ్యాప్తిచెందే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటి వరకు పాజిటివ్ వచ్చిన వారికి సంబంధించి 70 శాతం మేర కాంటాక్ట్ ట్రేసింగ్ పూర్తిచేశామన్నారు. ‘పురం’పై ప్రత్యేక దృష్టి.. జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో హిందూపురంపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు కలెక్టర్ తెలిపారు. హిందూపురంలో పాజిటివ్ కేసులకు సంబంధించి ఏ ఒక్క కాంటాక్ట్ మిస్ కాకుండా సర్వేచేస్తూ ప్రతిఒక్కరి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికి రోగనిరోధక శక్తి పెంచే ఆహారాన్ని అందించాలన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న ముస్లింలకు రంజాన్ మాసం సందర్భంగా డ్రై ఫ్రూట్స్, పండ్లను అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ముతవల్లి, మౌజమ్, పాస్టర్, పూజారులకు రూ.5 వేలు.. వక్ఫ్‌బోర్డు పరిధిలోని మసీదుల్లోని మౌజమ్, ముతవల్లిలతో పాటు చర్చిలలో పనిచేసే పాస్టర్లు , ఎండోమెంట్ పరిధిలో లేని, రూ.5 వేల కంటే తక్కువ జీతం పొందే దేవాలయ పూజారులకు ప్రభుత్వం తరఫున రూ.5 వేలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ చెప్పారు. రెడ్జోన్లలో పనిచేసే వారికి పీపీఈ కిట్లు.. హిందూపురంలోని రెడ్జోన్లలో పనిచేసే పోలీసు, రెవెన్యూ, వైద్య బృందం సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి అవసరమైన 6 వేల పీపీఈ కిట్లు, 4 వేల మాసు్కలు, 3 వేల శానిటైజర్లు, 4 వేల గ్లౌజులను ఇవ్వాలని హిందూపురం మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, సీఐలకు కలెక్టర్ గంధం చంద్రుడు అందజేశారు. సమావేశంలో పెనుకొండ సబ్‌కలెక్టర్ నిషాంతి, డీఎఫ్ఓ జగన్నాథ్‌సింగ్, ట్రైనీ ఐఎఫ్ఎస్ చైతన్య, కోవిడ్ 19 నోడల్ అధికారులు, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు. ర్యాపిడ్ కిట్లతో పోలీసులకు పరీక్షలు రెడ్జోన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ర్యాపిడ్ కిట్ల ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించనున్నట్లు డీఎస్పీ మహబూబ్‌బాషా తెలిపారు. అలాగే రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రజలెవరూ సంచరించకుండా కఠిన ఆంక్షలు విధించామన్నారు. ఈక్రమంలో డబ్బు కోసం ఇబ్బందులు పడకుండా మొబైల్ ఏటీఏం ద్వారా నగదును పొందే అవకాశాన్ని ఏర్పాటు చేశారు. రెడ్‌జోన్‌లో పర్యటించిన కలెక్టర్, ఎస్పీ హిందూపురం: పట్టణంలో రెడ్‌జోన్ ప్రాంతమైన ముక్కిడిపేటను కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ సత్యయేసుబాబు, జేసీ డిల్లీరావులు ఆదివారం పర్యటించారు. కోవిడ్ నియంత్రణ చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన రూ.100 విలువ చేసే 120 పండ్ల కిట్లను ఆ ప్రాంత ప్రజలకు అధికారులు పంపిణీ చేశారు. మరో ఇద్దరి పాజిటివ్ అనంతపురం: సర్వజనాస్పత్రిలోని ఇద్దరు వైద్య సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53కు చేరినట్లు కలెక్టర్ గంధం చంద్రుడు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. కాగా వీరిలో నలుగురు మృత్యువాత పడగా...14 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో ప్రస్తుతం 35 పాజిటివ్ కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. సేవలందించే క్రమంలో.. కరోనా పాజిటివ్ వ్యక్తులకు వైద్య సేవలందించే క్రమంలో ఆస్పత్రిలోని ఇద్దరు సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. నగరంలోని సాయినగర్‌కు చెందిన 39 ఏళ్ల మహిళ 17వ కాంటాక్ట్‌తో సన్నిహితంగా ఉండటం కారణంగా కరోనా బారినపడ్డారు. అలాగే అంబేడ్కర్‌నగర్‌కు చెందిన 24 ఏళ్ల వ్యక్తికి కోవిడ్ సోకింది. ఇతను 46వ కాంటాక్ట్ కామారుపల్లికి చెందిన 28 ఏళ్ల వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో వైరస్ సోకింది. ఆస్పత్రిలోని సిబ్బందికి వైరస్ సోకుతుండటంతో వైద్యులు, స్టాఫ్‌నర్సులు, సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. కరోనా పాజిటివ్ కేసులకు కాంటాక్ట్‌లో ఉన్న వారు హోం ఐసోలేషన్, క్వారన్‌టైన్‌కు వెళ్లిన విషయం విధితమే. కొత్తగా నమోదైన వారితో సన్నిహితంగా ఉన్న వారు కూడా క్వారన్‌టైన్‌కు వెళ్లే పరిస్థితి నెలకొంది. కరోనా బారిన పడ్డ వీరిద్దరిని బత్తలపల్లి ఆర్డీటీ హాస్పిటల్‌కు తరలించారు. కంటైన్మెంట్ జోన్ .. తాజాగా పాజిటివ్ కేసులు నమోదైన నగరంలోని సాయినగర్, అంబేడ్కర్నగర్లలో అధికారులు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. వంద మీటర్ల వరకు ఎవరూ బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెడ్‌జోన్‌లో కమిషనర్ పర్యటన అనంతపురం సెంట్రల్: నగరంలో రెడ్‌జోన్ ప్రాంతమైన అంబేద్కర్‌నగర్‌లో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రశాంతి పర్యటించారు. కరోనా బారిన పడిన బాధితుల కుటుంబ సభ్యులు ఎవరూ బయటకు రావద్దని సూచించారు. చికెన్, మటన్ దుకాణాలను పరిశీలించి, శానిటైజర్, గ్లౌజులు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే దుకాణం మూసివేస్తామని హెచ్చరించారు. అనంతరం బిందెల వారి కాలనీకి వెళ్లి అక్కడ జరుగుతున్న స్ప్రేయింగ్ పనులను పరిశీలించారు. -
కోవిడ్ ఆస్పత్రుల్లో 1,000 పడకలు సిద్ధం
సాక్షి, అనంతపురం: కరోనా వైరస్ కట్టడికి జిల్లాలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించామని, ఈ మేరకు పోలీసు శాఖకు ఆదేశాలిచ్చామని కోవిడ్–19 జిల్లా ప్రత్యేక అధికారి కె.విజయానంద్ తెలిపారు. బుధవారం ఆయన కలెక్టర్ గంధం చంద్రుడుతో కలిసి కలెక్టరేట్లేని రెవెన్యూ భవన్లో విలేకరులతో మాట్లాడారు. అనంతపురం, హిందూపురంలో రెడ్జోన్లు ఏర్పాటు చేసి, ప్రతి రెడ్‌జోన్‌లో ఒక సబ్‌కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలకు సరుకులు, పాలు, నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. పర్యవేక్షణకు రెడ్‌జోన్‌కు ఒక నోడల్ అధికారిని నియమించామన్నారు. ఇక కరోనా లక్షణాలున్నవారి నుంచి సేకరించిన శాంపిల్స్ టెస్టింగ్ ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. (క్వారంటైన్ నుంచి వెళ్లేటప్పుడు పేదలకు రూ 2,000 సాయం) ఇప్పటి వరకు సేకరించిన నమూనాల్లో 80 శాతం ఫలితాలు వచ్చాయన్నారు. ఇంకా 350 శాంపిల్స్ టెస్టింగ్ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన కోవిడ్ ఆస్పత్రుల్లో 1,000 పడకలు సిద్ధంగా ఉంచామన్నారు. కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వ్యక్తికి మూడు మాస్క్‌లు ఇస్తామన్నారు. ఇందుకు జిల్లాకు 1.30 కోట్ల మాస్కులు తెప్పిస్తున్నామన్నారు. అంతకుముందు ఆయన కరోనా బారిన పడిన వారి కాంటాక్ట్ ట్రేసింగ్ అంశంపై రెవెన్యూ, పోలీసు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పాజిటివ్ కేసు నమోదు కాగానే వెంటనే కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ చేయాలన్నారు. పాజిటివ్ వ్యక్తులు ఏ ప్రాంతాల్లో సంచరించారు...? ఎవరెవరిని కలిశారు..? తదితర వివరాలతో పాటు వారి పేరు, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, తదితర వివరాలతో ప్రొఫార్మా రూపొందించి పంపాలన్నారు. ప్రైవేటు వైద్యుల భాగస్వామ్యం తప్పనిసరి అనంతపురం అర్బన్: కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రైవేటు వైద్యులు భాగస్వాములు కావాలని కోవిడ్–19 జిల్లా ప్రత్యేక అధికారి కె.విజయానంద్ ప్రైవేటు వైద్యులకు సూచించారు. బుధవారం ఆయన కలెక్టర్ గంధం చంద్రుడు, జేసీ డిల్లీరావుతో కలిసి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రైవేటు వైద్యులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎంపిక చేసిన ఆరు కోవిడ్ ఆస్పత్రుల్లో స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ప్రైవేటు వైద్యులు ముందుకు వచ్చి గురువారం నుంచి విధులకు హాజరుకావాలన్నారు. పారా మెడికల్ సిబ్బంది కూడా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీఎంహెచ్ఓ పద్మావతికి సూచించారు. ప్రైవేటు వైద్యులకు అన్ని రకాల సదుపాయాలు కలి్పస్తామన్నారు. కలెక్టర్ చంద్రుడు మాట్లాడుతూ, ప్రైవేటు వైద్యులు రోజూ మూడు షిఫ్ట్‌ల ప్రకారం సేవలందించాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, డీఎఫ్ఓ జగన్నాథ్‌సింగ్, అడిషనల్ డీఎంహెచ్ఓ పద్మావతి, ఐఎంఏ కోవిడ్ కో–ఆర్డినేటర్ మనోరంజన్ పాల్గొన్నారు. -
కరోనా ఆస్పత్రిగా కిమ్స్ సవీరా
అనంతపురం: జిల్లాలోని ఆరు ఆస్పత్రులను కోవిడ్ లైన్ ఆస్పత్రులుగా గుర్తించినట్లు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. కిమ్స్–సవీరా ఆస్పత్రిని ఇక నుంచి పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్పు చేసినట్లు వెల్లడించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. సవీరాతో పాటు మరో ఐదు ఆస్పత్రులను లైన్ ఆస్పత్రులుగా ఏర్పాటు చేశామన్నారు. శాంపిల్స్ సేకరణకు జిల్లాలో 18 మొబైల్ వ్యాన్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శాంపిల్స్ టెస్టింగ్ సామర్థ్యం రోజుకు 300కు పెంచామన్నారు. పర్యవేక్షణకు జేసీని నోడల్ అధికారిగా నియమించినట్లు వెల్లడించారు. ఆరు లైన్ ఆస్పత్రుల్లో 723 పడకలు అందుబాటులో ఉంటాయన్నారు. కరోనా పాజిటివ్ కేసుల్లో సీరియస్‌గా ఉన్నవాటిని సవీరాకు పంపుతారనీ, లైన్–2 ఆస్పత్రిగా ఉన్న బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి నాన్ సీరియస్ పాజిటివ్ కేసులను పంపిస్తామన్నారు. ఇక లైన్–3 ఆస్పత్రిగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి, లైన్–4 ఆస్పత్రిగా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి, లైన్–5 ఆస్పత్రిగా వైఎస్సార్ మెమోరియల్ ఆస్పత్రి, లైన్–6 ఆస్పత్రిగా చంద్ర సూపర్ స్పెషాలిటీ ఉంటాయన్నారు. శాంపిల్స్ సేకరణ, టెస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో రక్షణ సామగ్రిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం 7,073 పీపీఈ కిట్లు, 1,700 ఎన్–95 మాస్‌్కలు, 71 వేల సర్జికల్ మాస్కులు, 1.75 లక్షల గ్లౌజ్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. అనంతరం కోవిడ్ కేసుల అంశంపై కలెక్టర్ కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ డిల్లీరావుతో కలిసి జిల్లా, డివిజన్, మండల స్థాయి, మునిసిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారి శాంపిల్స్ తీయడంతో పాటు, వారందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని సూచించారు. రైల్వే ఐసోలేషన్ బోగీల పరిశీలన.. గుంతకల్లు: గుంతకల్లు రైల్వే ఆస్పత్రి, జంక్షన్‌లోని 5వ నంబర్ ప్లాట్ఫారంలోని ఐసోలేషన్ బోగీలను, రైల్వే ఇన్స్టిట్యూట్లోని క్వారంటైన్ సెంటర్లను కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. రైల్వే డీఆర్ఎం అలోక్ తివారీని అడిగి వివరాలు తెలుసుకున్నారు. -
చేతులెత్తి మొక్కుతున్నా..
అనంతపురం అర్బన్: ‘‘జిల్లాలో కోవిడ్(కరోనా వైరస్)కు అడ్డుకట్ట వేసే దిశగా పటిష్ట చర్యలు చేపట్టాం. జిల్లాస్థాయిలో సవీరా ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా గుర్తింపు ఇచ్చాం. లాక్డౌన్ పటిష్టంగా అమలవుతోంది. ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూస్తున్నాం. మేమంతా మీ కోసం శ్రమిస్తున్నాం. ఇటలీ, స్పెయిన్‌లో ఏమయ్యిందో చూస్తున్నాం. జాగ్రత్తలు పాటించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చేతులెత్తి మొక్కి మిమ్మల్ని వేడుకుంటున్నా. జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి.’’ అంటూ కలెక్టర్ గంధం చంద్రుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన స్థానిక కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. అత్యవసర సేవలకు అంతరాయం లేదు లాక్డౌన్ అమలులోకి వచ్చిన మొదటి రోజుల్లో ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ను ప్రజలు బాగా పాటిస్తున్నారు. అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తున్నాం. నగరంలో 8 చోట్ల అదనంగా కాయగూరల మార్కెట్లు ఏర్పాటు చేశాం. మార్కెట్లకు వచ్చే ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నాం. పండ్లు, కాయగూరలు, నిత్యావసర సరకులు చేరవేసే వాహనాలకు అనుమతిస్తున్నాం. ఆ వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలిచ్చాం. మాస్క్‌లు సిద్ధం చేయిస్తున్నాం మాస్క్‌ల కొరత లేకుండా చర్యలు చేపట్టాం. ఎన్95 మాస్క్‌లు కావాలని కొందరు అడుగుతున్నారు. వాస్తవంగా వీటిని రోగికి చికిత్స అందించే వైద్యులు, సిబ్బంది, దగ్గు, జలుబు, ఇతర రుగ్మతలు ఉన్నవారు వాడాలి. ఆరోగ్యవంతులు మాస్క్ వాడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా మామూలు మాస్క్ వాడితే సరిపోతుంది. ఎస్జీఓ, ఎస్‌హెచ్‌జీ, ఆర్డీటీ ద్వారా బట్ట మాస్క్‌లు సిద్ధం చేయిస్తున్నాం. ‘సవేరా’కు కోవిడ్ ఆస్పత్రిగా గుర్తింపు జిల్లాస్థాయిలో సవేరా ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా గుర్తించాం. జిల్లాలో నాలుగు వేల మంది ఆర్ఎంపీలు ఉన్నారు. వీరి సేవలను అవసరమైనప్పుడు వినియోగించుకునేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపాం. 14 నియోజకవర్గాల పరిధిలో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 686 గదుల్లో 1,951 పడకలు ఏర్పాటు చేయించాం. ప్రతి కేంద్రానికి ఒక ప్రత్యేక అధికారి, ఒక వైద్యాధికారి, ఏఎన్ఎం అందుబాటులో ఉంటారు. మక్కా నుంచి 30 మంది హిందూపురం వచ్చారు. వారిని హిందూపురం క్వారంటైన్ కేంద్రంలో ఉంచి పరీక్షలు నిర్వహించాం. కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదు. కియా పరిశ్రమకు చెందిన 54 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. నిరాశ్రయులకు వసతి సదుపాయం నగరంలో 163 మంది నిరాశ్రయులను గుర్తించాం. మూడు నైట్ షెల్టర్లను గుర్తించి అక్కడికి చేర్చాం. స్వచ్ఛందసంస్థలతో చర్చించి వారికి భోజన వసతి ఏర్పాటు చేశాం. అదే విధంగా వారికి రెండు జతల దుస్తులు, టవల్ వంటివి అందించేందుకు చర్యలు తీసుకున్నాం. కోవిడ్ వ్యాప్తి నిరోధానికి చేపడుతున్న చర్యల్లో స్వచ్ఛంద సంస్థలను (ఎన్జీఓ) భాగస్వాములను చేయాలని నిర్ణయించాం. క్రియాశీలంగా ఉండే 28 ఎన్జీఓలను గుర్తించాము. వాటి స్తోమతకు తగ్గట్టుగా భాగస్వామ్యం కల్పిస్తున్నాం. వలస కూలీలపై ప్రత్యేక దృష్టి జీవనోపాధి కోసం రాయదుర్గం, కదిరి ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు కూలీలు వలస వెళ్లారు. లాక్డౌన్ నేపథ్యం వారంతా తిరిగి వచ్చారు. ఇలా తిరిగి వచ్చిన 373 మంది వలస కూలీలను గుర్తించాం. వారందరినీ స్టే ఎట్ హోమ్ నోటీసు ఇచ్చాం. 