బీసీలు రాజకీయంగా ఎదగాలి
బడుగు, బలహీన వర్గాలు వారు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ఎదగాలని వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య అన్నారు.
- వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య
నంద్యాల వ్యవసాయం: బడుగు, బలహీన వర్గాలు వారు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ఎదగాలని వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య అన్నారు. బహుజన సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడు మంజుల సుబ్బరాయుడు అధ్యక్షతన గురువారం సాయంత్రం స్థానిక మున్సిపల్ టౌన్ హాల్‌లో బీసీ గర్జన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభా నిష్పత్తి ప్రకారం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
బీసీ, ఎస్సీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జే.లక్ష్మినరసింహయాదవ్ మాట్లాడుతూ.. ఫెడరేషన్‌ల ద్వారా కులవృత్తికి సంబంధించిన సబ్సిడీ రుణాలను అందించాలన్నారు. కార్యక్రమంలో శివరుద్రయ్య, బీసీ కులాల ఐక్యవేదిక అ«ధ్యక్షుడు శేషఫణి, మాల మహానాడు జాతీయ అ«ధ్యక్షుడు శీలం ఓబుళపతి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిడతల వెంకటస్వామి, వాల్మీకి నాయకులు పరమటూరు శేఖర్, అశోక్‌కుమార్, బీసీ జనసభ జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ పాల్గొన్నారు.