సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో రహదారుల అభివృద్దికి 6400 కోట్లు కేటాయించామని రోడ్లు,భవనాల శాఖా మంత్రి శంకర్ నారాయణ అన్నారు. ఈ మేరకు న్యూ డెవలప్ మెంట్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. రివర్స్ టెండరింగ్ విధానంలో 85కోట్లు ఆదా అయ్యాయని, ఇప్పటికే టెండర్లు ఖరారు చేశామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా రుణం తీసుకున్న 3 వేల కోట్లని పక్కదారి పట్టించింని మండిపడ్డారు. 450 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిందని ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులకి ప్రభుత్వం ఇప్పటికే 550 కోట్లని కేటాయించిందని, నీడా ద్వారా 1158 కోట్లని రోడ్ల అభివృద్ది కోసం సమీకరిస్తున్నామని పేర్కొన్నారు. మొదటి ప్రాధాన్యతగా జిల్లాల నుంచి మొదలుకొని తర్వాత మండలస్ధాయిలో కూడా రోడ్లని అభివృద్ది చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment