బీజేపీలో చేరటం లేదు: కృష్ణయ్య | Krishnaiah says iam not join for BJP | Sakshi

బీజేపీలో చేరటం లేదు: కృష్ణయ్య

Published Tue, May 30 2017 7:47 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీలో చేరటం లేదు: కృష్ణయ్య - Sakshi

బీజేపీలో చేరటం లేదు: కృష్ణయ్య

బీజేపీలో చేరడం లేదన్న బీసీ నేత ఆర్‌ కృష్ణయ్య..

పెద్దపల్లి: బీజేపీలో చేరుతున్నట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరేది లేదని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌. కృష్ణయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో  విలేకరులతో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు తనను కలిసింది వాస్తవమేనన్నారు. అయితే తాను మాత్రం బీజేపీలో చేరడం లేదన్నారు.
 
డీఎస్సీ నోటిఫికేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా పూటకో మాట చెబుతూ పబ్బం గడుపుతూ వచ్చిందన్నారు. మొదట 40వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు 8,972పోస్టులకు తగ్గించిందన్నారు. ఇకనైనా తక్షణమే నోటిఫికేషన్‌ను విడుదల చేసి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 11 బీసీ ఫెడరేషన్లకు తక్షణం రూ. 200 కోట్ల చొప్పున కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టేలా  ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. దేశవ్యాప్తంగా 36 రాజకీయ పార్టీలు కలిసి బీసీలకు మద్దతు కూడగట్టామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement