సాక్షి, హైదరాబాద్: జనాభాలో సగానికిపైగా ఉన్న వెనుకబడిన తరగతుల కోసం కేంద్రంలో ప్రత్యేక శాఖ లేకపోవడం బాధాకరమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రస్తుతమున్న సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వ శాఖ బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, బీసీలకు సంబంధించిన అనుకూల సిఫార్సులను అమలు చేయకుండా తాత్సారం చేస్తోందని ఆరోపించారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడంలో తీవ్ర అన్యాయం చేసిందని, ప్రత్యేక శాఖ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి పాలన సాగించాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment