Marrakech
-
అంతర్జాతీయ సవాళ్లపై సమాలోచనలు...
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొరాకో ఆర్థిక రాజధాని మారకేచ్‌లో ప్రపంచ ఆర్థిక విధాన నిర్ణేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలు అంతర్జాతీయ ఆర్థిక అంశాలు, సవాళ్లు, వీటిని ఎదుర్కొనడం.. ఆమె చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆమె ఈ నెల 11న మారకేచ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా ఆమె 15వ తేదీ వరకూ మరకేచ్లోనే ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగంగా ఉన్నాయి. సమావేశాల్లో భాగంగా అమెరికా ఆర్థికమంత్రి జనెత్ ఎలన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనడానికి ఐఎంఎఫ్‌కు నిధుల లభ్యతపై ప్రధానంగా చర్చ జరిగింది. ఐఎంఎఫ్ రుణ విధానాలు, పటిష్టత, కోటా విధానం, పేదరిక నిర్మూలన, ఐఎంఎఫ్ పాలనా నిర్వహణ విషయంలో సంస్కరణలపై ఆర్థికమంత్రి ప్రధానంగా చర్చించినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కే జార్జివా నేతృత్వంలోని బృందంతోపాటు, ఇంటర్–అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇలాన్ గోల్డ్ఫాజ్్నతో కూడా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. జీ20 ఎజెండాను కొనసాగించేందుకు ఐఎంఎఫ్‌తో కలిసి పనిచేయాలన్న భారత్ ఆకాంక్షను ఆమె ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌తో జరిగిన సమావేశాల్లో వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
నిర్మలా సీతారామన్ మొరాకో పర్యటన నేటి నుంచి
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఆరు రోజుల పర్యటన నిమిత్తం మొరాకో బయలుదేరనున్నారు. ఆ దేశ ఆర్థిక రాజధాని మారకేచ్‌లో ఈ ఆరు రోజుల అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వార్షిక సమావేశంలో ఆర్థికమంత్రి పాల్గొననున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. దీనితోపాటు ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లతో భారత్ ద్వైపాక్షిక సమావేశాలు అక్టోబర్ 11–15 తేదీల మధ్య మరకేచ్‌లో జరగనున్నాయి. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశాల కోసం వెళుతున్న భారత ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి నాయకత్వం వహిస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అధికారులు ఈ ప్రతినిధి బృందంలో సభ్యులుగా ఉంటారని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఈ పర్యటనలో, సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నాల్గవ జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తారు.ఈ సమావేశంలో జీ20 దేశాలు, ఆహా్వనిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుండి దాదాపు 65 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగం కానున్నాయి. బహుళజాతి బ్యాంకుల పటిష్టతకు సంబంధించి నిపుణుల గ్రూప్ రూపొందించిన రెండవ వ్యాల్యూమ్ నివేదిక ఈ సమావేశాల్లో విడుదల కానుంది. మొదటి వ్యాల్యూమ్ నివేదిక గుజరాత్ గాం«దీనగర్‌లో జూలైలో జరిగిన మూడవ ఎఫ్‌ఎంసీబీజీ సమావేశాల్లో విడుదలైన సంగతి తెలిసిందే. -
అసహజ శృంగారం.. ఇద్దరమ్మాయిల అరెస్ట్
మర్రాకెచ్: మొరాకోలో ఇద్దరు బాలికలను స్వలింగ సంపర్కం నేరం కింద అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరికీ మూడేళ్లు జైలు శిక్ష విధించే అవకాశముంది. వీరిద్దరినీ గతవారం మర్రాకెచ్ లో అరెస్ట్ చేశారు. బహిరంగంగా ముద్దులు పెట్టుకుని, కౌగిలించుకున్నారన్న కారణంతో 16, 17 ఏళ్ల వయసున్న బాలికలను అదుపులోకి తీసుకున్నారని 'సీఎన్ఎన్' తెలిపింది. తర్వాత వీరిని బెయిల్ పై విడుదల చేశారు. మొరాకో చట్టం 489 సెక్షన్ ప్రకారం వీరిపై నేటి నుంచి కోర్టులో విచారణ జరగనుంది. 489 సెక్షన్ ప్రకారం... స్వలింగ సంపర్కం నేరంగా పరిగణిస్తారు. స్వలింగ సంపర్కులు అసభ్యంగా, అసహజంగా ప్రవర్తిస్తే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. కాగా, బాలికల తరపున వాదించేందుకు న్యాయవాదిని నియమించినట్టు మొరాకో మానవ హక్కుల సంఘం ప్రతినిధి ఒమర్ అర్బీబ్ తెలిపారు. 489 సెక్షన్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్షలు సరికాదని పేర్కొన్నారు. బాలికలకు మద్దతుగా ఆల్టర్నేటివ్ మూవ్ మెంట్ ఫర్ ఇండివిడ్యువల్ లిబర్టీస్(ఎంఏఎల్ఐ) ఒక ఫొటోను ప్రచురించింది. 'మేము భిన్న లింగ సంపర్కులం. ఎల్జీబీటీ హక్కులకు మద్దతు ఇస్తా' మంటూ ఇద్దరు మహిళలతో ఉన్న ఫొటో పెట్టింది.