
మాట్లాడుతున్న నారాయణ
హుజూరాబాద్‌రూరల్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీల అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదని ఎర్రబొజ్జు నారాయణ అన్నారు. ఆదివారం పట్టణంలోని బృందావన్ సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ గత బడ్జెట్‌లో బీసీ సబ్‌ప్లాన్ ప్రకటించిన ప్రభుత్వం.. ప్రస్తుతం నిధులు కేటాయించకుండా మాట తప్పిందన్నారు. రూ. వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పి.. ఇప్పటికీ రూపాయి కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలు గమనిస్తున్నారని.. రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ తిరుణహరి శేషు, జిల్లా సెక్రెటరీ జె.కె. ప్రభాకర్, జేఏసీ మండల అధ్యక్షుడు సబ్బని తిరుపతి, ఉపాధ్యక్షుడు సాధుల లక్ష్మీనారాయణ, మహిళ సభ్యులు పాల్గొన్నారు.