
ఫైల్‌ఫోటో
సాక్షి, అమరావతి: చంద్రబాబు బీసీల ద్రోహి అని బీసీ నేత, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. సీఎం జగన్ బీసీలను అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఈ దేశంలో ఎవ్వరూ సీఎం జగన్‌లా బీసీలకు మేలు చేయలేదని.. 47 ఏళ్లలో బీసీలను ఇంతలా ప్రోత్సహించే సీఎంను చూడలేదని ఆయన అన్నారు.
చదవండి: నా శవాన్ని ముందుబెట్టి.. చంద్రబాబు ఓట్లు అడుక్కుంటాడేమో!
‘‘బీసీల హక్కుల కోసం రాజ్యసభలో పోరాడాలని నాకు అవకాశం ఇచ్చారు. చంద్రబాబుకి బీసీల ఓట్లు కావాలి.. కానీ వాళ్లు ఎదిగితే ఓర్వలేరు. చంద్రబాబు ఏనాడైనా బీసీలకు ఇన్ని మంత్రి పదవులు, రాజ్యసభ సీట్లు ఇచ్చారా?. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని ఎన్ని సార్లు అడిగినా బాబు స్పందించలేదు. బీసీలంతా ఎప్పటికీ సీఎం జగన్ వెంటే ఉంటారని ఆర్ కృష్ణయ్య అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment