
గన్‌ఫౌండ్రీ: తీన్మార్ మల్లన్నకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని బీసీ కులాల సమన్వయ వేదిక విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జూలూరి మహేష్‌గౌడ్ అన్నారు. సోమవారం నిజాం కళాశాలలో విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ పాలనలో జరుగుతున్న అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తూ సమాజాన్ని చైతన్యం చేస్తున్న మల్లన్నను కొందరు నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారి నుంచి మల్లన్నకు ప్రాణాపాయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట చేస్తున్న ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరుపై ప్రజలకు వివరిస్తున్నందుకే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. సమావేశంలో లక్ష్మీనారాయణ, సందీప్, మల్లేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment