
మొరాకో జట్టు
FIFA World Cup 2022 Morocco Vs Spain- దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో 2010 విజేత స్పెయిన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇంటిముఖం పట్టింది. ఆఫ్రికా ఖండానికి చెందిన ప్రపంచ 22వ ర్యాంకర్ మొరాకో జట్టు మొండి పట్టుదలతో ఆడి ఏడో ర్యాంకర్ స్పెయిన్‌ను ఓడించి తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
ఫిఫా వరల్డ్‌కప్-2022లో భాగంగా ప్రిక్వార్టర్స్‌లో ఈ రెండు జట్లు నిర్ణీత సమయంలో... ఆ తర్వాత అదనపు సమయంలోనూ గోల్స్ చేయలేకపోయాయి. దాంతో ‘షూటౌట్’ అనివార్యమైంది. ‘షూటౌట్’లో స్పెయిన్ ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. వరుసగా మూడు షాట్‌లను లక్ష్యానికి పంపించలేకపోయారు.
షూటౌట్‌లో ఇలా
సరాబియా తొలి షాట్ గోల్‌పోస్ట్ బార్‌కు తగిలి పక్కకు వెళ్లగా... సోలెర్ రెండో షాట్‌ను.. బుస్‌క్వెట్స్ మూడో షాట్‌ను మొరాకో గోల్‌కీపర్ యాసిన్ బోనో నేర్పుతో నిలువరించి తమ జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. ప్రపంచకప్‌లో నాలుగుసార్లు పెనాల్టీ షూటౌట్‌లలో ఓడిన జట్టుగా స్పెయిన్ నిలిచింది. పోర్చుగల్, స్విట్జర్లాండ్ జట్ల మధ్య ప్రిక్వార్టర్ ఫైనల్ విజేతతో ఈనెల 10న క్వార్టర్ ఫైనల్లో మొరాకో తలపడుతుంది.
మొరాకో ఘనత
► ప్రపంచకప్ చరిత్రలో క్వార్టర్ ఫైనల్ చేరిన నాలుగో ఆఫ్రికా దేశం మొరాకో. గతంలో కామెరూన్ (1990లో), సెనెగల్ (2002లో), ఘనా (2010లో) ఈ ఘనత సాధించాయి.
చదవండి: Virender Sehwags son: క్రికెట్‌లోకి సెహ్వాగ్ కొడుకు ఎంట్రీ.. ఢిల్లీ జట్టుకు ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment