హాస్టల్‌ విద్యార్థుల మెస్‌చార్జీలు పెంచాలి  | BC Body Stages Protest For Hike In Mess Charges: R Krishnaiah | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ విద్యార్థుల మెస్‌చార్జీలు పెంచాలి 

Published Mon, Dec 20 2021 2:25 AM | Last Updated on Mon, Dec 20 2021 2:25 AM

BC Body Stages Protest For Hike In Mess Charges: R Krishnaiah - Sakshi

కవాడిగూడ: రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల మెస్‌చార్జీలను రూ.1,500 నుంచి రూ.3 వేలకు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మెస్‌చార్జీలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ధర్నాచౌక్‌లో వందలాది మంది విద్యార్థులు మహాధర్నా నిర్వహిం చారు. కృష్ణయ్య మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం ఉన్న ధరలకు అనుగుణంగా కాకుండా, పెరిగిన ధరల మేరకు మెస్‌చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచు తున్న ప్రభుత్వం రేపటిపౌరులపట్ల ఎందుకింత నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. రూ.3,500 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాల న్నారు. కార్యక్రమంలో సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేశ్, విద్యార్థి సంఘం రాష్ట్ర అ«ధ్య క్షుడు జిల్లెపల్లి అంజి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సతీశ్, మల్లేష్‌ యాదవ్, చంటి ముదిరాజ్, జి.కృష్ణయాదవ్,అనంతయ్య, భాస్కర్‌ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement