సాక్షి, విజయవాడ: రహదారులను అభివృద్ధి చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రహదారుల అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు. 2014లో చంద్రబాబు నాయుడు రూ.3 వేల కోట్లకుపైగా కార్పొరేషన్ ద్వారా అప్పు చేశారని.. ఆ డబ్బును రోడ్ల అభివృద్ధికి ఉపయోగించకుండా ఎన్నికల్లో గెలవడం కోసం, ఇతర కార్యక్రమాలకు దారి మళ్లించారని మండిపడ్డారు. (చదవండి: ‘గత తప్పిదాల వల్లే ఆత్మహత్యలు’)
3వేల కోట్లకు ఏడాదికి 250 కోట్లు వడ్డీ కింద చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరిన్ని నిధులు కేటాయించారని తెలిపారు. 4న కనక దుర్గమ్మ ఫ్లై ఓవర్ తో పాటు 15 వేల కోట్లు పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉందని.. ప్రణబ్ ముఖర్జీ మరణంతో వాయిదా పడిందని తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దుర్గమ్మ, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్లను జాతికి అంకితం చేయడంతో పాటు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment