Ministry allocation
-
ఏపీ మంత్రుల శాఖలపై ఇదేం సస్పెన్స్?
అమరావతి, సాక్షి: మంత్రులుగా ప్రమాణం చేసి 48 గంటలు ముగిసింది. అయినా కూడా ఇంకా శాఖలు కేటాయించలేదు. అసలు ఎవరికి ఏ శాఖ దక్కుతుందో అని మూడు పార్టీల శ్రేణులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. ఇంతకీ ఏపీ కేబినెట్ కూర్పుపై సీఎం చంద్రబాబు కసరత్తులు పూర్తి చేశారా? లేదంటే తర్జన భర్జనలు పడుతున్నారా?.. ఇంకా ఏమైనా చర్చలు జరగాల్సి ఉందా?. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిత్వ శాఖల కేటాయింపుపై ఇవాళ సాయంత్రంలోపు ఒక స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. నిన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక మంత్రుల శాఖల జాబితా వెలువడుతుందని అంతా ఎదురు చూశారు. కానీ, అది జరగలేదు. మరోవైపు కీలక శాఖలు మా నేతలకంటే మా నేతలకే దక్కుతాయంటూ ధీమాగా ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రధానంగా పవన్‌తో పాటు నారా లోకేష్‌కు, అలాగే టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి ఏ శాఖ దక్కుతుంది అనేదానిపై ఉత్కంఠ నడుస్తోంది.ఏపీలో మొత్తం 25 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అయితే.. టీడీపీ నుంచి 20, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక్కరు.. మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో.. హోం, ఆర్థిక లాంటి కీలక శాఖలను చంద్రబాబు టీడీపీ దగ్గరే ఉంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధాన మిత్రపక్షంగా జనసేనకు డిప్యూటీ సీఎంతో పాటు ఏవైనా మూడు ముఖ్య శాఖల్ని కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ తరఫున ఏకైక మంత్రి సత్యకుమార్‌కు దేవాలయ, ధర్మాదాయ ఇవ్వొచ్చనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.మంత్రలు శాఖల కేటాయింపు సస్పెన్స్‌కు నేడు తెర పడే అవకాశాలున్నాయి. ఇవాళ మధ్యాహ్నాం తర్వాత సీఎం చంద్రబాబు సచివాలయానికి వెళ్లనున్నారు. మంత్రుల జాబితాపై మరోసారి పునఃసమీక్ష జరిపి ఈ సాయంత్రం లేదంటే అర్ధరాత్రి పూర్తి జాబితాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కొనసాగుతున్న లీక్స్.. ఏపీలో ఎవరికి ఏ శాఖ అంటే..?
విజయవాడ, సాక్షి: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు కోసం కసరత్తులు ముగిశాయా? లేదంటే ఇంకా చర్చించాల్సి ఉందా? అసలు కూటమి పార్టీలు ఏ శాఖల కోసం పట్టుబట్టాయి? కీలక శాఖలను టీడీపీనే దక్కించుకోబోతోందా? త్యాగాల జనసేన శాఖల విషయంలో పంతం నెగ్గించుకుంటుందా? ఫలానా వాళ్లకు ఫలానా మంత్రిత్వ శాఖ అని లీకులు ఇస్తోంది ఎవరు?.. ఏపీలో కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారనేదానిపై ఈ సాయంత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సచివాలయంలో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించాక.. ఈ ప్రకటన ఉండనున్నట్లు అధికారిక సమాచారం. మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేశారని చెబుతున్నప్పటికీ.. మరోసారి పునఃసమీక్షిస్తారా? అనే చర్చా మొదలైంది.గురువారం ఆయన తిరుపతి, ఎన్టీఆర్ జిల్లాల పర్యటనలు ముగించుకున్నాక అమరావతికి తిరిగి రానున్నారు. సాయంత్రం సచివాలయం వెళ్లి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల ఫైల్స్పైనా సంతకాలు చేస్తారని ఇప్పటికే సమాచారం అందింది. అయితే.. ఆ తర్వాతే ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారట. ఈ క్రమంలో గత రెండు రోజులుగా శాఖల కేటాయింపులపై లీకులు అందుతున్నాయి. ఇటు టీడీపీ శ్రేణులు.. అటు జనసేన.. ఇంకోవైపు ఎల్లో మీడియా సంస్థలు.. మంత్రిత్వ శాఖలపై గత రెండురోజులుగా వరుసబెట్టి కథనాలు ఇస్తున్నాయి. అందులో మొదటిది పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అవుతారని. అయితే నిన్న మంత్రిగానే పవన్ కల్యాణ్ ప్రమాణం చేసినప్పటికీ.. అధికారికంగా డిప్యూటీ సీఎం అని ఎక్కడా ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఆయన సోదరుడు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఉప ముఖ్యమంత్రి అనే లీక్ ఇచ్చేశారు. ఇక.. జనసేనకు మూడూ కీలక శాఖలే ఉంటాయని టీడీపీ అనుకూల ప్రధాన మీడియా కథనం ఇచ్చింది. అందులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు పేర్కొంది. అయితే.. పవన్ హోం శాఖ కోసం కూడా పట్టుబడుతున్నారంటూ జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి. మరోవైపు నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు లీకులు అందుతున్నాయి. ఇక టీడీపీ శ్రేణులేమో.. ఐటీ శాఖ మరోసారి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ బాబుకే వెళ్లొచ్చని చెబుతున్నాయి. గతంలో.. 2014 టైంలో ఎమ్మెల్సీగా నారా లోకేష్ ఈ శాఖను చేపట్టారు. అయితే టీడీపీలోనే మరో వర్గం లోకేష్‌కు ఈసారి ఇంకా ప్రాధాన్యం ఎక్కువ ఉన్న మంత్రిత్వ శాఖ దక్కుతుందని చెప్పుకుంటోంది. సీఎం చంద్రబాబు బాధ్యతను స్వీకరించిన తర్వాత రాత్రికి అధికారిక ప్రకటన. ఇలా ఏ వర్గానికి ఆ వర్గం ఫలానా మంత్రిత్వ శాఖ దక్కుతుందనే ప్రచారంలో ఉంటే.. మరో మిత్రపక్షం బీజేపీ మాత్రం ఒక్క మంత్రి పదవి పోస్ట్ మీద ఎలాంటి వ్యాఖ్యా చేయకపోవడం గమనార్హం. -
సీఎం సిద్ధరామయ్యకు ఆర్థికం
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన మంత్రివర్గంలోని మంత్రులకు శాఖలను కేటాయించారు. కీలకమైన ఆర్థిక శాఖను తనవద్దే ఉంచుకుని, ముఖ్యమైన నీటిపారుదల, బెంగళూరు సిటీ డెవలప్మెంట్ విభాగాలను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కేటాయించారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతోపాటు 8మంది మంత్రులు ఈ నెల 20న ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. శనివారం కొత్తగా 24 మందిని మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. వీరిలో గతంలో హోం శాఖను నిర్వహించిన జి.పరమేశ్వరకు తిరిగి అదే శాఖను కట్టబెట్టారు. భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖను ఎంబీ పాటిల్‌కు, కేజే జార్జికి విద్యుత్ శాఖను కేటాయిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్థిక శాఖతోపాటు కేబినెట్ వ్యవహారాలు, పరిపాలన సిబ్బంది వ్యవహారాలు, ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్, ఐటీ తదితర ఇతరులకు ఇవ్వని శాఖలు సీఎం సిద్ధరామయ్య వద్దే ఉన్నాయి. శివకుమార్‌కు భారీ, మధ్యతరహా నీటి వనరులు, బెంగళూరు సిటీ డెవలప్మెంట్ శాఖలను ఇచ్చారు. హెచ్‌కే పాటిల్‌కు న్యాయం, పార్లమెంటరీ వ్యవహారాలు, లెజిస్లేషన్, పర్యాటక శాఖలు, కేహెచ్ మునియప్పకు ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలను కేటాయించారు. రామలింగారెడ్డికి రవాణా, ముజ్రాయ్ శాఖలను ఇచ్చారు. హెచ్‌సీ మహదేవప్పకు సాంఘిక సంక్షేమం, సతీశ్ జర్కిహోళికి పబ్లిక్ వర్క్స్ శాఖలను అప్పగించారు. శివానంద పాటిల్‌కు టెక్స్టైల్స్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ బాధ్యతలు కేటాయించారు. దినేశ్ గుండూరావుకు ఆరోగ్యం, కుటుంబసంక్షేమం, రెవెన్యూ శాఖను కృష్ణ బైరెగౌడకు, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గేకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖను ఇచ్చారు. ఏకైక మహిళా మంత్రి లక్ష్మి ఆర్ హెబ్బాల్కర్కు మహిళ, శిశు అభివృద్ధి, సీనియర్ సిటిజన్ సాధికారిత శాఖ ఇచ్చారు. -
