
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ ఆర్.కృష్ణయ్య
కీసర: రాజ్యాధికారం కోసం బీసీలు పోరుబాట పట్టాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. కీసర మండలంలోని రాంపల్లి పూలపల్లి బాలయ్య ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం జరిగిన కురుమల రాష్ట్ర స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ ఉమతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
అప్పుడే రాజకీయాల్లో బీసీలకు ప్రాముఖ్యత పెరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యం నేడు ధనస్వామ్యంగా మారిందని, ఎన్నికల్లో ధనమే కీలకమైందని తెలిపారు. బీసీలు విద్యావంతులు కావాలంటే.. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. కార్యక్రమంలో కురుమ యువజన నాయకుడు శ్రీకాంత్, ఆలేరు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బీర్ల అయిలయ్య, కార్పొరేటర్ కృష్ణ పాల్గొన్నారు.