
సాక్షి, పశ్చిమగోదావరి : ఏలూరులో ఈ నెల 17న జరిగే ‘బీసీ గర్జన సభ’ను విజయవంతం చేస్తామని వైఎస్సార్‌సీపీ నాయకుడు ముదునూరి ప్రసాద రాజు తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు ఎలాంటి మేలు చేయలేదని విమర్శించారు. గత నాలుగేళ్లలో బాబుకు బీసీలు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు.
ఇన్నాళ్లు బీసీలను పట్టించుకోని చంద్రబాబు.. ఎన్నికల ముందు ‘బీసీ కులాలకు పనిముట్లం’టూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మోసపూరిత హామీలను బీసీలు నమ్మే స్థితిలో లేరని ఆయన తెలిపారు. దివంగత వైఎస్సార్ హాయంలోనే బీసీలకు న్యాయం జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రసాద రాజు ఆశాభావం వ్యక్తం చేశారు