కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకుంటున్న శ్రావణి (ఫైల్)
సాక్షి, అనంతపురం : అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈనెల 11న ‘బాలికే భవిష్యత్’ పేరుతో జిల్లాలో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ నుంచి ప్రశంసలు దక్కాయి. కలెక్టర్ గంధం చంద్రుడు ఆ రోజు జిల్లా కార్యాలయ అధికారులుగా బాలికలకు అవకాశం కల్పించడంపై కేంద్ర మంత్రి స్పందించారు. ఒక రోజు కలెక్టర్‌గా ఇంటర్ విద్యార్థిని ఎం.శ్రావణితో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఒక రోజు అధికారులుగా బాలికలు పనిచేశారు. దీనిపై కేంద్ర మంత్రి ట్విటర్ వేదికగా అభినందించారు. బాలికలకు ఇలాంటి అవకాశాన్ని జిల్లా యంత్రాంగం కల్పించడం స్ఫూర్తిదాయకమని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
16-year old M. Sravani, brave daughter of a farm labourer of Anantapur AP, assumed office of Anantapur Dist. Collector on 11th Oct. for one day.
— Prakash Javadekar (@PrakashJavdekar) October 20, 2020
District Administration had decided to give an opportunity to one girl each as head of all govt. offices in the district.#NewIndia pic.twitter.com/zNCv7pqEzg
Comments
Please login to add a commentAdd a comment