రేపే కేంద్ర కేబినెట్ విస్తరణ.. 5 రాష్ట్రాలకు ప్రాధాన్యం?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తు కొనసాగుతుంది. జూలై 7న(బుధవారం) కేంద్ర కేబినెట్ పునర్వవ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. రేపు సా.5:30 నుంచి 6 గంటల మధ్య కేబినెట్ విస్తరణ జరుగనుంది. తొలుత జూలై 7వ తేదీన కేబినెట్ పునర్వీవ్యవస్థీకరణ జరుగనున్నట్లు వార్తలు వచ్చినా, ఆ తర్వాత జూలై 8వ తేదీన కేబినెట్ విస్తరణ జరపాలని నిర్ణయించారు. కాగా, మళ్లీ ముందు అనుకున్న తేదీ ప్రకారం జూలై 7వ తేదీనే కేబినెట్ పునర్వవ్యవస్థీకరణకు మొగ్గు చూపారు. ఈ కేబినెట్లో 20 మందికి పైగా కొత్తవారికి అవకాశం దక్కనుంది. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. మంత్రుల పనితీరు ఆధారంగా శాఖల మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర కేబినెట్లో మొత్తం 81 మంది మంత్రులకు అవకాశం ఉండగా.. ప్రస్తుతం 53 మందితోనే మంత్రివర్గం కార్యకలాపాలు కొనసాగిస్తుంది. మిగిలిన 28 స్థానాలను మరో రెండు రోజుల్లో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ముఖ్యనేతలతో భేటీ అయినట్లు తెలిసింది. కేబినెట్ విస్తరణ గురించి ఈ భేటీలో చర్చించనున్నారని మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఆశావాహుల జాబితాలో సీనియర్ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా, అసోం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, జేడీయూ నాయకులు ఆర్సీపీ సింగ్, లల్లన్ సింగ్ (బిహార్), అప్నా దళ్ నేత అనుప్రియ పాటిల్, పంకజ్ చౌదరి(యూపీ), కైలశ్ విజయవర్గీయ (మధ్యప్రదేశ్), నారాయణ రాణే (మహారాష్ట్ర), రీటా బహుగుణ జోషి, రామశంకర్ కథేరియా (యూపీ), పశుపతి పారస్, రాహుల్ కశ్వన్, చంద్రప్రకాశ్ జోషి (రాజస్థాన్) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో కొందరు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. -
ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: జనాభాలో సగానికిపైగా ఉన్న వెనుకబడిన తరగతుల కోసం కేంద్రంలో ప్రత్యేక శాఖ లేకపోవడం బాధాకరమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రస్తుతమున్న సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వ శాఖ బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, బీసీలకు సంబంధించిన అనుకూల సిఫార్సులను అమలు చేయకుండా తాత్సారం చేస్తోందని ఆరోపించారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడంలో తీవ్ర అన్యాయం చేసిందని, ప్రత్యేక శాఖ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి పాలన సాగించాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. -
సేనకు హోం, ఎన్సీపీకి ఆర్థికం
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల శాఖలు ఖరారయ్యాయి. కీలక హోం మంత్రిత్వ శాఖను శివసేన తన వద్ద అంటిపెట్టుకుంది. శివసేనకు చెందిన మంత్రి ఏక్నాథ్ షిండేకు హోంతో పాటు పట్టణాభివృద్ధి, పర్యావరణం, పర్యాటక, పార్లమెంటరీ వ్యవహారాలు శాఖలు, మరో శివసేన మంత్రి సుభాష్ దేశాయ్‌కి పరిశ్రమలు, ఉన్నత, సాంకేతిక విద్య, యువజన వ్యవహారాల శాఖలు అప్పగించారు. ఎన్సీపీ మంత్రి జయంత్ పాటిల్‌కు ఆర్థిక శాఖను, గృహనిర్మాణం, మరికొన్ని శాఖల బాధ్యతలు అప్పగించారు. మరో ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజ్భల్కు నీటి పారుదల, గ్రామీణాభివృద్ది శాఖలు కేటాయించారు. కాంగ్రెస్ మంత్రి బాలాసాహెబ్ తోరట్‌కు రెవెన్యూ, విద్యుత్, తదితర శాఖలు ఇచ్చారు. మరో కాంగ్రెస్ మంత్రి నితిన్ రౌత్‌కు పీడబ్ల్యూడీ, గిరిజనాభివృద్ధి శాఖలు అప్పగించారు. కాగా. గురువారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ 79వ పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆయన నివాసంలో పూలగుచ్ఛం అందజేశారు. -
ఫిరాయింపు నేతల్లో ముగ్గురికి మంత్రి పదవులు
పనాజీ: కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం లభించనుంది. వారితో పాటు డిప్యూటీ స్పీకర్ మైఖేల్ లోబోను మంత్రివర్గంలో చేర్చుకోనున్నట్టు అధికార బీజేపీ నాయకుడొకరు తెలిపారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ) మంత్రులు ముగ్గురినీ తొలగించనున్నట్టు స్పష్టం చేశారు. గోవాలో ప్రమోద్ సావంత్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి జీఎఫ్‌పీ మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ సరదేశి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. గోవా శాసన సభలోని 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పది మంది గత బుధవారం బీజేపీలో చేరారు. వారితో కలిసి లోబో శుక్రవారం ఢిల్లీలో అమిత్‌షాను కలిసి వచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో 40 మంది సభ్యులున్న శాసన సభలో బీజేపీ బలం 27కు పెరిగింది. ఇదిలా ఉండగా, తమ మంత్రివర్గంలోని జీఎఫ్‌పీకి చెందిన ముగ్గురు మంత్రులను రాజీనామా చేయాలని కోరినట్టు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. అలాగే, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల రోహన్ కాంటేను కూడా మంత్రి పదవికి రాజీనామా చేయాలని అడిగినట్టు చెప్పారు.మంత్రి వర్గంలోకి కొత్తగా నలుగురిని తీసుకుంటున్నందున వీరి రాజీనామాలను కోరినట్టు శుక్రవారం ఆయన తెలిపారు.అధిష్టానం చెప్పిన మేరకే తానీ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. -
సీఎం పీఠం కన్నా ఆత్మగౌరవమే ముఖ్యం: కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటకలో మంత్రిత్వ శాఖల కేటాయింపు విషయంలో కాంగ్రెస్‌తో భేదాభిప్రాయాలున్నాయని సీఎం కుమారస్వామి చెప్పారు. ఇవి ప్రభుత్వాన్ని పడగొట్టేంత పెద్దవేమీ కాదన్నారు. ఆత్మగౌరవాన్ని వదులుకుని సీఎం పీఠానికి అతుక్కుపోవాలనుకోవటం లేదన్నారు. ‘శాఖల కేటాయింపు జరగలేదు. ఈ విషయంలో కాంగ్రెస్‌తో సమస్యలున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అధిష్టానం నుంచి ఆమోదం లభించాక∙కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఏ సమస్యను ప్రతిష్టాత్మకంగా తీసుకోను. ప్రతిదాన్నీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. ఆత్మగౌరవాన్ని వదులుకుని సీఎం పీఠానికి అతుక్కుపోను’ అన్నారు. కాంగ్రెస్‌తో చర్చించాకే రుణమాఫీ ‘దురుద్దేశపూర్వకంగానే యడ్యూరప్ప రాష్ట్రవ్యాప్త బంద్‌కు (సోమవారం) పిలుపునిచ్చారు. ఇచ్చిన మాటపై వెనక్కు తగ్గను. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ నేతలతో చర్చించాను. వారి నిర్ణయాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని స్వామి తెలిపారు. కేంద్రంలో నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకున్న ఎన్డీయే ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తానన్నారు. ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చించేందుకు డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్య, సీనియర్ నేత డీకే శివకుమార్సహా పలువురు కర్ణాటక కాంగ్రెస్ నేతలు ప్రత్యేక విమానంలో శనివారం ఢిల్లీకి వెళ్లారు. ‘అన్ని చర్చలు ఢిల్లీలోనే జరుగుతాయి ఎవరికి ప్రాధాన్యతనివ్వాలి, ఎవరిని పరిగణనలోకి తీసుకోవాలి వంటి నిర్ణయాలను అధిష్టానమే తీసుకుంటుంది’ అని పరమేశ్వర తెలిపారు. అంతకుముందు వీరంతా బెంగళూరులోని ఓ హోటల్లో చర్చలు జరిపారు. కన్నడ ప్రభుత్వ పాలన కోసం కనీస ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన సమన్వయ కమిటీ ఏర్పాటుపైనా అధిష్టానంతో చర్చించనున్నారని సమాచారం. కాంగ్రెస్ జాబితా ఖరారు డీకే శివకుమార్ సహా 16 మందికి చోటు సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటక ప్రభుత్వంలో కాంగ్రెస్ కోటాలో ఉన్న మంత్రిత్వ శాఖలకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ జాబితాలో మాజీ మంత్రులు డీకే శివకుమార్, మాజీ హోం మంత్రి రామలింగారెడ్డి, ప్రియాంక్ ఖర్గేసహా 16 మంది పేర్లున్నాయి. ఢిల్లీలోని 12 తుగ్లక్ రోడ్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌తో కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్య, సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేలు శనివారం సమావేశమై ఈ జాబితాను ఖరారు చేశారు. కీలక శాఖలను జేడీఎస్‌కు ఇవ్వద్దని కర్ణాటక కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. అటు, మే 28న (సోమవారం) జరగాల్సిన ఆర్ఆర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక విషయంలోనూ సంకీర్ణ పక్షాలు ఓ నిర్ణయానికి రాలేకపోయాయి. కాంగ్రెస్‌తో పొత్తు అంతవరకే: దేవెగౌడ కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మాత్రమే కాంగ్రెస్‌తో పొత్తు కుదిరిందని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ స్పష్టం చేశారు. శనివారం రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తమ ప్రత్యర్థి అని దేవెగౌడ పేర్కొన్నారు. జేడీఎస్ అభ్యర్థి రామచంద్రప్ప బరి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదన్నారు. నకిలీ ఓటరు కార్డులు బయటపడడంతో ఈ నియోజకవర్గ ఎన్నిక ఈ నెల 28కి వాయిదా పడింది. -
అయ్యో పాపం దత్తన్న..
తెలంగాణ ప్రాంతంలో బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న బండారు దత్తాత్రేయకు ప్రధాని నరేంద్రమోడీ షాకిచ్చారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవంతో మంత్రి పదవి గ్యారంటి అనే గంపెడాశతో ఢిల్లీ ఫ్లైయిట్ ఎక్కిన దత్తనకు నిరాశే మిగిలింది. తనకు కేంద్రమంత్రి పదవి దక్కపోవడంపై బీజేపీ సీనియర్ నేతల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ లోకసభ నుంచి భారీ మెజార్టీతో ఎంపికైన దత్తాత్రేయ మంత్రి పదవి దక్కుతుందని లష్కర్ నేతలు కూడా ఎదురు చూశారు. సికింద్రాబాద్ లోకసభ టికెట్ ను దత్తన్నకు కేటాయింపు వ్యవహారంపై కూడా పెద్ద రచ్చ జరిగింది. సికింద్రాబాద్ లోకసభ నుంచి పోటీ చేయాలని బీజేపీ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే దత్తన్న తన పలుకుబడితో టికెట్ దక్కించకున్నా.. మంత్రి పదవిని చేజిక్కించుకోలేకపోయారనే వాదన రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అయితే లోకసభ మొదటి సమావేశాల తర్వాత జరగబోయే విస్తరణలో మంత్రి పదవి దక్కుంతుందని దేశ రాజధానిలో సీనియర్ బీజేపీ నేతలు భరోసా ఇచ్చారట. ఏది ఏమైనా శాఖ కేటాయించకుండా షాక్ ఇవ్వడంపై దత్తన్న వర్గం గుస్సాగా ఉందంట.