
వనస్థలిపురం (హైదరాబాద్): అన్ని వర్గాలకు సమ న్యాయం, బీసీలకు 50 శాతానికి పైగా పద వులు, పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టిన ఘనత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభసభ్యుడు ఆర్.కృష్ణ య్య అన్నారు. శుక్రవారం వనస్థలిపురం సుభద్రానగర్‌లో శక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ దుర్గామాత పూజలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏళ్లవుతున్నా బీసీల్లో ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదన్నారు. బీసీ కార్పొరేషన్‌ను పూర్తిగా నిరీ్వర్యం చేశారని, దానికి ఎండీ గానీ, సిబ్బంది గానీ లేరన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్‌కు నిధులు ఇస్తా మని చెప్పినా తెలంగాణ ప్రభుత్వం ష్యూరిటీ ఇవ్వడం లేదని ఆరోపించారు.
చదవండి: కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా: దరఖాస్తు ఎలా చేసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో