ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు.. అప్‌డేట్స్‌ | Republic Day 2024 Nation Wide Celebrations Live Updates, Latest News And Highlights In Telugu - Sakshi
Sakshi News home page

Republic Day: ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు.. అప్‌డేట్స్‌

Published Fri, Jan 26 2024 7:17 AM | Last Updated on Fri, Jan 26 2024 1:28 PM

Republic Day 2024 Nation Wide Celebrations Live Updates - Sakshi

ముగిసిన రిపబ్లిక్‌ డే వేడుకలు

  • కర్తవ్యపథ్‌లో ముగిసిన 75వ రిపబ్లిక్‌ డే వేడుకలు 
  • వేడకులకు హాజరైన వారికి ప్రధాని మోదీ ప్రత్యేక అభివాదం
  • వేడుకలు ముగియడంతో వెళ్లిపోయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌

ఢిల్లీ గగనతలంలో దూసుకెళ్లిన రాఫెల్‌ ఫైటర్‌ జెట్లు 

  • రిపబ్లిక్‌ వేడుకల సందర్భంగా ఢిల్లీ గగనతలంలో దూసుకెళ్లిన రాఫెల్‌ యుద్ధ విమానాలు 
  • పరేడ్‌లో మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించిన ఫ్రెంచ్‌ కంటింజెంట్‌ 
  • వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్‌ అధ్యకక్షుడు మాక్రాన్‌

చంద్రయాన్‌ శివశక్తి పాయింట్‌ శకటానికి విశేష స్పందన 

  • చంద్రయాన్‌ శివశక్తి పాయింట్‌ శకటాన్ని ప్రదర్శించిన ఇస్రో
  • శకటానికి వీక్షకుల నుంచి విశేష స్పందన 

విశేషంగా ఆకట్టుకున్న ఏపీ,తెలంగాణ శకటాలు

  • రిపబ్లిక్‌ డే వేడుకల్లో ఆకట్టుకున్న ఏపీ, తెలంగాణ శకటాలు 
  • డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ శకటాన్ని ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్‌ 
  • డెమొక్రసీ ఎట్‌ గ్రాస్‌ రూట్‌ లెవెల్స్‌ శకటాన్ని ప్రదర్శించిన తెలంగాణ

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన త్రివిధ దళాల మహిళా కంటింజెంట్‌ మార్చ్‌ఫాస్ట్‌  

  • రిపబ్లిక్‌ డే వేడుకల్లో త్రివిధ దళాల మహిళా కంటింజెంట్‌ మార్చ్‌ఫాస్ట్‌
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మార్చ్‌ ఫాస్ట్‌ 
  • లేచి నిలబడి అభినందనలు తెలిపిన వీక్షకులు

ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన 

  • రిపబ్లిక్‌ డే వేడుకల్లో ఆకట్టుకుంటున్న శకటాల ప్రదర్శన
  • ఆసక్తిగా తిలకించిన రాష్ట్రపతి ముర్ము, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌, ప్రధాని మోదీ 

పరేడ్‌ తిలకిస్తున్న రాష్ట్రపతి ముర్ము, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌

  • కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్‌ డే పరేడ్‌ తిలకిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ముర్ము
  • వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌, కేంద్ర మంత్రులు
  • ఉత్సాహంగా సాగిన మార్చ్‌ఫాస్ట్‌ 

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

  • రిపబ్లిక్‌ డే వేడుకల్లో భాగంగా కర్తవ్యపథ్‌లో జాతీయ జెండా ఎగురవేసిన రాష్ట్రపతి ముర్ము
  • వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌
  • వేడుకల్లో పాల్గొన్న పాల్గొన్న ‍ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు

సైనికుల గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌ 

  • కర్తవ్యపథ్‌లో ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు 
  • సైనికుల గౌరవ వందనం స్వీకరిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,
  • ఆయుధ ప్రదర్శనను తిలకిస్తున్న ముఖ్య అతిథి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌

కర్తవ్యపథ్‌కు రాష్ట్రపతి ముర్ము, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌

  • గుర్రపు బగ్గీపై కర్తవ్యపథ్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్య అతిథి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌
  • స్వాగతం పలికిన ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

అమరజవాన్లకు నివాళుర్పించిన ప్రధాని 

  • వార్‌ మెమోరియల్‌ వద్ద అమరజవాన్లకు ప్రధాని నివాళులు 
  • అమర జవాన్ల స్థూపం వద్ద నివాళులర్పించి వేడుకలకు హాజరు
  • ప్రధాని వెంట రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 
  • అనంతరం కర్తవ్య్‌పథ్‌కు చేరుకుని అభివాదం

రిపబ్లిక్‌ డే వేడుకలు.. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్‌ 

  • ఢిల్లీ కర్తవ్యపథ్‌లో ఉదయం 10.30 గంటలకు రిపబ్లిక్‌ డే వేడుకలు ప్రారంభమవనున్నాయి. 
  • ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ పాల్గొంటారు. 
  • వేడుకలు జరిగే కర్తవ్యపథ్‌పై మిగ్‌-17 హెలికాప్టర్లు పూల వర్షం కురిపించనున్నాయి.
  • ప్రధాని, రాష్ట్రపతితో కలిసి మార్కన్‌ రిపబ్లిక్‌ డే పరేడ్‌ను తిలకించనున్నారు. 
  • రిపబ్లిక్‌ డే వేడుకల్లో భాగంగా సైన్యానికి చెందిన పలువురికి గ్యాలంట్రీ అవార్డులు అందిస్తారు.
  • రిపబ్లిక్‌ డే వేడుకలకు 8 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement