సుందరయ్యవిజ్ఞానకేంద్రం (హైదరాబాద్): పెరిగిన ధరల మేరకు విద్యార్థులకు ఇచ్చే ఉప కారవేతనాలను కూడా పెంచాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు రెండేళ్లుగా బకాయి ఉన్న రూ.3,500 కోట్ల ఫీజులను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలో 16 బీసీ సంఘాలతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థుల ఫీజు రియింబర్స్‌మెంట్ రూ.1,800 నుంచి రూ. 5,000కు, కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1,500 నుంచి 1,800కు, పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1,100 నుంచి రూ.2,000లకు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీబంధు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. జూనియర్ అడ్వొకేట్లకు స్టైపెండ్‌ను రూ.10 వేలకు పెంచాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment