సాక్షి, హైదరాబాద్: తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య శనివారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీతో పాటు డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు ఇచ్చారని, ఈటల రాజేందర్ ఓటమికి ప్రయత్నించారని ఆగంతకులు ఫోన్లు చేస్తున్నట్లు కృష్ణయ్య తెలిపారు. తన ఫోన్ నెంబర్‌ను ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియాలో పెట్టి ఆగంతకులు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రెండ్రోజుల నుంచి వెయ్యికి పైగా ఫోన్లు వచ్చాయని, దీని వెనుక ఎవరున్నారో గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీని కోరినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. తనపై ఇలాంటి దుష్ప్రచారం చేయడం బాధిస్తోందని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనను ఇటీవల అభినందించిన వ్యవహారాన్ని గుర్తుచేసి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. హోంమంత్రి, డీజీపీ నుంచి న్యాయం చేస్తామన్న హామీ లభించిందని కృష్ణయ్య తెలిపారు.
(చదవండి: TSRTC: బస్సు చార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్)
Comments
Please login to add a commentAdd a comment