france tour
-
భారత ప్రధానికి ఫ్రాన్స్ అధ్యక్షుడి అపురూప కానుక..
పారిస్: భారత ప్రధాని పర్యటనను గుర్తు చేసుకుంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తన ట్విట్టర్ అకౌంట్లో ఒక వీడియోని పోస్ట్ చేశారు. అందులో ప్రధాని నరేంద్ర మోడీతో గడిపిన క్షణాలను పొందుపరచి ఇది భారతీయ ప్రజలకు, వారి నమ్మకానికి, స్నేహానికి అని రాశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ బాస్టిల్ డే ఉత్సవాలకు అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. రెండ్రోజుల పాటు అజరిగిన ప్రధాని పర్యటనలో అపురూప క్షణాలన్నిటినీ వీడియోగా మలచి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇదే వీడియోని ప్రధాని మళ్ళీ రీట్వీట్ చేస్తూ.. ఫ్రాన్స్- భారత్ మన బంధం కాలాతీతమైనది. ఇందులో మన విలువలు, కలిసికట్టుగా కన్న కలలు ప్రతిధ్వనిస్తుంటాయి. నా ప్రియ స్నేహితుడైన ఇమ్మాన్యుయేల్ మేక్రాన్.. నేను ఈ దఫా ఫ్రాన్స్ లో గడిపిన ప్రతి క్షణాన్నీ నెమరు వేసుకుంటూనే ఉంటానని రాశారు. To the people of India, trust and friendship. pic.twitter.com/s8b3Hb7cf8 — Emmanuel Macron (@EmmanuelMacron) July 15, 2023 ఫ్రాన్స్ అధ్యక్షుడు పోస్ట్ చేసిన వీడియో భారత ప్రధానికి ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని బహుకరించడడంతో మొదలైంది. అనంతరం జులై 14న జరిగిన బాస్టిల్ డే ఉత్సవాల్లో ప్రధానితో కలిసి మెక్రాన్ పాల్గొన దృశ్యాలు.. అందులో సైనిక, వైమానిక దళాల విన్యాసాలను ఇద్దరు కలిసి తిలకిస్తున్న సన్నివేశాలున్నాయి. ఫ్రాన్స్ దేశాధినేతలతో ఎల్సీ ప్యాలెస్ లో జరిగిన సమావేశం.. అందులోని ఒప్పందాలు.. ఫ్రాన్స్ ఎకనామిక్ ఫోరమ్ సభ్యులతో మంతనాలు.. లౌవ్రే మ్యూజియంలో డిన్నర్ అన్నిటినీ దృశ్యాల సమాహారంగా చేసి చివర్లో ప్రధాన మంత్రికి కృతఙ్ఞతలు తెలిపారు. వీడియో చివర్లో భారతీయ నటుడు మాధవన్ కూడా తళుక్కున మెరిశారు. అందరూ కలిసి సెల్ఫీ తీసుకున్న దృశ్యం వీడియోకే హైలైట్. India and France…a bond that transcends time, echoing in our shared values and kindling our collective dreams. I will always cherish my recent visit to France. Thank you my friend, President @EmmanuelMacron. https://t.co/R6rcvhMKoj — Narendra Modi (@narendramodi) July 16, 2023 ఇది కూడా చదవండి: పబ్జీ ప్రేమకథలో మరో ట్విస్టు.. నువ్వు మాకొద్దు.. -
‘ఫ్రెంచి పరేడ్’కు ‘రాఫెల్ పాసు’!
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పదం కోసం ఫ్రాన్స్‌లో పర్యటించడం ద్వారా బాస్టిల్ డే కవాతులో పాల్గొనే అవకాశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సంపాదించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ‘‘మణిపూర్‌లో ఓ వైపు విద్వేషాగ్ని వ్యాపిస్తోంది. ఈ అంశాన్ని యూరప్ పార్లమెంట్ కూడా పట్టించుకుని చర్చకు పెట్టింది! కానీ మన ప్రధాని మాత్రం అసలేం పట్టనట్లు కూర్చున్నారు. మణిపూర్‌పై ఇంతవరకు ఒక్కమాటా మాట్లాడలేదు. పైగా రాఫెల్ ఒప్పందంతో పారిస్‌లో బాస్టిల్ డే కవాతులో పాల్గొనే పాస్ సంపాదించారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కూడా, ‘‘1997లో రిచర్డ్ నెల్సన్ ‘ది మూన్ అండ్ ది గెట్టో’ అని ఒక వ్యాసం రాశారు. అందులో ఏముందంటే.. అద్భుత సాంకేతికత సాధించిన అమెరికా చంద్రుడిపై కాలుమోపింది. కానీ స్వదేశంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం కనుగొనలేకపోయింది. ఇప్పుడు ఆ వ్యాసాన్ని భారత్‌లో మాత్రం ‘ది మూన్ అండ్ మణిపూర్’గా చదువుకోవాలి’’ అని విమర్శించారు. విసుగెత్తిన యువరాజు: బీజేపీ కౌంటర్ రాహుల్ విమర్శలపై బీజేపీ నేత స్మృతి ఇరానీ స్పందించారు. ‘ఫ్రాన్స్‌లో నిరసనలు, అల్లర్ల విషయాన్ని ప్రస్తావించని ఈయూ పార్లమెంట్.. భారత్‌లో మణిపూర్ అంశంపై చర్చకు సిద్దమవుతాయి. ఇదే రాహుల్ ఆశించేది. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ఆయన కోరుకుంటున్నారు. ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారంతో మోదీని సత్కరించడంతో విసుగు చెందిన యువరాజు ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాలను తుంగలో తొక్కుతున్నారు. ప్రజలు తిరస్కరించిన రాహుల్ రక్షణ ఒప్పందాలు తమ హయాంలో జరగలేదే అని తెగ బాధపడిపోతున్నారు’ అని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఇన్నేళ్లూ మణిపూర్ సమస్యను అపరిష్కృతంగా తయారుచేసిన ఘనత కాంగ్రెస్‌దే అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘లైంగిక వేధింపులపై ఉద్యమిస్తున్న మహిళా అథ్లెట్లకు ఈ మహిళా నేత కనీస మద్దతు ఇవ్వరు. కానీ రాహుల్‌పై విమర్శలకు రెడీ అవుతారు’’ అంటూ స్మృతీపై కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథే విమర్శలు గుప్పించారు. -
ప్రధాని ఫ్రాన్స్ పర్యటన.. మోదీ భారీ ప్రకటనలు..
ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో రెడ్‌కార్పెట్ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన పారిస్ చేరుకోగా.. శుక్రవారం ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పర్యటనలో భాగంగా మోదీ సెయిన్ మ్యూజికల్ కళాప్రాంగణంలో ప్రవాస భారతీయ సమాజంతో మాట్లాడారు. ఈ మేరకు ఫ్రాన్స్‌లోని భారతీయులకు భారీ ప్రకటనలను చేశారు. అవి.. ► ఇకపై ఫ్రాన్స్‌లోనూ యూపీఐ సేవలు వినియోగించేలా ఒప్పందం చేసుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఈఫిల్ టవర్ నుంచే దీనిని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దీంతో ఫ్రాన్స్‌కు వెళ్లే పర్యటకులు రూపాయిల్లోనే చెల్లింపులు చేయొచ్చు. ► ఫ్రెంచ్ ప్రభుత్వం సహకారంతో మార్సెల్లీలో కొత్త కాన్సులెట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ► ఫ్రాన్స్‌లో మాస్టర్ డిగ్రీ చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ప్రధాని మోదీ తీపి కబురు చెప్పారు. ఇకపై ఫ్రాన్స్‌లో భారతీయ విద్యార్థులకు పోస్టు స్టడీ వీసాను ఐదేళ్లకు పొడిగించే విధంగా ఒప్పందం కుదిరినట్లు మోదీ చెప్పారు. ► తమిళ తత్వవేత్త తిరువళ్లువార్ విగ్రహాన్ని ఫ్రాన్స్‌లో ప్రతిష్టించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. కొన్ని వారాల్లోనే ఆ పని పూర్తి కానున్నట్లు చెప్పారు. ► భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పలు రేటింగ్ సంస్థలు చెప్పాయని మోదీ అన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ఇండియా సరైన ప్రదేశం.. అవకాశాన్ని అందుపుచ్చుకోవాలని సంస్థలను ప్రధాని మోదీ కోరారు. ఇదీ చదవండి: ఫ్రాన్స్‌లో మోదీకి రెడ్‌కార్పెట్ -
ఫ్రాన్స్‌లో మోదీకి రెడ్‌కార్పెట్
పారిస్: ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో రెడ్‌కార్పెట్ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన పారిస్ చేరుకున్నారు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బార్నీ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి పూర్తి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. శుక్రవారం ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా మోదీ పాల్గొంటారు. అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో సమావేశమవుతారు. ‘‘పారిస్ చేరుకున్నా. భారత్–ఫ్రాన్స్ మధ్య మరింత సంబంధాలు బలపడేందుకు నా పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నా’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్‌లోని భారతీయులతో భేటీ కాబోతున్నానని వెల్లడించారు. వారంతా ఆయన బస చేసిన హోటల్ బయట గుమికూడి ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. వారితో మోదీ ముచ్చటించారు. ప్రవాస భారతీయులు తమ నైపుణ్యాలు, కష్టించే తత్వంతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారని ప్రశంసించారు. ఈ పర్యటన నాకెంతో ప్రత్యేకం భారత్–ఫ్రాన్స్ ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి తన పర్యటనతో మరింత ఊపొస్తుందని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. ఫ్రాన్స్ బయల్దేరే ముందు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. రక్షణ భాగస్వామ్యంతోపాటు కీలక అంశాలపై ఆయనతో చర్చించబోతున్నానని వివరించారు. రాబోయే పాతికేళ్లలో ఇరు దేశాల బంధాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చిస్తామన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మాక్రాన్‌తో కలిసి పనిచేస్తామన్నారు. ఫ్రాన్స్ పర్యటన తనకెంతో ప్రత్యేకమని ఉద్ఘాటించారు. నేషనల్ డే పరేడ్‌లో 269 మంది జవాన్ల భారత బృందం పాలుపంచుకోనుంది. తర్వాత మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని అబూదాబీలో పర్యటిస్తారు. 