28 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండేలా చర్యలు తీసుకున్నాం. విదేశాల నుంచి వచ్చిన వారు 1,014 మంది విదేశాల నుంచి 1,014 మంది జిల్లాకు వచ్చినట్లు గుర్తించాం. వీరిలో 957 మందిని ట్రేస్ ఔట్ చేశాం. మిగిలిన 57 మందిని గుర్తించాల్సించాలి ఉంది. 957 మందికి స్టే ఎట్ హోమ్ నోటీసు ఇచ్చాం. వీరిలో 167 మంది 28 రోజుల హోమ్ ఐసోలేషన్ పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారిలో కొందరు 14 రోజుల్లోపు, మరికొందరు 14 నుంచి 28 రోజుల్లోపు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితి పరిశీలించేందుకు ఒక్కొక్కరి వద్ద ఒక ఏఎన్ఎం అందుబాటులో ఉంచాం. ప్రతి కుటుంబానికి ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేశాం. వైద్య కళాశాలలో లేబొరేటరీ ప్రభుత్వ వైద్య కళాశాలలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు టెస్టింగ్ లేబొరేటరీ ఏర్పాటు చేశాం. ఇక్కడ అనంతపురం, కర్నూలు జిల్లా నుంచి వచ్చే శాంపిల్స్‌ను పరిశీలిస్తారు. అనంతరం తిరుపతి స్విమ్స్, పూణే కేంద్రాలకు పంపిస్తారు. పరిశీలన అనంతరం గుర్తించిన పాజిటివ్ లేదా నెగిటివ్ కేసులను అధికారికంగా రాష్ట్రస్థాయికి తెలియజేస్తారు. అక్కడి అధికారులు ప్రత్యేక వైద్య బులిటెన్‌ను విడుదల చేస్తారు. వార్డు వలంటీర్ల ద్వారా సర్వే జిల్లాలో 20వేల మంది గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేయిస్తున్నాం. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని వారు పరిశీలిస్తున్నారు. సమాచారాన్ని ప్రత్యేక యాప్‌లో నమోదు చేసి పంపుతున్నారు. జాగ్రత్తల గురించి విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు ఈనెల 31 వరకు సరిపడా సరుకుల పంపిణీ చేయించాం. ఏప్రిల్ ఒకటి నుంచి 14 వరకు లాక్డౌన్ అమలులో ఉన్నందున మరోసారి వారందరికీ అంగన్వాడీ సిబ్బంది, మహిళ పోలీసు వెళ్లి సరుకులు అందజేస్తారు. ఉద్యాన పంటల ఎగుమతికి చర్యలు జిల్లాలో పండిన ఉద్యాన పంటలు యూపీ, ఎంపీ, తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో ఎగుమతి నిలిచిపోయింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శితో మాట్లాడాను. ఉద్యాన పంటల ఎగుమతికి సంబంధించి అంతర్రాష్ట్ర రవాణాకు అనుమతి ఇవ్వాలని కోరాం. -
దిశ చట్టం దేశానికే ఆదర్శం
అనంతపురం క్రైం: నగరంలోని మూడవ పట్టణ పోలీసుస్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన దిశ పోలీసుస్టేషన్‌ను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, డీఐజీ కాంతిరాణా టాటా ఆదివారం ప్రారంభించారు. అనంతరం దిశ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్, కంప్యూటర్ గదులు, పోలీసు స్టేషన్ ఆవరణంలోని ఆట స్థలం తదితర వాటిని వారు ప్రారంభించారు. కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టం దేశానికే ఆదర్శమన్నారు. కేసు నమోదైన మూడు వారాల్లోనే నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చట్టాన్ని రూపొందించారన్నారు. అత్యాచారాలు, అఘాయిత్యాలు జరగకుండా మహిళల భద్రతే బాధ్యతగా ప్రభుత్వం దిశ పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేసిందన్నారు. మహిళలు, అమ్మాయిలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేసేందుకు పోలీసుస్టేషన్లో అన్ని సదుపాయాలు కల్పించారన్నారు. మహిళల పని వేళల్లో మార్పు మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళా ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వివిధ శాఖల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మహిళా ఉద్యోగుల విధులుంటాయన్నారు. ఆ తర్వాత సమయాల్లో విధులకు హాజరుకావాల్సిన అవసరం ఉండదన్నారు. మేమున్నాం మహిళలు, అమ్మాయిల భద్రత, రక్షణకు మేమున్నాం. ప్రభుత్వం మహిళల భత్రలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా దిశ చట్టాన్ని రూపొందించింది. కేసు రిజిస్టర్ చేసిన 21 రోజుల్లో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు శిక్షణ పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇటీవల చిత్తూరులో 90 రోజుల్లో ఓ వ్యక్తికి ఉరిశిక్షణ పడిన విషయం అందరికీ తెలిసిందే. మహిళలు, అమ్మాయిలు దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దిశ పోలీసుస్టేషన్, వన్‌స్టాప్ సెంటర్‌ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. –కాంతిరాణా టాటా, డీఐజీ ఏడు రోజుల్లో చార్జ్‌షీట్ దిశ పోలీసుస్టేషన్, యాప్‌లో ఫిర్యాదు చేసిన ఏడు రోజుల్లో నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ఆర్ఎఫ్ఎస్ఎల్, మెడికల్ సర్టిఫికెట్లు నిర్దేశిత సమయంలో సేకరించేలా ఆయా విభాగాలను సంసిద్ధం చేసుకున్నాం. ఇప్పటికే జిల్లాలో వివిధ ఘటనల్లో నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపాము. దిశ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి అదనంగా 30 శాతం అలవెన్సులు, తదితర సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. – బీ.సత్యయేసుబాబు, ఎస్పీ డీఎస్పీకిసన్మానం దిశ పోలీసుస్టేషన్ ఏర్పాటుకు విశేష కృషి చేసిన డీఎస్పీ వీరరాఘవరెడ్డిని కలెక్టర్, డీఐజీ, ఎస్పీ సన్మానించారు. ఆయనతో పాటు దిశ పోలీసుస్టేషన్ ఏర్పాటుకు తమ వంతు సహకరించిన కియా, అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో ఐఏఎన్ అధికారి సుబ్రమణ్యం, జేసీ డిల్లీరావు, డీఎస్పీలు ఏ శ్రీనివాసులు, ఈ శ్రీనివాసులు, రమాకాంత్, సీఐలు ప్రతాప్‌రెడ్డి, రెడ్డప్ప, జాకీర్ హుస్సేన్ ఖాన్, కే శ్రీనివాసులు, మురళీధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మార్చి 7, 8న ఘనంగా లేపాక్షి ఉత్సవాలు
సాక్షి, విజయవాడ: రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలను ఇనుమడింపజేసేలా లేపాక్షి సంస్కృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు. బుధవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు పర్యాటక శాఖ ఏండీ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... మార్చి 7, 8న ఏపీ పర్యాటక శాక అధ్వర్యంలో అనంతపురంలో జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి లేపాక్షి ఉత్సావాలను వైభవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒక్కో ఏడాది ఒక్కో థీమ్‌తో ఉత్సవాలు జరుగుతాయని, ఈ ఏడాది సంస్కృతిని థీమ్‌గా తీసుకున్నామన్నారు. కాగా ఈ ఉత్సవం నిర్వహణకు 15 కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. బాహ్య ప్రపంచానికి తెలియజేప్పెలా ఈ ఉత్సవాల నిర్వహణ ఉంటుందని, 2018లో లక్షకు పైగా ప్రజలు వచ్చారన్నారు. ఈసారి ఇంకా ఎక్కువ పర్యటకలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన అంచన వేస్తున్నామన్నారు. ఈ ఉత్సవాలలో లేజర్ షో, ప్రముఖ గాయకులతో పాటలు, శోభాయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా పర్యాటకులకు ఒక మంచి అనుభూతిని అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాయలసీమ వైభవాన్ని తెలిపేలా.. గ్రామీణ పర్యటకాన్ని కూడా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అంతేగాక రాయలసీమ ప్రత్యేక వంటకాలను సైతం ఈ ఉత్సవాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఉగ్గాని, రాగి సంగటి, నాటుకోడి కూర, గుత్తి వంకాయ వంటి ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల్లో రాయలసీమ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఇక రాయలసీమ జీవన శైలిని ఉట్టిపడేలా దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా అత్యంత వైభవంగా నిర్వహించే ఈ లేపాక్షి వైభవములో అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నేను, నాది కాదు.. మనం, మనది! ఇక పర్యటక శాక ఏండీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రదేశాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాయలసీమలోను మంచి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటి ద్వారా ఇతర ప్రాంతాల వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ పర్యాటక ప్రాంతాలను గుర్తిస్తూ వస్తున్నామన్నారు. పర్యాటక రంగం మంచి ఆదాయ వనరని, దీని ద్వారా కేరళ మంచి ఆదాయాన్ని సమకూర్చుకుంటోoదన్నారు. ఈ రంగం ద్వారా స్థానికంగా ఉపాధి కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. కాగా కరోనా వార్తల నేపథ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం వైద్య సిబ్బందిని అందుబాటులో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
నేను, నాది కాదు.. మనం, మనది!
‘‘అభివృద్ధి అంటే ఆర్థికంగా మాత్రమే కాదు. సామాజిక అజెండా కూడా ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణమవుతుంది. ఈ భావనతోనే పని చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టంగా ఈ ఆలోచనతోనే ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేసుకోవడం.. ఇది మనదనే భావన పెంపొందించడం, సొంతంగా మన పనులు మనం చేసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆలోచనలను తొలగించడం వంటి ప్రాధమ్యాలతో పనిచేస్తున్నాం. కేవలం అధికారంతో పనిచేయించడం కాదు.. ఆలోచనల్లో మార్పులు తీసుకురావాలనే అభిప్రాయంతో ముందుకెళుతున్నాం’’ అని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. ‘కాఫీ విత్ సాక్షి’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన ‘సాక్షి’ ఎడిషన్ కార్యాలయాన్ని సందర్శించారు. పత్రిక ఎలా డిజైన్ అవుతుంది? ఎలా ప్రింట్ అవుతుందనే అంశాలను పరిశీలించడంతో పాటు జిల్లా అభివృద్ధిలో తన ప్రాధాన్యతలను ఆయన వివరించారు. – సాక్షి ప్రతినిధి, అనంతపురం ‘కాఫీ విత్ సాక్షి’ కార్యక్రమంలో భాగంగా రీడర్స్, సాక్షి ఉద్యోగులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు విద్యకు ప్రాధాన్యం గతంలో నాతో పాటు చదువుకునే ఒక మిత్రుడిని వాళ్ల తండ్రి.. కూలికి వెళితే రూ.10 వస్తాయి. చదువుకుంటే ఏం వస్తుందని పనులకు తీసుకెళ్లారు. కూలికి పోవడం వల్ల ఆ రోజు ఆదాయం కనిపించింది. కానీ నేను చదువుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఉద్యోగంతో పాటు ఐఏఎస్ కాగలిగాను. ప్రతి ఒక్కరూ పిల్లల చదువుకు ప్రాధాన్యత నివ్వాలి. భరోసా కల్పిద్దాం ‘‘ఈ కార్యాలయం మనందరిది. ఇక్కడి అధికారులను కలిసే సమయంలో దయచేసి చెప్పులు విడవవద్దు. చేతులు కట్టుకుని ఒంగి నిలబడవద్దు. కన్నీళ్లు పెట్టుకోకండి. కాళ్లు మొక్కకండి.’’ అనే పోస్టర్‌ను రూపొందించాం. ప్రజల భుజం మీద చేయి వేసి.. మేమున్నామనే ధైర్యాన్ని ఇవ్వాలి. సమస్యలను చెప్పుకునేందుకు వచ్చే ప్రజలకు భరోసా కల్పించినప్పుడే ఉద్యోగ జీవితానికి సార్థకత. విలువలు ముఖ్యం ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి అత్యంత కీలకం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కుల వెంట పరుగులు తీస్తుండటం విద్యార్థుల మానసిక స్థితిపై పెను ప్రభావం చూపుతుంది. అలా కాకుండా విద్యార్థి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ఫలితాలు ఉండాలి. ఏదో ఒకటి చేసి ఉత్తీర్ణత శాతం చూపించడం వల్ల.. ఆ విద్యార్థి భవిష్యత్తులో దేనికీ పనికిరాకుండా పోతాడు. అలాంటి చదువు వద్దు.. విలువలతో కూడిన విద్య ముఖ్యం. ‘‘ప్రభుత్వం అంటే ప్రజలది అనే భావన రావాలి. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతో (అధికారులతో) మాట్లాడేటప్పుడు కూడా మనం, మనది అనే చెబుతుంటారు. నేను, నాది అనే భావన కనిపించదు. అందరూ కలిసి పని చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.’’ చదవండి: అదిరిందయ్యా చంద్రం అధికారి తలుచుకుంటే.. అధికారులు ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి పనులు చేయాలి. అధికార దర్పంతో కాదు. ఇదెందుకు చెబుతున్నానంటే.. ‘‘నేను కర్నూలులోని జవహర్ నవోదయలో పదో తరగతి చదువుతున్న సమయంలో ఆర్ఆర్బీకి ఎంపికయ్యాను. ఆ ఉద్యోగంలో చేరేందుకు నాకు టీసీ అవసరం. నవోదయలో టీసీ తీసుకోవాలంటే రెండు నెలల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రిన్సిపాల్‌ను కలిస్తే, నిబంధనలు అలా ఉన్నాయని.. హైదరాబాద్‌కు వెళ్లి ఉన్నతాధికారిని కలవమని సూచించారు. చిన్న వయస్సులోనే ఉద్యోగం వచ్చిందనే సంతోషం ఒకవైపున్నా.. టీసీ వస్తుందో రాదోననే టెన్షన్. హైదరాబాద్‌కు వెళ్లి నా పరిస్థితిని అంతా వివరించగా ఆ అధికారి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ టీసీ మంజూరుకు అనుమతించారు. ఒక అధికారి తలుచుకుంటే.. ఎంతో కొంత సహాయం చేయగలరనేందుకు ఇదొక నిదర్శనం. ఆ భావన ప్రతి ఒక్కరిలో రావాలి.’’ సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘నేనూ రాయలసీమవాడినే. ఇక్కడి ప్రజల బాధలు, ఆశలు, ఆకాంక్షలు నాకు బాగా తెలుసు. ప్రధానంగా అనంతపురం జిల్లాలో వర్షపాతం చాలా తక్కువ. విపరీతమైన కరువు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులతో పాటు చదువు, ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే సాధ్యమైనంత ఎక్కువగా పొలాలకు నీరు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయాలతో ప్రజల గడప వద్దకే ప్రభుత్వ పాలన వచ్చింది. మనదనే భావన అందరిలో పెంపొందినప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. ఇక అధికారంతో పనులు చేయించడం నా విధానం కాదు.. ఆలోచనల్లో మార్పు తెచ్చి పనిచేయించాలన్నదే నా అభిమతం.’’ అని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే.. సాధారణంగా అభివృద్ధి, సంక్షేమం ఏదైనా ప్రభుత్వానికి రెండు కళ్లుగా ఉంటాయి. అయితే, కేవలం ఎకనమిక్ అజెండా(ఆర్థిక అభివృద్ధి) మాత్రమే కాకుండా సోషల్ ఎజెండాతో కూడా మిళితం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాంటి వారు మంచి స్టేట్స్‌మెన్‌గా గుర్తింపు పొందుతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి–సంక్షేమంతో పాటు వాటి అమలులో సోషల్ ఎజెండా కూడా ఉంది. అది వివిధ ప్రభుత్వ పథకాల్లో కూడా ప్రతిఫలిస్తోంది. ఇందుకు ఉదాహరణలు.. నామినేషన్ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం భాగస్వామ్యం కల్పించడం, నామినేషన్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్ల అమలు వంటివి ఉన్నాయి. ఇది నేరుగా మనకు కనపడుతోంది. పరోక్షంగా కూడా ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో. ప్రభుత్వ సేవలు కేవలం కొద్ది మందికి మాత్రమే కాకుండా.. వాయిస్ లేని వారికి కూడా అందుబాటులోకి తేవడం. గతంలో ఎవ్వరూ చేయని విధంగా ప్రస్తుత ప్రభుత్వం చేస్తోంది. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఇది మనదనే భావనతో.. ప్రభుత్వం అంటే ప్రజలది అనే భావన రావాలి. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతో(అధికారులతో) మాట్లాడేటప్పుడు కూడా మనం, మనది అనే చెబుతుంటారు. నేను, నాది అనే భావన కనిపించదు. అందరూ కలిసి చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే మన బడి నాడు–నేడు అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో బడి మనది అనే భావన కేవలం విద్యార్థులే కాదు.. వారి తల్లిదండ్రులు, గ్రామస్తుల్లో కూడా రావాలన్నదే అభిప్రాయం. తద్వారా మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. వాస్తవానికి విద్యారంగం మీద ప్రభుత్వం చేసే ప్రతీ పైసా ఖర్చు భావితరాలకు ఉపయోగపడుతుంది. అప్పటికప్పుడు అది ఆర్థిక ఫలితాలు ఇవ్వకపోవచ్చుకానీ.. దీర్ఘకాలంలో రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరం. మన బడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం చేస్తున్నారు. కచ్చింగా మూడేళ్ల కాలంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చెందుతాయి. చదవండి: అనంతపురం కలెక్టర్‌గా గంధం చంద్రుడు గడప వద్దకే...! గతంలో ఏదైనా ప్రభుత్వ అధికారిని కలవాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఏ సమయంలో అందుబాటులో ఉంటారనే విషయం కూడా ప్రజలకు తెలిసేది కాదు. మండల కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. అయితే, ప్రస్తుతం గ్రామ సచివాలయాలతో ప్రభుత్వ పాలన ప్రజల గడప వద్దకే వచ్చింది. ఒక గ్రామంలో ఏకంగా 11 మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయడం.. అందుకు అనుబంధంగా వలంటీర్ల వ్యవస్థ ఇంటి వద్దకు వెళ్లి సేవలందించడం ఇది ఒక చరిత్ర. ఇప్పుడు ఏదైనా పనికావాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఏయే అధికారి ఎక్కడ ఉంటారు? ఏయే పనులు చేస్తారు? కూడా స్పష్టంగా పేర్కొంటున్నాం. ఇప్పటికే జిల్లాలో గ్రామ సచివాలయాల వ్యవస్థ పనిచేస్తోంది. ఇంకా ఇబ్బందులు ఉన్న చోట సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్తాం. ఎక్కడా లేనివిధంగా జిల్లాలో మొదటిరోజే ప్రజలకు అవసరమైన సేవలను ప్రారంభించాం. 1బీ అడంగల్, డెత్, బర్త్ సర్టిఫికెట్లను జారీచేస్తున్నాం. అన్ని సేవలను కూడా అందుబాటులోకి తెచ్చి ప్రజల గడపవద్దకే పాలన అందిస్తాం. ఎవరో వచ్చి ఏదో చేస్తారని.. మనకు ఏదైనా సమస్య వస్తే ఎవరో వచ్చి ఏదో చేస్తారనే భావన ఎక్కువగా నాటుకుపోయింది. మన పనులను సొంతంగా మనమే చేసుకోవాలనే భావనను పెంపొందించాలనే ప్రయత్నం చేస్తున్నా. అందులో భాగంగా మన అనంత–సుందర అనంత కార్యక్రమాన్ని ప్రారంభించాం. మన ఇంటి పక్కన చెత్తను మనమే తీసేద్దాం. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుదామనే అభిప్రాయాన్ని ప్రజల్లో నాటేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది ఒక్క రోజులో అయ్యే పనికాదు. మన భావనలో మార్పులు రావాలంటే సమయం పడుతుంది. అయినప్పటికీ భవిష్యతులో వీటి ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. కేవలం ఉన్న అధికారాలతో ఆదేశాలు జారీచేసి పనులు చేయించే అవకాశం ఉంది. అయితే, అది కేవలం అప్పటివరకే ఉంటుంది. అలా కాకుండా అందరి ఆలోచనల్లో మార్పు వస్తే ఆ మార్పు మనం ఉన్నా లేకపోయినా ఎల్లకాలం ఉంటుంది. ఫలితాలకు లింకు లేదు చదువు అంటే కేవలం మార్కులు అనే భావన పోవాలి. బట్టీపట్టో, కాపీయింగ్ చేసో మార్కులు సాధించడం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండదు. మా పాఠశాలలో 100 శాతం రిజల్ట్స్ వచ్చింది. మా జిల్లాలో మంచి ఉత్తీర్ణత శాతం సాధించాం అని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అందుకే కేవలం మార్కుల మీద కాకుండా విజ్ఞానం పెంచుకోవడం మీద ధ్యాస ఉంచాలి. గతంలో పాఠశాల ఉత్తీర్ణత శాతానికి.. ప్రమోషన్లకీ లింకు ఉంది. అందుకే ఉత్తీర్ణత శాతం ఎక్కువ తెచ్చేందుకు ఉపాధ్యాయులు ఆరాటపడేవారు. ఇప్పుడు నేను పదో తరగతి ఉత్తీర్ణత విషయంలో కచ్చితంగా అందరికీ చెప్పాను. మీ ఫలితాలకు, ప్రమోషన్లకీ సంబంధం ఉండదని వివరించాం. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించి.. స్ట్రిక్టుగా ఉంటామని చెప్పడం వల్ల ఫలితం ఉండదు. మన ఆలోచనల్లోనే మార్పులు రావాలి. ఆ దిశగానే 10వ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఒక లేఖ రాశాను. త్వరలో 10వ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులతో టెలీ కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడాలని కూడా అనుకుంటున్నాను. -
అదిరిందయ్యా చంద్రం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాలనలో తనదైన ముద్రను కనపరుస్తున్నారు. అధికారులను సమన్వయం చేసుకుంటూనే ప్రజలకు దగ్గరయ్యే దిశగా నూతన సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఓ ప్రత్యేక పోస్టర్‌ను రూపొందించారు. ‘‘ఈ కార్యాలయం మనందరిది. అధికారులను కలిసే సమయంలో ఇలాంటి పనులు చేయకండి’’ అని ప్రజలకు సూచనలు చేస్తున్నారు. కలెక్టర్ గంధం చంద్రుడు రూపొందించిన పోస్టర్ ‘‘చెప్పులు విడవకండి.. మాట్లాడేటప్పుడు చేతులు కట్టుకుని నిలబడకండి. కన్నీరు పెట్టుకోకండి. కాళ్లు మొక్కకండి. ఆత్మగౌరవంతో మీ సమస్యను స్పష్టంగా వివరించండి.’’ అని తెలియజేసే పోస్టర్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృతంగా దూసుకుపోతున్నాయి. ఈ పోస్టర్లను జిల్లాస్థాయి కార్యాలయాలతో పాటు ప్రతి మండల కార్యాలయాలకు పంపి ప్రజలకు కనిపించే విధంగా అతికించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ వినూత్న పోస్టర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చదవండి: నేనూ రాయలసీమ బిడ్డనే: అనంత కలెక్టర్ -
అనంతపురం కలెక్టర్‌గా గంధం చంద్రుడు
సాక్షి, అనంతపురం : జిల్లా కలెక్టర్‌గా గంధం చంద్రుడు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న సత్యనారాయణను ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సహకార ఆర్థిక సంస్థ (ఏపీ ఎస్‌సీసీఎఫ్‌సీ) ఎండీగా నియమించింది. ఇక జిల్లా కలెక్టర్‌గా నియమితులైన గంధం చంద్రుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్కులాల సహకార ఆర్థిక సంస్థ (ఏపీ ఎస్‌సీసీఎఫ్‌సీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. సివిల్స్‌లో 198వ ర్యాంకు 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు స్వస్థలం కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కోటపాడు గ్రామ. లేపాక్షి నవోదయలో చదువుకున్న Výæంధం చంద్రుడు, ఆతర్వాత సికింద్రాబాద్‌లోని రైల్వే కళాశాలలో చదువుకున్నారు. విద్యాభ్యాసం తర్వాత దక్షిణమధ్య రైల్వే డివిజన్లో టికెట్ ఎగ్జామినర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2010లో సివిల్స్ రాసి 198 ర్యాంకు సాధించారు. ఐఏఎస్ శిక్షణ అనంతరం మెదక్ అసిస్టెంట్ కలెక్టర్‌గా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గా, ఐటీడీఏ పీఏగా పనిచేశారు. ఆ తర్వాత సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా వ్యవహరించారు. జాయింట్ కలెక్టర్‌గా 2015 మార్చి 5న కృష్ణా జిల్లా బాధ్యతలు తీసుకున్నారు. 2017లో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2019 జూలై నుంచి ఏపీ షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా పనిచేశారు. తాజాగా అనంతపురం జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సంక్షేమం’పై సత్యనారాయణ మార్క్ సత్యనారాయణ ఈ ఏడాది జూన్ 7వ తేదీన కర్నూలు జిల్లా నుంచి బదిలీపై అనంతకు వచ్చారు. కేవలం 5 నెలల 22 రోజులు మాత్రమే ఆయన కలెక్టరుగా విధులు నిర్వర్తించారు. ఈ కాలంలోనే జిల్లాలో సంక్షేమ హాస్టళ్లపై దృష్టి సారించారు. ఆకస్మిక తనిఖీలు, రాత్రి బస చేస్తూ సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. అప్పటికప్పుడు పలు సమస్యలు తీర్చారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా కృషి చేశారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపైనా వేటు వేశారు. ఇక రైతు భరోసా అమలులో రాష్ట్రంలోనే జిల్లా మొదటిస్థానంలో నిలిపేందుకు విశేషంగా కృషి చేశారు. -
జేసీ చంద్రుడు బదిలీ
సాక్షి, మచిలీపట్నం: జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు బదిలీ అయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన స్థానంలో రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న విజయ.కె (కృష్ణన్)ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా జేసీకి స్థాన చలనం కలిగింది. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జేసీ చంద్రుడు శిక్షణ అనంతరం తూర్పుగోదావరి జిల్లా రంపచౌడవరం ఐటీడీఏ పీఓగా తొలి పోస్టింగ్ పొందారు. అనంతరం సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా వ్యవహరించారు. 2015 మార్చి 5వ తేదీన జాయింట్ కలెక్టర్‌గా బదిలీపై జిల్లాకు వచ్చారు. అప్పటి నుంచి అధికారులను సమన్వయ పరిచి ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. బందరు పోర్టు భూ సమీకరణ నేపథ్యంలో అవతరించిన మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ఎంయూడీఏ) విభాగం అభివృద్ధికి కృషి చేశారు. భూ సమీకరణ అంశంపై ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ సత్ఫలితాలు సాధించారు. ప్రధానంగా భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించారు. గ్రీవెన్స్, తనకు స్వయంగా వచ్చిన భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే వారు. భూముల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం, అడంగల్‌లో తప్పులు దొర్లకుండా క్రమబద్ధీకరించారు. నూతన జేసీగా విజయ.కె జేసీ గంధం చంద్రుడు బదిలీ కావడంతో ఆయన స్థానంలో ప్రస్తుతం రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న కె.విజయను నియమించారు. 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం ప్రసూతి సెలవులో ఉన్నారు. త్వరలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టనున్నారు.