రోడ్డు ప్రమాదంలో 31మంది అథ్లెట్ల దుర్మరణం | Bus carrying athletes crashes in Morocco, killing 31 | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో 31 మంది అథ్లెట్ల దుర్మరణం

Published Fri, Apr 10 2015 6:16 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

రోడ్డు ప్రమాదంలో 31మంది అథ్లెట్ల దుర్మరణం - Sakshi

రోడ్డు ప్రమాదంలో 31మంది అథ్లెట్ల దుర్మరణం

రబాట్: మొరాకోలో ఘోరం జరిగింది. శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 31 మంది అథ్లెట్లతో సహా 40 మంది మరణించారు. యువ అథ్లెట్లు, కోచ్లు ప్రయాణిస్తున్న బస్సును ఆయిల్ ట్రక్ ఢీకొనడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు అగ్నికీలకల్లో ఆహుతవడంతో ఎక్కువ ప్రాణనష్టం జరిగింది. అథ్లెట్లు మంటల్లో చిక్కుకుని దహనమయ్యారు.

ఉత్తర మొరాకోలో పోటీలో పాల్గొన్న అనంతరం అథ్లెట్లు తిరిగివస్తుండగా టన్ టన్ నగరం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆ సయమంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అథ్లెట్లతో సహా 40 మంది మంటల్లో కాలి మరణించగా, మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement