సాక్షి, హైదరాబాద్: నాలుగున్నరేళ్ల పాలన కాలంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను ఏనాడు పట్టించుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఓటుకు 500 రూపాయలు ముట్ట చెప్పే పద్దతిని చంద్రబాబు 1996లోనే ప్రవేశ పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు అదే ఓటు ధరను పదివేల రూపాయలకు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల ధరను 20 కోట్ల రూపాయలకు, ఎంపీల ధరను 50 కోట్ల రూపాయలకు చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల రోజుల్లో చంద్రబాబు అపద్ధర్మ ముఖ్యమంత్రి కానున్నారని తెలిపారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ.. కులానికొక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గుర్తొచ్చిందా అని సూటిగా ప్రశ్నించారు. బీసీలను ఓటు బ్యాంక్‌గా తప్ప.. ఉన్నత స్థానాలకు ఎదగనిచ్చారా అని నిలదీశారు. ఇద్దరు బీసీలను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించ రాదని తప్పుడు ఆరోపణలతో లేఖ రాసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని జస్టిస్ ఈశ్వరయ్య ఆధారాలతో సహా బయటపెట్టారని గుర్తుచేశారు.
నాలుగున్నరేళ్ల పాలనలో బిసిల బాగోగుల గురించి ఏనాడూ పట్టించుకుంది లేదు. నెల రోజల్లో అపద్ధర్మ ముఖ్యమంత్రి కానున్నారు. ఇప్పుడు గుర్తుకొచ్చింది కులానికో కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని. మోసాలకూ ఒక హద్దుండాలి చంద్రబాబు గారూ.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 28, 2019
బిసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప ఉన్నత స్థానాలకు ఎదగనిచ్చారా చంద్రబాబు? ఇద్దరు బిసిలను హైకోర్టు జడ్జిలుగా నియమించరాదని తప్పుడు ఆరోపణలతో లేఖ రాసిన విషయం నిజం కాదా? జస్టిస్ ఈశ్వరయ్య ఆధారాలతో సహా బయట పెట్టారు కదా? బతుకంతా నయవంచనే గదా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 28, 2019
దేశంలో ఓటుకు 500 ముట్టచెప్పే పద్థతిని 1996 లోనే చంద్రబాబుగారు ప్రవేశపెట్టారు. ఇప్పడు దానిని పది వేల స్థాయికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలు ధర 20 , ఎంపీలు ధరను 50 కోట్లకు చేర్చారు. రాజకీయ మనుగుడకు ఇంత నీచత్వానికి పాల్పడే వ్యక్తి ఎవరంటే చంద్రబాబునే చూపిస్తారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 28, 2019
Comments
Please login to add a commentAdd a comment