26 రఫేల్ జెట్లు, 3 స్కారి్పన్ సబ్మెరైన్లు న్యూఢిల్లీ: నావికా దళం కోసం 26 రఫేల్ యుద్ధ విమానాలు, 3 స్కార్పిన్ జలాంతర్గాములను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసే ప్రతిపాదనలకు రక్షణ శాఖ గురువారం ఆమోద ముద్ర వేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని రక్షణ ఆయుధాల సేకరణ మండలి (డీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుల విలువ రూ.85,000 కోట్ల దాకా ఉంటుందని అంచనా. వీటి రాకతో నావికాదళం మరింత బలోపేతం కానుంది. ప్రధాని మోదీ శుక్రవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీఅలో ద్వైపాక్షిక వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతంలో భాగంగా రఫేల్, స్కారి్పన్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటారని సమాచారం. వైమానిక దళం కోసం ఫ్రాన్స్ నుంచి 36 ఫైటర్ జెట్లను భారత్ ఇప్పటికే కొనుగోలు చేసింది. -
Ukraine-Russia war: మాకు మరిన్ని ఆయుధాలు కావాలి
బ్రస్సెల్స్: రష్యాను ఎదుర్కొనేందుకు తమకు మరింత సైనిక సాయం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొమిదిర్ జెలెన్స్కీ కోరారు. ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) కలిసి యూరప్ బద్దవ్యతిరేకి అయిన రష్యాతో తలపడుతున్నాయని చెప్పారు. గురువారం ఆయన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లోని ఈయూ పార్లమెంట్‌నుద్దేశించి ప్రసంగించారు. ‘మనం కలిసి ఉన్నంత కాలం, మన యూరప్‌ను కాపాడుకున్నంత కాలం, మన యూరప్ జీవన విధానాన్ని పరిరక్షించుకున్నంత కాలం యూరప్ యూరప్‌గానే నిలిచి ఉంటుంది’అని జెలెన్స్కీ చెప్పారు. యూరప్ జీవన విధానాన్ని నాశనం చేయాలని రష్యా కోరుకుంటోంది. కానీ, మనం అలా జరగనివ్వరాదు’అని చెప్పారు. అంతకుముందు ఈయూ ప్రతినిధులు ఆయనకు పార్లమెంట్ భవనంలోకి ఘనంగా స్వాగతం పలికారు. ప్రసంగం పూర్తయిన అనంతరం, ప్రొటోకాల్ ప్రకారం ఉక్రెయిన్ జాతీయ గీతం, యూరోపియన్ గీతం వినిపించారు. ఆ సమయంలో జెలెన్స్కీ ఈయూ జెండాను చేబూనారు. అనంతరం యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు రొబెర్టా మెట్సోలా మాట్లాడుతూ.. లాంగ్ రేంజ్ క్షిపణి వ్యవస్థలను, యుద్ధవిమానాలను సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్‌కు అందించే విషయం పరిశీలించాలని సభ్య దేశాలను కోరారు. ఉక్రెయిన్‌కు రష్యాతో ఉన్న ముప్పునకు తగ్గట్లే చర్యలుండాలని సూచించారు. ఇది ఉక్రెయిన్ అస్తిత్వానికి సంబంధించిన విషయమన్నారు. ఈనెల 24వ తేదీతో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించి ఏడాదవుతోంది. ఈ సందర్భంగా దాడులను మరో విడత తీవ్రతరం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అదనపు సైనిక సాయం కోసం జెలెన్స్కీ మిత్ర దేశాల్లో పర్యటనలు చేస్తున్నారు. అంతకుముందు ఫ్రాన్సు పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు మేక్రాన్ ఆయన్ను లీజియన్ ఆఫ్ హానర్‌తో సన్మానించారు. బ్రస్సెల్స్‌లో ఈయూకు చెందిన 27 దేశాల నేతలతో జెలెన్స్కీ సమావేశమయ్యారు. -
బహ్రెయిన్‌కు మీ కోసం వచ్చా
మనామా: బహ్రెయిన్ అభివృద్ధికి ప్రవాస భారతీయులు చేసిన కృషిపై అభినందనలను వింటే తన మనసు సంతోషంతో పొంగిపోతుందని ప్రధాని మోదీ అన్నారు. బహ్రెయిన్‌లోని ప్రవాస భారతీయుల శ్రమను మోదీ ప్రశంసించారు. బహ్రెయిన్‌లో పనిచేస్తున్న భారతీయులను ఉద్దేశించి మోదీ బహ్రెయిన్ జాతీయ స్టేడియంలో ప్రసంగించారు. ‘నేను భారత ప్రధానిగానే ఇక్కడకు వచ్చాను. కానీ ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులను కలిసి వారితో మాట్లాడటమే’ అని అన్నారు. బహ్రెయిన్ మొత్తం జనాభా దాదాపు 12 లక్షలు కాగా, అక్కడ పనిచేస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్యే 3.5 లక్షలు. వీరిలోనూ ఎక్కువ మంది కేరళీయులే. బహ్రెయిన్‌లో పర్యటిస్తున్న తొట్టతొలి భారత ప్రధాని మోదీయే. రూపే కార్డును ఉపయోగించి త్వరలోనే బహ్రెయిన్లోనూ చెల్లింపులు చేసే అవకాశం కల్పిస్తున్నామనీ, ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఇప్పటికే ఇరు దేశాలు సంతకాలు చేశాయని ఆయన తెలిపారు. మోదీకి కింగ్ హమద్ ఆర్డర్ అవార్డు.. బహ్రెయిన్‌తో భారత సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నందుకు మోదీకి ‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రినైజన్స్’ అవార్డును బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ప్రదానం చేశారు. మోదీ పర్యటన సందర్భంగా 250 మంది భారతీయ ఖైదీలను ఆదివారం విడుదల చేసి బహ్రెయిన్ మానవత్వాన్ని చాటుకుంది. బహ్రెయిన్‌లో 200 ఏళ్ల పురాతనమైన శ్రీనాథ్జీ శ్రీకృష్ణుడి ఆలయాన్ని పునరభివృద్ధి చేసేందుకు రూ. 30 కోట్ల విలువైన పనులను మోదీ ఆదివారం ప్రారంభించారు. ఖలీఫాతో మోదీ చర్చలు జరిపిన అనంతరం ఓ సంయుక్త ప్రకటనను రెండు దేశాలు విడుదల చేశాయి. ద్వైపాక్షిక, ప్రాంతీయ, బహుముఖ అంశాలపై వారు చర్చించారు. ఉగ్రవాదంపై నిఘా సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఫ్రాన్స్ చేరుకున్న మోదీ బియారిట్జ్: బహ్రెయిన్ పర్యటనను మోదీ ఆదివారం ముగించుకుని, జీ–7 సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం ఫ్రాన్స్‌లోని బియారిట్జ్‌కు చేరుకున్నారు. పర్యావరణం తదితర సమకాలీన అంశాలపై మోదీ ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. పలువురు అంతర్జాతీయ స్థాయి నేతలతో ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొంటారు. జీ–7 కూటమి దేశాల్లో భారత్ లేకపోయినప్పటికీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు మోదీ ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. జాన్సన్‌తో భేటీ అయిన మోదీ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో మోదీ ఆదివారం బియారిట్జ్‌లో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ఇరు ప్రధానులు చర్చలు జరిపారని భారత ప్రధానమంత్రి కార్యాలయం తెలిపిం ది. బ్రిటన్ ప్రధానిగా జాన్సన్ ఎన్నికయ్యాక ఆయనతో మోదీ తొలి భేటీ ఇది. -
అవినీతి, ఉగ్రవాదానికి అడ్డుకట్ట
పారిస్: ముందెన్నడూ లేని రీతిలో దేశంలో అవినీతికి, బంధుప్రీతికి, ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేశామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రజాధనాన్ని లూటీ చేయటానికి కూడా కళ్లేలు వేశామన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు తమకు అఖండ మెజారిటీ ఇస్తూ... ‘నవభారత నిర్మాణం’ అనే గురుత బాధ్యతను తమ భుజాలపై పెట్టారన్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారత సంతతికి చెందినవారిని ఉద్దేశించి శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయటంతో పాటు దాన్ని శిక్షార్హమైన నేరంగా చేస్తూ కీలకమైన చట్టం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని పరోక్షంగా ఆయన ప్రస్తావిస్తూ.. ‘తాత్కాలిక వ్యవహారాలకు ఇక భారత్‌లో చోటులేదు. ఎందుకంటే మనది గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ, రాముడు, కృష్ణుడు అవతరించిన గడ్డ. దాదాపు 125 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో అతి పెద్ద సమస్యగా మారిన కేవలం ఒకే ఒక్క తాత్కాలిక వ్యవహారాన్ని డీల్ చేయటానికి 70 ఏళ్లు పట్టిన విషయం మీరే చూశారు. ఈ పరిస్థితిపై నవ్వాలో ఏడ్వాలో నాకు తెలియడం లేదు. అయితే, శాశ్వత ప్రాతిపదికన చేపట్టే పనుల ద్వారానే లక్ష్య సాధన సాధ్యమవుతుంది’ అని స్పష్టంచేశారు. ‘ఓట్ల రూపంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారానే దేశ పురోగమనం సాధ్యమవుతోంది తప్ప మోదీ కారణంగా కాదు’ అని ఆయన పేర్కొనగానే సభికులంతా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ‘మోదీ ఉంటేనే సాధ్యం’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.‘‘నవభారత్ నిర్మాణం లో భాగంగానే అవినీతి, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, ప్రజాధనం దోపిడీ, ఉగ్రవాదం వం టి వాటిపై గతంలో ఎన్నడూ లేని విధంగా పోరాటం సాగించి అడ్డుకట్ట వేశాం. అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు దూసుకెళ్తున్నాం. కాప్– 21 సమ్మిట్‌లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం వాతా వరణ మార్పుల లక్ష్యాలను 2030 సంవత్సరం వరకు కాకుండా వచ్చే ఏడాదిన్నరలోనే సాధిస్తాం’’ అని ప్రధాని తెలిపారు. ఇన్ఫ్రా అనే పదాన్ని ప్రస్తావిస్తూ... ‘‘దీన్లో ఇన్ అంటే ఇండియా. ఫ్రా అంటే ఫ్రాన్స్. ఇన్ఫ్రా మాదిరిగా ఇరువురి సంబంధాలూ దృఢంగా ఉండాలి’’ అన్నారాయన. ఫుట్‌బాల్ భాషలో మోదీ ప్రసంగం భారత్‌తో ఫ్రాన్స్‌కు ఉన్న స్నేహ సంబంధాన్ని ఫుట్‌బాల్ ఆటతో పోలుస్తూ ప్రధాని మోదీ ఆసక్తికర ప్రసంగం చేశారు. వివిధ పరిస్థితుల్లో భారత్, ఫ్రాన్స్‌లు కలసి నిర్మాణాత్మక పద్ధతిలో పని చేశాయన్నారు. ‘ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే దేశానికి నేనొచ్చాను. మీకందరికీ గోల్ ఎంత ముఖ్యమైనదో తెలుసు. గత అయిదేళ్లలో మేం కూడా అసాధ్యం అనిపించేలా ఉన్న గోల్స్‌ను అధికారుల ఆత్మవిశ్వాసం సాధించగలిగింది’ అని ప్రధాని పేర్కొన్నారు. అంతకుముందు ప్రధాని ఫ్రాన్సులో 1950, 1960ల్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద మృతుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం మోదీ యూఏఈ రాజధాని అబుదాబీకి బయలుదేరారు. అక్కడి నుంచి బహ్రెయిన్‌కు వెళ్లనున్నారు. -
మోదీకి ఫ్రాన్స్‌లో ఘనస్వాగతం
పారిస్: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. ఆయనకు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీనివ్స్ లీ డ్రియన్ ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మక్రాన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. మూడుదేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ చేరుకున్న మోదీ, శుక్రవారం యూఏఈకి వెళ్లనున్నారు. అనంతరం బహ్రెయిన్‌కు వెళ్లనున్న ప్రధాని.. ఆ దేశపు రాజు షేక్ హమీద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశమై చర్చలు జరుపుతారు. చివరగా ఆదివారం ఫ్రాన్స్‌కు తిరిగొచ్చి జీ7 సదస్సులో పాల్గొంటారు. -
రఫేల్ ప్లాంట్‌లో రక్షణ మంత్రి
పారిస్: ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం రఫేల్ యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. పారిస్ సమీపంలోని ఈ ఉత్పత్తి కేంద్రంలో ఫ్రెంచ్ కంపెనీ డసో ఏవియేషన్ తయారుచేసే విమానాలనే భారత్‌కు సరఫరా చేయనున్నారు. ఈ సందర్భంగా డసో కంపెనీ ప్రతినిధులతో ముచ్చటించిన నిర్మలా సీతారామన్, విమానాల తయారీ పురోగతిని పరిశీలించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి పలు దశల్లో రఫేల్ విమానాలు భారత్‌కు అందుతాయి. అంతకుముందు, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేతో సమావేశమైన నిర్మలా సీతారామన్..ఇరు దేశాల వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతంపై చర్చించారు. వీరి మధ్య రఫేల్ ఒప్పందం ప్రస్తావనకు వచ్చిందో? రాలేదో? తెలియరాలేదు. ఆగని విమర్శలు, ప్రతివిమర్శలు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అబద్ధాలకోరు, వదంతుల సృష్టికర్త అని బీజేపీ మండిపడింది. రఫేల్ ఒప్పందంపై ఆయన తరచూ చెబుతున్న అబద్ధాలు నిజాన్ని కప్పిపుచ్చలేవని పేర్కొంది. డసో ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..ఫ్రాన్స్ ప్రభుత్వం రాహుల్ మాటల్లోని డొల్లతనాన్ని బహిర్గతంచేసిందని, ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. మరోవైపు, బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. రఫేల్ ఒప్పందంపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని, ఎవరు అబద్ధాలు చెబుతున్నారో అప్పుడే తెలుస్తుందని పేర్కొంది. గోయల్ చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా స్పందిస్తూ ‘వాస్తవాల ఆధారంగానే మేము ప్రశ్నలు అడిగాం. మీరు కూడా వాస్తవాలతో కూడిన సమాధానాలు ఇవ్వాలి. దేశానికి నిజాలు కావాలి. రాహుల్‌కు మీరు ఆపాదిస్తున్న విశేషణాలు కాదు. అప్పుడు ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు అబద్ధాలాడుతున్నారు? అన్నది ప్రజలు నిర్ణయిస్తారు’ అని అన్నారు. -
అన్ని మతాలకు సమస్థానం
* అందరి హక్కులను పరిరక్షిస్తాం * ప్రజల మధ్య వారధులుగా మతం, సంస్కృతి నిలవాలి * యునెస్కో కార్యక్రమంలో మోదీ * భారత ప్రధానికి ఫ్రాన్స్‌లో ఘనస్వాగతం పారిస్: భారత్‌లోని అన్ని మత విశ్వాసాలకు చెందిన ప్రజల హక్కులు, స్వేచ్ఛాస్వాతంత్య్రాలను పరిరక్షిస్తామని.. సమాజంలో వారికి సమానావకాశాలు కల్పిస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. దేశంలోని పౌరులందరి ఐకమత్యమే జాతి శక్తిని నిర్ధారిస్తుందని, దేశంలోని అత్యంత బలహీనుడు సైతం సాధికారత సాధించిననాడే నిజమైన ప్రగతి సాధించినట్లవుతుందని మోదీ తేల్చి చెప్పారు. ‘భారత రాజ్యాంగం రూపొందిందే ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు అందాలన్న మౌలిక సూత్రం ఆధారంగా’ అని వివరించారు. పారిస్‌లోని యునెస్కో(యునెటైడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ప్రధాన కార్యాలయంలో భారీగా హాజరైన ప్రవాస భారతీయులనుద్దేశించి శుక్రవారం మోదీ ప్రసంగించారు. అంతకుముందు రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లిన ప్రధానికి శుక్రవారం పారిస్‌లో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు. భారత్, ఫ్రాన్స్‌ల జాతీయ గీతాలాపనల మధ్య ఫ్రాన్స్ రిపబ్లికన్ గార్డ్స్ సైనిక వందనం స్వీకరించారు. ‘మోదీ.. మోదీ’, ‘వందేమాతరం’ యునెస్కో కార్యక్రమంలో సభికుల ‘మోదీ.. మోదీ’, ‘వందేమాతరం’ నినాదాలకు భారత ప్రధాని ‘గుడ్.. గుడ్’ అంటూ ప్రతిస్పందించారు. ప్రపంచవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న తీవ్రవాదం, హింస, విభజనవాద ధోరణులను అరికట్టేందుకు మతం, సంస్కృతి, సంప్రదాయాలను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మోదీ సూచించారు. ప్రజల మధ్య వారధులుగా మతం, సంస్కృతి నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ‘మనం అతి ప్రాచీన గడ్డపై అసాధారణ భిన్నత్వం, అపురూపమైన హృదయ వైశాల్యం, అద్భుతమైన సహజీవనం సంప్రదాయాలుగా కలిగిన ఆధునిక రాజ్యాన్ని నిర్మించుకున్నాం’ అంటూ భారత్‌కే ప్రత్యేకమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆవిష్కరించారు. ‘ప్రతీ పౌరుడి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు, హక్కులను కాపాడుతాం. ప్రతీ మత విశ్వాసం, సంస్కృతి, జాతికి చెందిన పౌరులందరికీ మన సమాజంలో సమస్థానం లభించేలా చూస్తాం. వారందరికీ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తాం. ఆశయాల సాధనకు అవసరమైన విశ్వాసాన్ని అందిస్తాం’ అని భారత్‌లోని మైనారిటీల్లో విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు ప్రయత్నించారు. ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు పెద్ద ఎత్తున చేపట్టిన ‘ఘర్ వాపసీ’ కార్యక్రమం, ఇటీవల పెరిగిన బీజేపీ నేతల మైనారిటీ వ్యతిరేక వ్యాఖ్యలు, చర్చిలపై దాడులు.. తదితరాలతో ప్రభుత్వంపై పడిన మతవాద ముద్రను చెరిపేసే దిశగా మోదీ ప్రసంగం సాగింది. తన ప్రసంగంలో మహాత్మాగాంధీ, అరబిందోల వ్యాఖ్యలను ప్రధాని ఉటంకించారు. అంతకుముందు యునెస్కో భవనం ముందున్న అరబిందో విగ్రహానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో యునెస్కో డెరైక్టర్ జనరల్ ఇరెనా బుకోవా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యుడు కరణ్ సింగ్, బాలీవుడ్ నటి మల్లికా షెరావత్.. తదితరులు పాల్గొన్నారు. అనంతరం టెక్ మహీంద్రా కంపెనీ రూపొందించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ పోర్టల్ ఠీఠీఠీ.జీఛ్చీడౌజడౌజ్చ.ౌటజను మోదీ ప్రారంభించారు. భారత్ డిజిటల్ ఇండియా లక్ష్యానికి సహకరిస్తామని ఈ సందర్భంగా యునెస్కో ప్రకటించింది. బాలలు, మహిళల అభివృద్ధికి మోదీ సర్కారు తీసుకుంటున్నచర్యలను ప్రశంసించింది. యునెస్కోకు భారత నాయకత్వం మునపటికన్నా ఇప్పుడు మరింత అవసరమని యునెస్కో డీజీ ఇరెనా బుకోవా పేర్కొన్నారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. * వచ్చే ఏడేళ్లలో 1.75 లక్షల మెగావాట్ల స్వచ్ఛ విద్యుదుత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం. * దేశ ప్రగతిని వృద్ధి రేటు గణాంకాల ఆధారంగా కాదు.. ప్రజల ముఖాల్లోని వెలుగుల ఆధారంగా గణించాలన్నది మా అభిమతం. * ప్రతీ కుటుంబానికి ఇల్లు, ప్రతీ ఇంటికి విద్యుత్తు, అందరికీ స్వచ్ఛమైన నీరు, పారి శుద్ధ్య సౌకర్యాలు, స్వచ్ఛమైన నీటితో సాగే నదులు, స్వచ్ఛమైన నీరు, పక్షుల కిలకిలారావాలు ప్రతిధ్వనించే అడవులు.. నా ప్రభుత్వ లక్ష్యాలు. అందుకు నిధులు, విధానాలే కాదు.. సైన్స్ సాయం కూడా కావాలి. * భారత్‌లో సైన్స్, విద్య అభివృద్ధి కోసం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న యునెస్కోకు కృతజ్ఞతలు.