అసహజ శృంగారం.. ఇద్దరమ్మాయిల అరెస్ట్ | Teen girls in Morocco face jail for kissing | Sakshi
Sakshi News home page

అసహజ శృంగారం.. ఇద్దరమ్మాయిల అరెస్ట్

Published Fri, Nov 4 2016 9:56 AM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

అసహజ శృంగారం.. ఇద్దరమ్మాయిల అరెస్ట్

అసహజ శృంగారం.. ఇద్దరమ్మాయిల అరెస్ట్

మర్రాకెచ్: మొరాకోలో ఇద్దరు బాలికలను స్వలింగ సంపర్కం నేరం కింద అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరికీ మూడేళ్లు జైలు శిక్ష విధించే అవకాశముంది. వీరిద్దరినీ గతవారం మర్రాకెచ్ లో అరెస్ట్ చేశారు. బహిరంగంగా ముద్దులు పెట్టుకుని, కౌగిలించుకున్నారన్న కారణంతో 16, 17 ఏళ్ల వయసున్న బాలికలను అదుపులోకి తీసుకున్నారని 'సీఎన్ఎన్' తెలిపింది. తర్వాత వీరిని బెయిల్ పై విడుదల చేశారు.

మొరాకో చట్టం 489 సెక్షన్ ప్రకారం వీరిపై నేటి నుంచి కోర్టులో విచారణ జరగనుంది. 489 సెక్షన్ ప్రకారం... స్వలింగ సంపర్కం నేరంగా పరిగణిస్తారు. స్వలింగ సంపర్కులు అసభ్యంగా, అసహజంగా ప్రవర్తిస్తే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది.

కాగా, బాలికల తరపున వాదించేందుకు న్యాయవాదిని నియమించినట్టు మొరాకో మానవ హక్కుల సంఘం ప్రతినిధి ఒమర్ అర్బీబ్ తెలిపారు. 489 సెక్షన్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్షలు సరికాదని పేర్కొన్నారు. బాలికలకు మద్దతుగా ఆల్టర్నేటివ్ మూవ్ మెంట్ ఫర్ ఇండివిడ్యువల్ లిబర్టీస్(ఎంఏఎల్ఐ) ఒక ఫొటోను ప్రచురించింది. 'మేము భిన్న లింగ సంపర్కులం. ఎల్జీబీటీ హక్కులకు మద్దతు ఇస్తా' మంటూ ఇద్దరు మహిళలతో ఉన్న ఫొటో పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement