మాజీ ఎంపీ వి.హనుమంతరావు
సాక్షి, హైదరాబాద్: బీసీల ఓట్లకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వల వేస్తున్నాడని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. మంగళవారంనాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ గొర్రెలు, మేకలు, చేపలు అంటూ సీఎం కేసీఆర్ ఓట్ల రాజకీయానికి దిగుతున్నాడని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా మేల్కొనాలని సూచించారు.
బీసీలను సమీకరించి భారీ బహిరంగసభను ఏర్పాటు చేయాలని, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని సభకు ఆహ్వానించాలని కోరారు. బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం బీసీ రిజర్వేషన్లపై న్యాయం జరగదని అన్నారు. దళిత నేత, మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా మంత్రులు కూడా హాజరుకాకపోవడం దారుణమన్నారు. ఇది దళిత జాతిని అవమానించడమేనని వ్యాఖ్యానించారు.