చెప్పుల్లేకుండా.. మండుటెండలో కలెక్టర్‌ మట్టి పని | Gandham Chandrudu Participate In MGNREGA Work | Sakshi
Sakshi News home page

చెప్పుల్లేకుండా.. మండుటెండలో కలెక్టర్‌ మట్టి పని

Published Wed, Mar 24 2021 3:02 PM | Last Updated on Wed, Mar 24 2021 6:46 PM

Gandham Chandrudu Participate In MGNREGA Work - Sakshi

గడ్డపారతో భూమిని తవ్వుతున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు  

సాక్షి, ఆత్మకూరు(అనంతపురం): ఉపాధి కూలీలకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మజ్జిగ పంపిణీకి చర్యలు చేపడతామని కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. మంగళవారం ఆయన ఆత్మకూరు మండలంలోని వడ్డుపల్లి గ్రామం వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ చెప్పులేసుకోకుండా మండుటెండలో గడ్డపార చేతపట్టి మట్టి తవ్వతూ కూలీల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడిన కలెక్టర్‌ రోజు పనులు కల్పిస్తున్నారా..? క్రమం తప్పకుండా డబ్బులు అందుతున్నాయా..? అని కూలీలను ఆరా తీశారు. తాము అడిగిన వెంటనే అధికారులు పనులు కల్పిస్తున్నారని, ఈరోజు(మంగళవారం) రూ.234పైగా కూలి పడిందని కూలీలు తెలపగా.. కలెక్టర్‌కు సంతృప్తి వ్యక్తం చేశారు.

అక్కడే ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రామాంజనేయులును అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పనులు చేసే ప్రాంతాల్లో కోవిడ్‌ నిబంధనలన్నీ పాటించేలా చూడాలన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 2.66 కోట్ల మంది కూలీలకు ఉపాధి హామీ కింద పనులు కల్పించామన్నారు. రోజూ రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వేతనం కూలీలకు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, ఏపీడీ నీలిమారెడ్డి, ఎంపీడీఓ రామాంజనేయులు, ఏపీఓ సుజాత పాల్గొన్నారు.

చదవండి: తాడిపత్రి: వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై వేట కొడవలితో దాడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement