
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో 50 శాతానికిపైగా జనాభా ఉన్న ఓబీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. క్రీమీలేయర్ నిబంధన ఎత్తేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ డ్రాఫ్ట్ కమిటీ సమావేశంలో ఆయన అధిష్టానానికి సూచించారు. ఆదివారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ డ్రాఫ్ట్ కమిటీ సమావేశం జరిగింది.
కమిటీలో సభ్యుడైన పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..క్రీమీలేయర్ నిబంధన ఎత్తేసేలా కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన అధిష్టానానికి సూచించారు. ఏపీ నుంచి కమిటీలో సభ్యుడైన కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలపై సూచనలు చేయాల్సిందిగా కమిటీ సభ్యుల ను మన్మోహన్ సింగ్ కోరినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment