హన్మకొండ : బడ్జెట్‌లో బీసీలకు పెద్దపీట వేయాలని బీసీ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎదునూరి రాజ మొగిలి, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. బీసీ ఉప ప్రణాళిక అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని ఏకశిల పార్కు వద్ద బీసీ సంఘాలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివా రం ఈదీక్షలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ గత రెండు బడ్జెట్‌లలో బీసీలపై ప్రభుత్వం వి వక్ష చూపిందని, రెండు శాతం మాత్రమే కేటాయింపులు చేసిందన్నారు. 2017–2018 బడ్జెట్‌లో బీసీల అభివృద్ధికి పెద్దపీట వేయాలని, ఈ సమావేశాల్లోనే బీసీ ఉప ప్రణాళికని ప్రకటిం చాలని డిమాండ్‌చేశారు.
బీసీలను విస్మరిస్తే రాబోయే ఉద్యమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్ప ష్టం చేశారు. బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షు డు బూర రవి మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్ర ప్ర భుత్వం క్రిమిలేయర్ విధానాన్ని తీసుకురావడం ద్వా రా బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. బీసీల కు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దీక్షలో బీసీ ఉద్యోగుల సంఘం, బీసీ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు గట్టు కోటేశ్వర్, ఎం.చందర్, ఎం.సాంబయ్య, కాశబోయిన రమేష్, బి.శ్రీనివాస్, బి.ఓంకార్, బీసీ సంఘాల నాయకులు తిరునహరి శేషు, కోల జనార్దన్, సాయిని నరేందర్, దిలీప్, ఎ.కుమారస్వామి, ఎ.సాంబయ్య, ఎ.చంద్రనారాయణ, జీఓ.భాస్కర్, సూరం నిరంజన్ కూర్చున్నారు.