బీసీ లకు కార్పొరేషన్ రుణాలు అందాలి
జిల్లాలో అర్హులైన బీసీలందరికీ బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కోరారు.
ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు(అర్బన్):
జిల్లాలో అర్హులైన బీసీలందరికీ బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కోరారు. గురువారం ఆమె తన నివాసంలో బీసీ కార్పొరేషన్ ఈడీ కె.లాలాలజపతిరావుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు బీసీ కార్పొరేషన్ ద్వారా అందించిన రుణాలు, బీసీల ఆర్థిక స్థితిగతులపై ఆరా తీశారు. ఏయే పథకాలకు కార్పొరేషన్ రుణాలను అందిస్తున్నదని ప్రశ్నించారు. వివిధ బ్యాంకుల ఆర్థిక సహకారం, కార్పొరేషన్ సబ్సిడీతో బ్యాంకు లింకేజీ పథకాలను అమలు చేస్తున్నట్లు ఈడీ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 1500 మంది బీసీ లబ్ధిదారులకు దాదాపు రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఖర్చు చేయడం జరుగుతున్నదని ఈడీ చెప్పారు. జిల్లాలో అధికంగా బీసీల జనాభా ఉన్న కారణంగా ఇంకా ఎక్కువ మందికి రుణాలను అందించేందుకు చర్యలు చేపట్టాలని ఎంపీ కోరారు.